Woman jumps to death: జీడిమెట్లలో నవ వధువు ఆత్మహత్య.. కారణమిదే..?
- Author : Gopichand
Date : 09-12-2022 - 2:24 IST
Published By : Hashtagu Telugu Desk
హైదరాబాద్ లోని జీడిమెట్లలో నవ వధువు (newlywed woman) మొబైల్ ఫోన్‌తో ఎక్కువ సమయం గడుపుతుదంటూ భర్త నిత్యం దూషించడంతో టెర్రస్‌పై నుంచి దూకి ఆత్మహత్య (suicide) చేసుకుంది. మృతురాలు కె.శైలజ (20)కు రెండు నెలల క్రితం కె.గంగాప్రసాద్ (28)తో వివాహమై జీడిమెట్లలోని శ్రీసాయినగర్‌లో నివాసం ఉంటున్నారు. శైలజ గృహిణి కాగా, గంగా ప్రసాద్ ప్రైవేట్ ఉద్యోగి అని పోలీసులు తెలిపారు. శైలజకు మొబైల్ ఫోన్ అలవాటు ఉండటంతో ఆమె తల్లిదండ్రులు గతంలో హెచ్చరించడంతో పెళ్లి అయిన ఒక నెల వరకు ఆమె ఫోన్ ఉపయోగించడం మానేసింది.
అయితే ఇటీవల ఆమె భర్త మొబైల్ ఫోన్‌ను బహుమతిగా ఇవ్వడంతో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. శైలజకు ఫోన్‌పై అలవాటు పెరిగి గంగా ప్రసాద్‌పై మండిపడేది. గంగా ప్రసాద్ మొబైల్ పాస్‌వర్డ్ మార్చేందుకు ఆమె వద్ద నుంచి ఫోన్‌ను లాక్కున్నాడు. మొబైల్ తిరిగి ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటానని శైలజ భర్తను బెదిరించింది. అదే కారణంతో అతడితో గొడవ పడి తాను నివాసముంటున్న రెండంతస్తుల భవనం టెర్రస్‌పై నుంచి దూకింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మృతదేహాన్ని ఆమె తల్లిదండ్రులకు అప్పగించి జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌లో సీఆర్‌పీసీ సెక్షన్ 174 కింద కేసు నమోదు చేశారు.
Also Read: Vamsiram Builders: ఐటీ సోదాలు.. వంశీరామ్ బిల్డర్స్ ఎండీ ఇంట్లో తనిఖీలు