Dasara : మందుబాబులకు ముందే హెచ్చరిక జారీ చేసిన వైన్స్ షాప్స్
Dasara : ఇప్పటినుంచే వైన్స్ దుకాణదారులు ‘అక్టోబర్ 2న వైన్స్ బంద్’ (Wine shops closed) అంటూ ఫ్లెక్సీలు పెట్టి ప్రజలకు సమాచారం అందిస్తున్నారు
- By Sudheer Published Date - 07:46 PM, Fri - 26 September 25

తెలంగాణలో దసరా (Dasara) పండుగను ఎంతో గ్రాండ్ గా జరుపుకుంటారనే సంగతి తెలిసిందే. ఈసారి అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజునే దసరా జరగనుండటంతో, ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నాన్ వెజ్, ఆల్కహాల్ అమ్మకాలు పూర్తిగా నిషేధించబడతాయి. సాధారణంగా ప్రభుత్వం నిర్దిష్టమైన జాబితా ప్రకారం కొన్ని జాతీయ పండుగలు, ప్రత్యేక దినాల్లో మద్యం షాపులను మూసివేయాలని ఆదేశిస్తుంది. కానీ ఈసారి దసరా వంటి భారీ పండుగ అదే రోజున పడటంతో, వైన్స్ షాపులు, హోటళ్లు ఎక్కువగా ప్రభావితమవుతున్నాయి.
BSNL : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్‌న్యూస్
ఇప్పటినుంచే వైన్స్ దుకాణదారులు ‘అక్టోబర్ 2న వైన్స్ బంద్’ (Wine shops closed) అంటూ ఫ్లెక్సీలు పెట్టి ప్రజలకు సమాచారం అందిస్తున్నారు. సాధారణంగా ఇలాంటి బోర్డులు పండుగకు 1-2 రోజుల ముందు మాత్రమే పెట్టే రీతిలో ఉంటాయి. అయితే ఈసారి ముందుగానే పెట్టడం ద్వారా వినియోగదారులకు ఒక ‘హింట్’ ఇస్తున్నట్లుగా కనిపిస్తోంది. అంటే ముందుగానే స్టాక్ చేసుకోవాలని వినియోగదారులకు సూచిస్తున్నట్లుగా పరిస్థితి మారింది. ఈ నేపథ్యంలో చాలా మంది పండుగకు ముందు రోజే అవసరమైన మద్యం కొనుగోలు చేసుకోవాలని ఆలోచిస్తున్నారు.
ఇక నాన్ వెజ్ వ్యాపారుల విషయానికొస్తే.. వారి వ్యాపారం కూడా కొంత మేరకు ప్రభావితం కావడం ఖాయం. దసరా రోజు సాధారణంగా భారీగా నాన్ వెజ్ విక్రయాలు జరిగే పరిస్థితి ఉంటుంది. కానీ అక్టోబర్ 2న నిషేధం అమలులోకి రావడంతో, వారు ముందుగానే వ్యూహాలు రచించే అవకాశముంది. దసరా ముందు రోజు ప్రత్యేక ఆఫర్లు పెట్టడం లేదా రెండు రోజుల ముందే ఎక్కువ సేల్స్ జరగేలా ప్లాన్లు వేసే అవకాశం ఉంది. ఈసారి దసరా-గాంధీ జయంతి కలిసొచ్చిన కారణంగా, వినియోగదారుల వ్యూహాలు, వ్యాపారుల వ్యూహాలు రెండూ ముందుగానే మారుతున్నాయి.