HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Will Be Part Of Revitalization Of Revenue Department Tgrsa

TGRSA: రెవెన్యూ శాఖ పున‌రుద్ధ‌ర‌ణ‌లో భాగ‌మ‌వుతాం: టీజీఆర్ఎస్ఏ

తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో రెవెన్యూ ఉద్యోగుల‌ను భాగం చేయాల‌నే ల‌క్ష్యంతో తెలంగాణ రెవెన్యూ స‌ర్వీసెస్ అసోసియేష‌న్‌(టీజీఆర్ఎస్ఏ)ను ఏర్పాటు చేశామ‌ని ల‌చ్చిరెడ్డి తెలిపారు.

  • Author : Gopi Date : 08-12-2024 - 11:31 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
TGRSA
TGRSA

TGRSA: రాష్ట్రంలో చిన్నాభిన్న‌మైన రెవెన్యూ వ్య‌వ‌స్థ‌ను తిరిగి పున‌రుద్ధ‌రించేందుకు ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నించ‌డం సంతోష‌క‌ర‌మ‌ని, ఈ ప్ర‌య‌త్నంలో రెవెన్యూ ఉద్యోగులుగా అంద‌రం భాగ‌స్వాములం అవుతామ‌ని తెలంగాణ ఉద్యోగుల (TGRSA) జేఏసీ చైర్మ‌న్ వి.ల‌చ్చిరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ల‌క్డీక‌పూల్‌లోని అశోక హోట‌ల్‌లో తెలంగాణ రెవెన్యూ స‌ర్వీసెస్ అసోసియేష‌న్‌(టీజీఆర్ఎస్ఏ) రాష్ట్ర స్థాయి ఆత్మీయ స‌మావేశం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా వి.ల‌చ్చిరెడ్డి హాజ‌రై ప్ర‌సంగించారు. గ‌త ప్ర‌భుత్వం గ్రామ స్థాయి రెవెన్యూ వ్య‌వ‌స్థ‌ను ఎత్తేయ‌డం వ‌ల్ల మొత్తం రెవెన్యూ వ్య‌వ‌స్థ‌నే నిర్వీర్యం అయ్యింద‌ని ఆయ‌న పేర్కొన్నారు. వీఆర్ఏ, వీఆర్వో వ్య‌వ‌స్థ‌ల‌ను తీసేయ‌డం వ‌ల్ల గ్రామ స్థాయిలో పోలీసు వ్య‌వ‌స్థ లేకుండా పోయింద‌ని, ఫ‌లితంగా ల‌గ‌చ‌ర్ల వంటి ఘ‌ట‌న‌లు జ‌రిగే ప‌రిస్థితి వ‌చ్చింద‌ని అన్నారు. మ‌ళ్లీ వీఆర్ఏ, వీఆర్వో వ్య‌వ‌స్థ‌ను పున‌రుద్ధ‌రించేందుకు ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తుండ‌టం స్వాగ‌తించాల్సిన విష‌య‌మ‌ని అన్నారు. గ్రామ స్థాయి రెవెన్యూ వ్య‌వ‌స్థ‌ను పున‌ర్మించాల‌ని నిర్ణ‌యం తీసుకున్న మ‌ఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ల‌చ్చిరెడ్డి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. గ్రామానికో రెవెన్యూ అధికారిని ఏర్పాటుచేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకోవ‌డం మంచి ప‌రిణామ‌మ‌ని అన్నారు. గ్రామీణ స్థాయి నుంచి రెవెన్యూ స‌మ‌స్య‌లు ప‌రిష్కార‌మ‌య్యే వ్య‌వ‌స్థ‌ను, అప్పీల్ వ్య‌వ‌స్థ‌ను తీసుకురావాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించ‌డం ఆహ్వానించాల్సిన అంశ‌మ‌ని పేర్కొన్నారు. కొత్త ఆర్వోఆర్ చట్టం అమ‌లు కోసం శ‌క్తివంచ‌న లేకుండా ప‌ని చేస్తామ‌ని అన్నారు.

