HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >What Does The Telangana Government Expect From The Union Budget 2024

Union Budget 2024 : కేంద్ర బడ్జెట్‌ నుంచి తెలంగాణ ప్రభుత్వం ఆశిస్తున్న అంశాలివీ..

రేపు పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ ప్రభుత్వం గంపెడు ఆశలు పెట్టుకుంది.

  • Author : Pasha Date : 22-07-2024 - 2:40 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Transgenders for traffic control: CM orders to officials
Transgenders for traffic control: CM orders to officials

Union Budget 2024 : రేపు పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ ప్రభుత్వం గంపెడు ఆశలు పెట్టుకుంది. రాష్ట్రానికి సంబంధించి వివిధ రంగాలకు కేటాయింపులు జరుగుతాయనే అంచనాలతో రాష్ట్ర సర్కారు ఉంది. దీనిపై ఇవాళ సాయంత్రం పలువురు కేంద్ర మంత్రులు, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను(Union Budget 2024) కలిసి సీఎం రేవంత్ చర్చించే అవకాశం ఉంది. ప్రత్యేకించి ఏపీ, తెలంగాణ మధ్య పంపిణీకి నోచుకోకుండా మిగిలిన పలు ప్రభుత్వరంగ సంస్థల్లోని ఫిక్స్‌డ్ డిపాజిట్లు, బ్యాంకు ఖాతాల్లోని ఫండ్స్‌ను అందించే ఏర్పాట్లు  చేయాలని కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది. ఏపీ నుంచి తెలంగాణకు రావాల్సిన బకాయిల జాబితాను కూడా రెడీ చేశారు. ఈ అంశాలు విభజన చట్టం అమలుకు నోడల్ ఏజెన్సీగా ఉన్న కేంద్ర హోంశాఖతో ముడిపడి ఉన్నందున అక్కడే సెటిల్ చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.

We’re now on WhatsApp. Click to Join

ప్రతి జిల్లాకూ రూ.50 కోట్లు చొప్పున తెలంగాణ రాష్ట్రంలోని 9 వెనకబడిన జిల్లాలకు సంవత్సరానికి రూ.450 కోట్లు రావాల్సి ఉంది. గత నాలుగేళ్లుగా ఆ నిధులు రిలీజ్ కాలేదు. దీంతో వాటిని విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వ పెద్దలను సీఎం రేవంత్ కోరనున్నారు. ఏపీ జెన్‌కో నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు, రాష్ట్ర విభజన సందర్భంగా కమర్షియల్ టాక్స్ డిపార్టుమెంటుకు చెందిన నిధులు, తెలంగాణ ఏర్పడిన కొత్తలో పొరపాటున ఏపీ ఖాతాలో జమ అయిన డబ్బులను తిరిగి సెటిల్ చేయాలని కేంద్ర సర్కారును తెలంగాణ ప్రభుత్వం  అడుగుతోంది.

Also Read :AP Assembly Session : కాసేపట్లో ఏపీ అసెంబ్లీ సెషన్ షురూ.. వైఎస్సార్ సీపీ కీలక నిర్ణయం

ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన లాంటి పథకాలకు సంబంధించిన పెండింగ్ నిధులను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ సర్కారు కోరుతోంది. గత ప్రభుత్వంలో పంటలకు నష్టపరిహారం, రైతుబంధు, దళితబంధు, వెనకబడిన వర్గాలకు ఆర్థిక సాయం లాంటి అనేక పథకాలు నిధులు లేక అమలుకు నోచుకోలేదు. ఈసారి వాటి అమలుకు సహకరించాలని కేంద్రాన్ని సీఎం రేవంత్ టీమ్ కోరుతోంది.  ఈక్రమంలో ఇప్పటికే ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్‌షా‌లను సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth) కలిశారు. కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో వచ్చే నిధులు కాస్త పెరగొచ్చని తెలంగాణ ఫైనాన్స్ డిపార్టుమెంట్ అధికారులు అంచనా వేస్తున్నారు.

Also Read :Hyderabad Land Deals : మూడు నెలల్లో హైదరాబాద్‌లో ఒక్కటే ల్యాండ్ డీల్.. ఎందుకలా ?

  • విభజన చట్టం ప్రకారం.. తెలంగాణకు మంజూరైన ట్రైబల్ యూనివర్సిటీ ఏడు సంవత్సరాల్లో కేంద్రం నుంచి రెండు విడతల్లో రూ.889.07 కోట్లు రావాల్సి ఉంది. దానిలో ఒక ఇన్‌స్టాల్‌మెంట్‌ను ఈసారి విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది.
  • రాష్ట్ర విభజన సందర్భంగా అనంతపూర్, కర్నూలు జిల్లాల్లోని డిస్కంల రుణభారం తెలంగాణపై పడింది. దీంతో సుమారు రూ.24,106 కోట్లు ఏపీ చెల్లించాల్సి ఉంది. రెండేండ్ల పాటు ఏపీ నుంచి తెలంగాణ విద్యుత్ వాడుకున్నందున.. కట్టాల్సిన రూ.6,756 కోట్లను మినహాయించి మిగిలినదాన్ని చెల్లించాలి.
  • ఉమ్మడి రాష్ట్రంలో ప్రజారుణం పద్దు కింద ఎక్సెటర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్టులకు ఉద్దేశించిన రూ.17,666.66 కోట్లలో రూ.8,737.29 కోట్లే రెండు రాష్ట్రాల మధ్య పంపిణీ జరిగింది. ఇంకా రూ.8,929.37 కోట్లు జనాభా నిష్పత్తిలో రెండు రాష్ట్రాల మధ్య పంచాల్సి ఉంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm revanth
  • telangana government
  • Union Budget 2024

Related News

Cwc Meeting

కాసేపట్లో CWC కీలక భేటీ, కీలక నేతలంతా హాజరు

AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(CWC) భేటీ కానుంది. అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంకా గాంధీలతో పాటు PCC అధ్యక్షులు, CLP నేతలు, CMలు హాజరుకానున్నారు

  • Ias Officers Transfer In Te

    తెలంగాణ లో పెద్ద ఎత్తున ఐఏఎస్‌ల బదిలీలు

  • Harish Rao

    చీకటి జీవోల మాటున ఏం చేస్తున్నావ్ రేవంత్ – హరీశ్ రావు ఘాటు వ్యాఖ్యలు

  • Pacs Elections Telangana

    సొసైటీల ఎన్నికలను రద్దు చేసే ఆలోచనలో తెలంగాణ సర్కార్ ?

  • CM Revanth

    కొత్త పథకాలను ప్రవేశ పెట్టేందుకు రేవంత్ ప్రభుత్వం కసరత్తు

Latest News

  • సరికొత్త రూపంలో టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్.. అదిరిపోయే డిజైన్, అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో ఎంట్రీ!

  • జనవరి 2026 నుండి మారనున్న 10 కీలక నిబంధనలీవే!

  • గౌతమ్ గంభీర్ ఉద్వాసనపై బీసీసీఐ స్పష్టత.. ఆ వార్తల్లో నిజం లేదు!

  • మ‌హిళ‌లు గర్భవతి అని తెలిపే శరీర మార్పులు ఇవే!

  • మీ క్రెడిట్ కార్డ్ వాడకం మీ లోన్ అర్హతను దెబ్బతీస్తోందా?

Trending News

    • టెస్ట్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ ఔట్‌?!

    • బంగారం ధరల రికార్డుల పరంపర.. 2026లో మరింత పెరిగే అవకాశం!

    • క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు.. ఒకే మ్యాచ్‌లో 8 వికెట్లు పడగొట్టిన బౌల‌ర్‌!

    • రూ. లక్ష డిపాజిట్‌పై రూ. 20,983 వడ్డీ.. ఏ బ్యాంక్‌లో అంటే?!

    • టాలీవుడ్‌లో రోషన్ జోరు.. క్రేజీ డైరెక్టర్లతో భారీ ప్రాజెక్టులు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd