Telangana Battalion Constables: తెలంగాణ బెటాలియన్ కానిస్టేబుళ్ల సమస్య ఏమిటి? డీజీపీ ఏమన్నారంటే?
జిల్లాల స్థాయిలో నేర విచారణ చేయడం, నేరాలు నిరోధించడం నేరస్తులను గుర్తించడం వంటి విధులను సివిల్ పోలీస్ సిబ్బంది చేస్తుండగా వారికి బందోబస్తు తదితర విధులలో ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ సహాయపడుతుంటారు.
- By Gopichand Published Date - 12:26 AM, Sun - 27 October 24

Telangana Battalion Constables: తెలంగాణ రాష్ట్ర స్పెషల్ పోలీస్ (Telangana Battalion Constables) సిబ్బంది నిర్వహిస్తున్న విధులు కొన్ని దశాబ్దాల నుండి అమలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర విభజనకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో టీజీఎస్పీ పోలీసు సిబ్బంది విధి విధానాలు అమలు జరిగినట్లుగానే తెలంగాణ రాష్ట్రంలోనూ కొనసాగుతున్నాయి. పోలీసు సిబ్బంది నియామకాలకు ముందు అభ్యర్థులు ఆప్షన్ ఎంపిక చేసుకున్న విధంగా సివిల్, ఆర్మ్డ్ రిజర్వ్, స్పెషల్ పోలీస్ ఎంపికలు జరుగుతాయి. అందరికీ ఓకే రాత పరీక్ష నిర్వహిస్తున్నప్పటికీ వారికి వచ్చిన మెరిట్ ఆధారంగా ఆ ఎంపికలు అభ్యర్థులు కోరుకున్న విధంగా జరిగాయి.
జిల్లాల స్థాయిలో నేర విచారణ చేయడం, నేరాలు నిరోధించడం నేరస్తులను గుర్తించడం వంటి విధులను సివిల్ పోలీస్ సిబ్బంది చేస్తుండగా వారికి బందోబస్తు తదితర విధులలో ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ సహాయపడుతుంటారు. కానీ, టీజీఎస్పీ పోలీస్ సిబ్బంది రాష్ట్రవ్యాప్తంగా ఉన్న శాంతి భద్రతల అంశాలలో విధులు నిర్వహిస్తుంటారు. ఎన్నికల సమయంలో ఇతర రాష్ట్రాల్లో అప్పగించిన బాధ్యతలను సైతం అద్భుతంగా నిర్వహించిన ఘనత టీజీఎస్పీ సిబ్బందికి ఉంది. దాదాపుగా అన్ని రాష్ట్రాలు ఈ రకమైన విధానాలనే అమలు చేస్తున్నాయి.
టీజీఎస్పీ సిబ్బంది సమస్యలను మెరిట్ ప్రాతిపదికన సానుభూతితో పోలీస్ శాఖ పరిశీలిస్తుంది. ఇతర ప్రభుత్వ విభాగాల ఉద్యోగులకు ఎవరికీ లేని విధంగా టీజీఎస్పీ సిబ్బందికి సరెండర్ లీవులు, అడిషనల్ సరెండర్ లీవులు మంజూరు చేసేవారు. పండుగలు, సెలవుల సందర్భాలలో టీజీఎస్పీ సిబ్బంది నిర్వహించే విధులను దృష్టిలో ఉంచుకొని వారికి ఈ సౌకర్యం కల్పిస్తున్నాయి.
Also Read: Sabarimala: శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు కేంద్రం గుడ్ న్యూస్
అంతేకాకుండా రాష్ట్రంలో పోలీస్ సిబ్బందికి చెల్లించే వేతనాలు, భత్యాలు ఇతర రాష్ట్రాల పోలీస్ సిబ్బందితో పోలిస్తే అధికంగా ఉన్నాయి. భద్రత, ఆరోగ్య భద్రత వంటి సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ సిబ్బంది కోసం సంక్షేమ కార్యక్రమాలను చేపడుతుంది. ఈ పరిస్థితుల్లో టీజీఎస్పీ సిబ్బంది ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం సమంజసం కాదని అధికారులు చెబుతున్నారు. యూనిఫామ్ ధరించే టీజీఎస్పీ సిబ్బంది అత్యంత క్రమశిక్షణ తో విధులను నిర్వహించాల్సి ఉంటుంది. క్రమశిక్షణతో విధ్యుక్త ధర్మాన్ని నిర్వహిస్తూ పోలీస్ శాఖ ప్రతిష్టను దిగుణీకృతం చేయాల్సిన సిబ్బంది పోలీస్ శాఖకు మచ్చ తెచ్చే విధంగా వ్యవహరించకూడదంటున్నారు.
సమస్యలను సరైన పద్ధతిలో పరిశీలిస్తామని టీజీఎస్పీ పోలీస్ సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు తెలియజేస్తున్నాను. యథావిధిగా టీజీపీఎస్పీ సిబ్బంది వారి సాధారణ విధులను నిర్వహించాలి. సమస్యలు ఏమైనా ఉంటే వారి కోసం నిర్వహిస్తున్న “దర్బార్” కార్యక్రమం ద్వారా వారి అధికారులకు/కమాండెంట్లకు/అడిషనల్ డిజిపి కి తెలపాల్సి ఉంటుంది. యూనిఫామ్ సిబ్బంది క్రమశిక్షణ రాహిత్యంగా వ్యవహరించడం, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం తీవ్రమైన విషయంగా పరిగణించాల్సి వస్తుంది. Police Forces (Restriction on Rights) Act, Police (Incitement of Disaffection) Act, Police Manual ప్రకారం చట్టపరమైన, పరిపాలనాపరమైన కఠిన చర్యలు ఉంటాయని తెలంగాణ డీజీపీ తెలిపారు.