HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >World Bank Loan For Musi Riverfront Project Center Govt 3 Objections

Musi Riverfront : ‘మూసీ రివర్ ఫ్రంట్’‌కు అప్పుల బాటలో అడ్డంకులు.. కేంద్రం కొర్రీలు

మూసీ రివర్‌ ఫ్రంట్‌(Musi Riverfront) అభివృద్ధి ప్రాజెక్టు కోసం ప్రపంచ బ్యాంకు నుంచి రుణం తీసుకునేందుకు 6 నెలల క్రితమే కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి శాఖ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది.

  • Author : Pasha Date : 16-05-2025 - 9:24 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Musi Riverfront Project World Bank Loan Telangana Govt Centre Govt

Musi Riverfront : మహానగరం హైదరాబాద్‌లో మురికి కూపంగా మారిన మూసీ నదిని ప్రక్షాళన చేసే దిశగా తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారు అడుగులు వేస్తోంది. అందుకోసమే మూసీ రివర్‌ ఫ్రంట్‌ అభివృద్ధి ప్రాజెక్టును తెరపైకి తెచ్చింది. ఈ ప్రాజెక్టు కోసం భారీ రుణం కావాలి. రూ.4100 కోట్ల రుణాన్ని ప్రపంచ బ్యాంకు నుంచి తీసుకోవాలని తెలంగాణ సర్కారు భావిస్తోంది. మరో రూ.1763 కోట్ల ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా భరించనుంది. అంటే రూ.5863 కోట్లలో  మూసీ రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టు పూర్తవుతుంది.ప్రపంచ బ్యాంకు దాకా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెళ్లాలంటే.. తొలుత కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల క్లియరెన్స్ పొందాలి. మూసీ రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టు విషయంలో మోడీ సర్కారును ఒప్పించాలి, మెప్పించాలి. ఈ దిశగా  కాంగ్రెస్ సర్కారు చేస్తున్న ప్రయత్నాల్లో ప్రస్తుతానికి ఆటంకాలు ఎదురవుతున్నాయి. అవేంటో చూద్దాం..

Also Read :Pakistan-India Ceasefire: మే 18 త‌ర్వాత భారత్-పాకిస్తాన్ మ‌ధ్య మ‌రోసారి యుద్ధం?

కేంద్రం అభ్యంతరాలు ఇవీ.. 

  • మూసీ రివర్‌ ఫ్రంట్‌(Musi Riverfront) అభివృద్ధి ప్రాజెక్టు కోసం ప్రపంచ బ్యాంకు నుంచి రుణం తీసుకునేందుకు 6 నెలల క్రితమే కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి శాఖ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది.
  • దీంతో తదుపరి దశలో కేంద్ర ఆర్థిక శాఖను తెలంగాణ సర్కారు సంప్రదించింది. హైదరాబాద్ వికాసం కోసం ఈ ప్రాజెక్టుకు క్లియరెన్స్ ఇవ్వమని కోరింది.
  • అయితే మూసీ రివర్‌ ఫ్రంట్‌ అభివృద్ధి ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను సమర్పించనిదే క్లియరెన్స్ ఇవ్వలేమని కేంద్ర ఆర్థిక శాఖ తేల్చి చెప్పింది.
  • ఆ ప్రాజెక్టు డీపీఆర్‌కు సాంకేతిక అనుమతులు, పర్యావరణ అనుమతులు మంజూరైన తర్వాతే క్లియరెన్స్ ఇస్తామని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది.
  •  కేంద్ర ఆర్థిక శాఖ కోరిన విధంగా మొత్తం ప్రక్రియను తెలంగాణ సర్కారు పూర్తి చేయడానికి మరో మూడు నెలల టైం పడుతుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
  • సమగ్ర డీపీఆర్‌ తయారయ్యాక..  వెంటనే కేంద్ర ప్రభుత్వం నుంచి పర్యావరణ అనుమతుల కోసం అప్లై చేయాలి.
  • ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాథమిక నివేదికను 2024 సంవత్సరం ఆగస్టులో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం అందించింది.
  • మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులో భాగంగా మురుగునీటి శుద్ధీకరణ, వరదనీరు సవ్యంగా వెళ్లేలా చర్యలు, వర్షపునీరు-మురుగునీరు కలిసి వెళ్లకుండా చర్యలు, ల్యాండ్‌స్కేప్‌ డెవలప్‌మెంట్‌ వంటి చర్యలన్నీ చేపడతారు.

Also Read :Nadendla Manohar : రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి గుడ్‌న్యూస్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Centre Govt
  • Musi Riverfront
  • Musi Riverfront Project
  • telangana
  • telangana govt
  • World Bank
  • World Bank Loan

Related News

New Policy on Fee Reimbursement in Telangana

Telangana Fee Reimbursement: తెలంగాణ ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో కొత్త పాలసీ!

తెలంగాణ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల దరఖాస్తు ప్రక్రియలో కీలకమైన సంస్కరణలు చేపట్టింది. ఇకపై ట్యూషన్ ఫీజుల కోసం దరఖాస్తు చేసుకోవాలంటే విద్యార్థుల పదో తరగతి మెమోలోని పేరు, ఇంటిపేరు వారి ఆధార్ కార్డులోని వివరాలతో కచ్చితంగా సరిపోలాల్సి ఉంటుంది. ఈ రెండింటిలో ఏమాత్రం తేడా ఉన్నా దరఖాస్తు ప్రక్రియ ముందుకు సాగదు. జాతీయ ఉపకార వేతనాల విధానానికి అనుగుణంగా

    Latest News

    • CM Vijay: సీఎంకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

    • Weight Loss: సడెన్‌గా బరువు తగ్గారా..?

    • CM Joseph Vijay: మీ విజయ్‌ మామ అండగా ఉంటాడు : సీఎం విజయ్‌

    • Cm Vijay: తొలి సంతకం ఉచిత విద్యుత్ పై సీఎం విజయ్

    • TVK Vijay: సీఎం‌గా దళపతి విజయ్ ప్రమాణస్వీకారం… హాజరైన ప్రముఖులు

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd