Medaram Jatara 2024: మేడారం జాతరకు వచ్చే వీఐపీలు ఆర్టీసీ బస్సులోనే రావాలి : పొంగులేటి
తెలంగాణలో రెండేళ్లకోసారి జరగనున్న మేడారం మహా జాతరకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. నెల 21 నుంచి 24 వరకు ఈ కుంభమేళా జరుగుతుంది. ఇందుకోసం ప్రత్యేక రైళ్లు, బస్సులు,హెలికాప్టర్ సౌకర్యాలు ఏర్పాటు చేశారు.
- Author : Praveen Aluthuru
Date : 19-02-2024 - 2:36 IST
Published By : Hashtagu Telugu Desk
Medaram Jatara 2024: తెలంగాణలో రెండేళ్లకోసారి జరగనున్న మేడారం మహా జాతరకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. నెల 21 నుంచి 24 వరకు ఈ కుంభమేళా జరుగుతుంది. ఇందుకోసం ప్రత్యేక రైళ్లు, బస్సులు,హెలికాప్టర్ సౌకర్యాలు ఏర్పాటు చేశారు. మేడారం జాతర ఏర్పాట్లను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ,మంత్రి సీతక్క పరిశీలించారు.
మంత్రి పొంగులేటి మీడియా సమావేశంలో మాట్లాడుతూ..మేడారం జాతరకు ఎన్ని లక్షల మంది వచ్చినా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామన్నారు. భక్తుల సౌకర్యార్థం వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశామన్నారు. 17 కోట్ల మంది మహిళలు జీరో టికెట్‌తో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారని. మేడారం జాతరకు మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాలు కల్పిస్తున్నారు. జాతర జరుగుతున్న ప్రాంతంలో చెత్త పేరుకుపోకుండా ఉండేందుకు ఎక్కువ మంది పారిశుధ్య కార్మికులను అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. మేడారం జాతర పర్యవేక్షణకు ఐఏఎస్, ఐపీఎస్ స్థాయి అధికారులను నియమించినట్లు తెలిపారు.
మేడారం జాతరకు వచ్చే వీఐపీలు ములుగులో వాహనాలు నిలిపి, ఆర్టీసీ బస్సుల్లో మేడారానికి రావాలని మంత్రి చెప్పారు. తద్వారా ట్రాఫిక్ సమస్య ఉండదని అన్నారు. భక్తులకు ఏమైనా ఇబ్బందులుంటే తక్షణమే అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. రానున్న నాలుగు రోజుల్లో మేడారం జాతరకు దాదాపు 2 కోట్ల మంది భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేసింది. జాతరకు సంబంధించి వివరాలు సేకరిస్తూనే బడ్జెట్ కేటాయిస్తున్నట్లు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
Also Read: T.Congress : వచ్చే 100 రోజులు రేవంత్ ప్రభుత్వానికి పరీక్షా సమయం..!