Lok Sabha Elections : తెలంగాణ లో లోక్ సభ ఎన్నికలను పట్టించుకోని ఓటర్లు..
రాష్ట్రంలో ఎక్కడ కూడా ఓట్ల సందడి కనిపించడం లేదు. అసలు రేపు ఎన్నికలు అనే సంగతి కూడా చాలామందికి తెలియని పరిస్థితి నెలకొంది.
- Author : Sudheer
Date : 12-05-2024 - 12:01 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ (Telangana) లో రేపు 17 స్థానాలకు సంబదించిన పోలింగ్ జరగబోతుంది. ఈ ఎన్నికల్లో తమ సత్తా చాటాలని అధికార పార్టీ కాంగ్రెస్ (Congress) , బిఆర్ఎస్ (BRS) , బిజెపి (BJP) పార్టీలు చూస్తున్నాయి. గత రెండు నెలలుగా మూడు పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తూ వచ్చారు. పార్టీల అధినేతలు సైతం మండు ఎండను సైతం లెక్కచేయకుండా ప్రచారం చేసారు. ఒకరిపై ఒకరు విమర్శలు , ప్రతివిమర్శలు చేసుకుంటూ ఎన్నికల వేడి పెంచారు. ఇక నిన్న సాయంత్రంతో ప్రచారానికి తెరపడింది. ప్రస్తుతం నేతలంతా పోలింగ్ ఫై దృష్టి సారించారు. అయితే రాష్ట్రంలో ఎక్కడ కూడా ఓట్ల సందడి కనిపించడం లేదు. అసలు రేపు ఎన్నికలు అనే సంగతి కూడా చాలామందికి తెలియని పరిస్థితి నెలకొంది.
We’re now on WhatsApp. Click to Join.
ఇప్పుడనే కాదు ఎప్పుడు ఎంపీ ఎన్నికలు జరిగిన ఇదే పరిస్థితి ఉంటుంది. గ్రామస్థులు కానీ పట్టణ వాసులు కానీ ఎక్కువగా అసెంబ్లీ , గ్రామ పంచాయితీ ఎన్నికలకే ప్రాధాన్యం ఇస్తారు. లోకల్ నేతలు సైతం ఎంపీ ఎన్నికలను పెద్దగా పట్టించుకోరు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఏర్పడింది. చాలామంది ఓటర్లు ఇతర చోట్ల ఉన్నవారు ఓటు వేసేందుకు పెద్దగా ఆసక్తి కనపరచడం లేదు. మరో రెండు నెలలు అయితే గ్రామా పంచాయితీ ఎన్నికలు వస్తున్నాయి..అప్పుడు వెళ్లొచ్చు అన్నట్లు మాట్లాడుతున్నారు. తెలంగాణ లోక్ సభ ఎన్నికలను పట్టించుకునే ఓటర్లు లేరు. ఈసారి లోక్ సభ ఎన్నికల పోలింగ్ శాతం తక్కువగానే నమోదు అవుతుందని అంత అభిప్రాయ పడుతున్నారు. ఇదే క్రమంలో ఏపీ లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతుండడం తో అంత దానిపైనే ఆసక్తి కనపరుస్తున్నారు.
Read Also : Fixed Deposit Rates: ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలని చూస్తున్నారా..? అయితే ఈ రెండు బ్యాంకులే బెస్ట్..!