Best Upcoming Cars : రూ.10 లక్షలలోపు బడ్జెట్.. త్వరలో విడుదలయ్యే మూడు బెస్ట్ కార్స్
కుటుంబంతో కలిసి టూర్లకు వెళ్లేందుకు, సుదూర ప్రాంతాలకు జర్నీ చేసేందుకు కార్లు చాలా బెస్ట్.
- By Pasha Published Date - 08:43 AM, Wed - 14 August 24

Best Upcoming Cars : కుటుంబంతో కలిసి టూర్లకు వెళ్లేందుకు, సుదూర ప్రాంతాలకు జర్నీ చేసేందుకు కార్లు చాలా బెస్ట్. అందుకే చాలామంది కార్లు కొంటుంటారు. మీరు కూడా కొత్త కారు కొనాలని భావిస్తున్నారా ? మంచి మోడల్ కోసం వెతుకుతున్నారా ? రూ.10 లక్షలలోపు బడ్జెట్‌లో వచ్చే కొన్ని కొత్త కార్ల(Best Upcoming Cars) సమాచారాన్ని మీ కోసమే తీసుకొచ్చాం. వివరాలివీ..
We’re now on WhatsApp. Click to Join
మారుతీ స్విఫ్ట్ హైబ్రిడ్ (Maruti Swift Hybrid)
- మారుతీ కార్లు మనదేశంలో చాలా ఫేమస్. వీటి వినియోగం చాలా ఎక్కువ.
- ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న మారుతీ స్విఫ్ట్ హైబ్రిడ్ మోడల్ కారు సెప్టెంబరు 1న విడుదల కాబోతోంది.
- దీని ధర రూ.10 లక్షలలోపే ఉంటుంది.
- పెట్రోల్‌తో ఈ కారు నడుస్తుంది. ఒకేసారి 37 లీటర్ల పెట్రోలును ట్యాంకులో పోయించుకోవచ్చు.
- ఈ కారులో ఐదుగురు కూర్చోవచ్చు.
- దీనిలో 1.2L K12C Dual-jet ఇంజిన్ ఉంది.
- ఈ కారులో ట్రాన్స్‌మిషన్ ఆటోమేటిక్‌గా జరుగుతుంది.
హోండా డబ్ల్యూఆర్ – వీ (Honda WR-V)
- హోండా కంపెనీ కార్లు అంటే క్వాలిటీకి కేరాఫ్ అడ్రస్. వీటి వినియోగం కూడా మన దేశంలో ఎక్కువే.
- హోండా డబ్ల్యూఆర్-వీ మోడల్ కారు ఆగస్టు 31న మార్కెట్లోకి విడుదల కాబోతోంది.
- దీన్ని కొనేందుకు రూ.8 లక్షలు ఉంటే చాలు.
- ఈ కారు కూడా పెట్రోలుతో నడుస్తుంది.
- 1199 సీసీ ఇంజిన్‌తో ఈ కారు పనిచేస్తుంది.
- ఈ కారులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి.
- ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESP), ఆటో హై బీమ్ లాంటి ఫీచర్స్ సైతం ఉన్నాయి.
- దీనిలో ట్రాన్స్‌మిషన్ మ్యానువల్‌గా జరుగుతుంది.
Also Read :Kamikaze Drones : భారత్ అమ్ములపొదిలో స్వదేశీ కామికాజి డ్రోన్లు.. ఏమిటివి ?
సిట్రోఎన్ బసాల్ట్ ప్లస్ టర్బో ఏటీ (Citroen Basalt Plus Turbo AT)
- సిట్రోఎన్ బసాల్ట్ ప్లస్ టర్బో ఏటీ కారు ఆగస్టు 15న మార్కెట్లోకి విడుదల కానుంది.
- దీని ధర కేవలం రూ.7.99 లక్షలే.
- ఈ కారు పెట్రోలుతో నడుస్తుంది. ఫ్యూయెల్ ట్యాంకులో 45 లీటర్ల పెట్రోలును పోసుకోవచ్చు.
- ఇది లీటరుకు 19.05 కి.మీ మైలేజీని అందిస్తుంది.
- ఈ కారులో ఐదుగురు కూర్చోవచ్చు.
- 6 స్పీడ్ గేర్ బాక్స్ కారులో ఉంది.
- ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ పద్ధతిలో ఇది పనిచేస్తుంది.
- దీనిలో ప్యూర్ టెక్ 110 ఇంజిన్‌ను వినియోగించారు.
- ఈ కారులో యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది.
- సెంట్రల్ లాకింగ్, చైల్డ్ సేఫ్టీ లాకింగ్ సిస్టమ్స్ కూడా ఉన్నాయి. అందుకే చిన్న పిల్లలు ఉన్న వారికి ఈ కారు సేఫ్.