JP NADDA: నరేంద్ర మోడీని వ్యతిరేకిస్తే.. దేశాన్ని వ్యతిరేకించినట్లే: జేపీ నడ్డా
నేడు హైదరాబాదులో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు మొదలయ్యాయి. ఈ సమావేశాలు రెండు రోజులపాటు జరగనున్నాయి.
- Author : Anshu
Date : 02-07-2022 - 10:41 IST
Published By : Hashtagu Telugu Desk
నేడు హైదరాబాదులో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు మొదలయ్యాయి. ఈ సమావేశాలు రెండు రోజులపాటు జరగనున్నాయి. ఇక ఈ సమావేశం కోసం దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తాజాగా హైదరాబాద్ కు చేరుకున్నారు. ఇక ఈ సమావేశాన్ని ప్రారంభించిన తర్వాత పార్టీ చీఫ్ నడ్డా ప్రసంగించారు. ఈ క్రమంలోనే మొదట NEC సమావేశంలో స్వతంత్ర ఉద్యమ త్యాగ ధనులకు శ్రద్ధాంజలి ఘటించారు జేపీ నడ్డా. ఈ సందర్భంగా జేపీ నడ్డా మాట్లాడుతూ..పేద, వెనుకబడిన వర్గాల అభివృద్ది కోసం దేశ ప్రధానమంత్రి మోడీ గత 8 సంవత్సరాలలో చేసిన కృషిని ప్రశంసించారు.
అదేవిధంగా నరేంద్ర మోడీ చేసిన సేవా కార్యక్రమాలు, పథకాల గురించి మాట్లాడుతూ నరేంద్ర మోడీని ప్రశంశలతో ముంచెత్తారు జేపీ నడ్డా. మోడీ పేదల అభివృద్ది కోసం రుపొందించిన పథకాలను అభినందించారు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ వర్గాల ఉన్నతి కోసం చేపట్టిన స్కీముల గురించి ప్రస్తావించారు. అలాగే కరోనా సమయంలొ ప్రతి ప్రాంతంలో సేవ చేసిన కార్యకర్తలకు అభినందలు తెలిపారు. అలాగే 25 నెలలు పాటు 80 కోట్ల ప్రజలకు ఉచిత ఆహార భద్రత అందించిన విషయాన్ని ప్రస్తావిస్తూ మోడీని అభినందించారు.
ఇక ప్రధాని పేదల అభివృద్ది కోసం చేపట్టిన కార్యక్రమాలు ప్రతి కార్యకర్తకు ఆదర్శం అన్నారు. గోవా, మణిపూర్, యూపీ రాష్ట్రాలలో పార్టీ గెలుపునకు కృషి చేసిన కార్యకర్తలను అభినందించారు. బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో దాడుల్లో ప్రాణాలు కోల్పోతున్న కార్యకర్తల గురించి అలాగే కాశ్మీర్ వేర్పాటు వాదుల చేతిలో అంతమైన కార్యకర్తల త్యాగాలను కూడా స్మరించుకున్నారు జేపీ నడ్డా. అదే విధంగా దేశాన్ని తప్పుదోవ పట్టించే విపక్షాల ప్రయత్నాల పై ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అలాగే దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని వ్యతిరేకిస్తే దేశాన్ని వ్యతిరేకించినట్లే అని తెలిపారు జేపీ నడ్డా. ఈ సందర్భంగా జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.
ఈరోజు, గౌరవనీయుల సమక్షంలో. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌లో ప్రధాన మంత్రి శ్రీ @narendramodi ji, గౌరవనీయులైన BJP జాతీయ అధ్యక్షులు శ్రీ @JPNadda జీ జ్యోతి వెలిగించి, సమావేశంలో ప్రసంగించి బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాన్ని ప్రారంభించారు.#BJPNECInTelangana pic.twitter.com/ziBUpmeyBm
— Office of JP Nadda (@OfficeofJPNadda) July 2, 2022