అన్ని స్థాయిల ఉద్యోగుల‌తో టీజీఆర్ఎస్ఏ

తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో రెవెన్యూ ఉద్యోగుల‌ను భాగం చేయాల‌నే ల‌క్ష్యంతో తెలంగాణ రెవెన్యూ స‌ర్వీసెస్ అసోసియేష‌న్‌(టీజీఆర్ఎస్ఏ)ను ఏర్పాటు చేశామ‌ని ల‌చ్చిరెడ్డి తెలిపారు. రెవెన్యూ శాఖ‌లోని ఆఫీస్ స‌బార్డినేట్ నుంచి డిప్యూటీ త‌హ‌శీల్దార్ వ‌ర‌కు అన్ని స్థాయిల ఉద్యోగుల‌కు ఈ సంఘం ప్రాతినిథ్యం వ‌హిస్తుంద‌ని ఆయ‌న చెప్పారు. రెవెన్యూ ఉద్యోగుల‌ను ఐక్యం చేసి, స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి చేసే వేదిక‌గా టీజీఆర్ఎస్ఏ ప‌ని చేస్తుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. సంఘం నూత‌న కార్య‌వ‌ర్గానికి ఆయ‌న శుభాకాంక్ష‌లు తెలిపారు.

Also Read: Stampede at Sandhya Theatre : సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట.. థియేటర్ యజమాని అరెస్ట్

రెవెన్యూ ఉద్యోగుల స‌మ‌స్య‌ల ప‌రిష్కార‌మే టీజీఆర్ఎస్ఏ ల‌క్ష్యం: బాణాల రాంరెడ్డి

గ‌తంలో విధ్వంస‌మైన రెవెన్యూ వ్య‌వ‌స్థ‌ను తిరిగి గాడిలో పెట్టేందుకు ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌ల‌కు ధ‌న్య‌వాదాలు తెలుపుతున్న‌ట్టు టీజీఆర్ఎస్ఏ నూత‌న అధ్య‌క్షుడు బాణాల రాంరెడ్డి పేర్కొన్నారు. రెవెన్యూ శాఖ‌లో క్షేత్ర‌స్థాయిలో ఉద్యోగుల సంఖ్య త‌గ్గి, ప‌నిభారం విప‌రీతంగా పెరిగిపోయింద‌ని అన్నారు. గ్రామ‌, మండ‌ల‌, డివిజ‌న్ స్థాయిలో ప‌రిష్క‌రించాల్సిన రెవెన్యూ స‌మ‌స్య‌ల‌ను గ‌త ప్ర‌భుత్వం రాష్ట్ర స్థాయికి తీసుకెళ్లింద‌ని పేర్కొన్నారు. గ్రామ‌స్థాయి రెవెన్యూ అధికారి లేక‌పోవ‌డం వ‌ల్ల ప్ర‌భుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చూసే వారు లేర‌ని అన్నారు. ఈ అంశాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న ప్ర‌భుత్వం.. ప్ర‌జ‌ల‌కు రెవెన్యూ శాఖ‌ను చేరువ చేస్తూ కొత్త రెవెన్యూ చ‌ట్టం చేస్తున్న‌ద‌ని అన్నారు. ఈ చ‌ట్టాన్ని టీజీఆర్ఎస్ఏ స్వాగ‌తిస్తున్న‌ద‌ని, ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ధ‌న్య‌వాదాలు తెలుపుతున్నామ‌ని పేర్కొన్నారు. రెవెన్యూ ఉద్యోగుల స‌మ‌స్య‌ల ప‌రిష్కార‌మే ల‌క్ష్యంగా టీజీఆర్ఎస్ఏ ప‌ని చేయ‌నున్న‌ట్టు తెలిపారు. ఆఫీస్ స‌బార్డినేట్ నుంచి డిప్యూటీ త‌హ‌శీల్దార్ వ‌ర‌కు అన్ని స్థాయిల రెవెన్యూ ఉద్యోగుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి త‌మ సంఘం ప‌ని చేస్తుంద‌ని ఆయ‌న తెలిపారు. స‌మ‌స్య‌ల‌ను ప్ర‌భుత్వం దృష్టికి తీసుకెళ్లి, సానుకూల నిర్ణ‌యం తీసుకునేలా చొర‌వ తీసుకుంటామ‌ని పేర్కొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో డిప్యూటీ క‌లెక్ట‌ర్స్ అసోసియేష‌న్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కె.రామ‌కృష్ణ‌, టీజీటీఏ అధ్య‌క్షుడు ఎస్‌.రాములు, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ర‌మేశ్ పాక‌, సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ ఫూల్ సింగ్ చౌహాన్‌, మహిళా అధ్య‌క్షురాలు రాధ‌, కోశాధికారి శ్రీనివాస్ శంక‌ర్‌రావు, త‌దిత‌రులు పాల్గొని ప్రసంగించారు.

