Karimnagar : జేబులో గన్ తో TRS లీడర్…వైరల్ అవుతున్న ఫోటో..!!
ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ కు చెందిన టీఆర్ఎస్ పార్టీ నేత...తన ప్యాంటు వెనక జేబులో గన్ పెట్టుకున్న ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
- Author : hashtagu
Date : 15-09-2022 - 9:22 IST
Published By : Hashtagu Telugu Desk
ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ కు చెందిన టీఆర్ఎస్ పార్టీ నేత…తన ప్యాంటు వెనక జేబులో గన్ పెట్టుకున్న ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జేబులో అందరికీ కనిపించేలా గన్ పెట్టుకుని చక్కర్లు కొట్టాడు. తన నియోజకవర్గంలోని పలువురికి గన్ లైసెన్స్ లు ఇస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆ గన్ అందరికీ కనిపించేలా పెట్టుకున్న ఆ నేత ఓ ఎంపీపీ భర్త.
ఆయన ఫొటో వైరల్ అవ్వడంతో కరీంనగర్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ స్పందించారు. హుజురాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియాలో మీట్ లో మాట్లాడారు. ఈటల రాజేందర్ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. నియోజకవర్గంలో విచ్చలవిడిగా గన్ లైసెన్స్ లు ఇస్తున్నారన్న ఈటల వ్యాఖ్యలు అవాస్తవమన్నారు. గత రెండేళ్లో ఇద్దరికీ మాత్రమే లైసెన్సులు ఇచ్చినట్లు తెలిపారు. తన దగ్గర తుపాకిని అందరికీ కనిపించేలా పెట్టుకున్న ఆ నాయకుడిని హెచ్చరించినట్లు కమిషనర్ తెలిపారు.