Congress: తెలంగాణ మహిళా కాంగ్రెస్‌కు కొత్త చీఫ్.. రేసులో ఆ ముగ్గురు
ఇటీవలే మూడు రాష్ట్రాలలో మహిళా కాంగ్రెస్ అధ్యక్షులను నియమించారు.
- By Pasha Published Date - 09:58 AM, Wed - 14 August 24

Congress: ఇటీవలే మూడు రాష్ట్రాలలో మహిళా కాంగ్రెస్ అధ్యక్షులను నియమించారు. కర్ణాటక మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సౌమ్య రెడ్డి, చండీగఢ్‌కు నందిత హుడా, అరుణాచల్ ప్రదేశ్‌కు చుకునచ్చి నియమితులు అయ్యారు. త్వరలోనే తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌కు కూడా నూతన అధ్యక్షురాలిని నియమించనున్నారు. గద్వాల్ మాజీ జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ , కాంగ్రెస్ నాయకురాలు సరితా తిరుపతయ్య, బడంగిపేట మేయర్ పారిజాత నర్సింహా రెడ్డితోపాటు బీసీ మహిళ సరిత పేరును ఏఐసీసీకి తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురిలో ఒకరికి మహిళా కాంగ్రెస్(Congress) పదవి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join
అయితే ప్రస్తుతం తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న సునీతారావు వాదన మరోలా ఉంది. తాను సిఫారసు చేస్తున్న నీలం పద్మకే ఆ పదవి కేటాయించాలని ఆమె కోరుతున్నారు. ఇందుకోసం సునీతారావు ఢిల్లీకి వెళ్లి జాతీయ స్థాయిలో లాబీయింగ్ చేస్తున్నారు. తనకు ఏదైనా నామినేటెడ్ పదవిని కేటాయించిన తర్వాతే.. మహిళా కాంగ్రెస్ పదవి నుంచి తొలిగించాలని సునీతారావు అంటున్నారు. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలి కోటా కింద సునీత గత అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన వారందరికీ ఏడాదిపాటు పదవులు ఇవ్వకూడదని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించింది. ఈ లెక్కన వెంటనే సునీతారావుకు నామినేటెడ్ పదవి దొరికే అవకాశాలు దాదాపు లేవు అని పార్టీ వర్గాలు అంటున్నాయి.
నేడు కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ షురూ
సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో భాగంగా కాగ్నిజెంట్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈనేపథ్యంలో ఇవాళ కోకాపేటలో కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్‌కు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. హైదరాబాద్ లో 10 లక్షల చదనపు అడుగుల కొత్త క్యాంపస్‌ను కాగ్నిజెంట్ ఏర్పాటు చేయబోతోంది. దీని ద్వారా అదనంగా 15 వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డిజిటల్ ఇంజనీరింగ్, క్లౌడ్ సొల్యూషన్స్‌తో సహా వివిధ అధునాతన సాంకేతికతలపై ఈ క్యాంపస్ ఫోకస్ చేయనుంది.