టీజీఆర్ఎస్ఏ నూత‌న క‌మిటీ ఎన్నిక‌

టీజీఆర్ఎస్ఏ రాష్ట్ర‌ నూత‌న క‌మిటీని ఈ స‌మావేశంలో ఏక‌గ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్య‌క్షుడిగా బాణాల రాంరెడ్డి, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా బిక్షం, కోశాధికారిగా మ‌ల్లేశ్‌, మ‌హిళా విభాగం అధ్య‌క్షురాలిగా సుజాత చౌహాన్ ఎన్నిక‌య్యారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm revanth
  • hyderabad
  • Minister Ponguleti
  • telangana
  • telugu news
  • TGRSA
  • vra
  • VRO

Related News

'Towing' food app launched in Vijayawada.

Toing Food Delivery app: విజయవాడలో ‘టోయింగ్’ ఫుడ్ యాప్ ప్రారంభం

Toing : దేశంలోనే అత్యంత సరసమైన ధరలకే ఆహారాన్ని డెలివరీ చేసే ప్రముఖ యాప్ ‘టోయింగ్’ (Toing) విజయవాడ నగరంలో తన సేవలను అధికారికంగా ప్రారంభించింది. సెప్టెంబర్ 2025లో పూణే వేదికగా మొదలైన ఈ సరికొత్త యాప్, కేవలం ఎనిమిది నెలల స్వల్ప వ్యవధిలోనే దేశవ్యాప్తంగా చకచకా విస్తరించి, విజయవాడతో కలిపి మొత్తం 49 నగరాలకు చేరుకుంది. టోయింగ్ యాప్ ప్రధాన ప్రత్యేకత ఏమిటంటే… ఇందులో లభించే ఆహార పదార్థా

  • Zepto

    Zepto : ఎక్స్‌పైరీ ఫుడ్ డెలివరీపై చర్యలు.. జెప్టో వేర్‌హౌస్‌లో సోదాలు

  • MIssing Case

    Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

  • Pawan Kalyan inaugurated the Jana Sena Party office in Telangana.

    Janasena: తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించిన పవన్ కల్యాణ్

  • Engineering counselling in Telangana begins today.

    TS EAPCET 2026: తెలంగాణలో నేటి నుంచి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్

Latest News

  • Skin Glow : స్కిన్ గ్లో కోసం అదిరిపోయే న్యూట్రియెంట్స్

  • Giorgia Meloni: ట్రంప్ పై మెలోని ఫైర్

  • Live Kitchen: హైదరాబాద్ లో ‘లైవ్ కిచెన్’ ఆవిష్కరణ

  • CM Chandrababu : సీఎం చంద్ర‌బాబుని క‌లిసిన గాదె సాయికృష్ణ త‌ల్లి

  • Shani Anugraham: శని పీడ తొలగిపోవాలంటే శనీశ్వరుడికి.. ఈ వస్తువు సమర్పించాల్సిందే!

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd