Vanajeevi Last Rites : ప్రభుత్వ లాంఛనాలతో ముగిసిన వనజీవి అంత్యక్రియలు
Vanajeevi Last Rites : ఖమ్మం జిల్లాతో పాటు భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల నుండి కూడా అనేక మంది సామాజికవేత్తలు వచ్చి ఆయనకు చివరిసారి వీడ్కోలు పలికారు
- By Sudheer Published Date - 03:31 PM, Sun - 13 April 25

పద్మశ్రీ వనజీవి రామయ్య అంత్యక్రియలు (Vanajeevi Last Rites) ప్రభుత్వ లాంఛనాలతో ఘనంగా ముగిశాయి. ఖమ్మం రూరల్ మండలంలోని రెడ్డిపల్లి గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy), ఖమ్మం జిల్లా కలెక్టర్ కె. శ్రీనివాస్ రెడ్డి, రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి హాజరయ్యారు. వనజీవి రామయ్య అంతిమ యాత్రకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ఆయన భౌతికకాయాన్ని చూసేందుకు చివరిసారి వచ్చిన వారు కన్నీటి వీడ్కోలు పలికారు. వనాలకు జీవం పోసిన ఈ మహానుభావుడిని ప్రజలు గుండెల్లో నిలిపేసుకున్నారు.
Mangalagiri : 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాన చేసిన మంత్రి లోకేష్
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వనజీవి రామయ్య పార్థివ దేహానికి పుష్పాంజలులు అర్పించారు. అనంతరం ఆయన సతీమణి జానకమ్మ మరియు కుటుంబసభ్యులను పరామర్శించి, ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రామయ్య కలలు, ఆశయాలు నెరవేరేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు. ఇది వనజీవి సేవలకు గుర్తింపుగా భావించవచ్చు. వన సంరక్షణకు జీవితాన్నే అంకితం చేసిన రామయ్య జీవితం యువతకు ప్రేరణగా నిలుస్తుంది. రామయ్య పార్థివదేహాన్ని ప్రత్యేక వాహనంలో శ్మశానానికి తరలించారు. ఖమ్మం జిల్లాతో పాటు భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల నుండి కూడా అనేక మంది సామాజికవేత్తలు వచ్చి ఆయనకు చివరిసారి వీడ్కోలు పలికారు. రామయ్య పాడెను కుటుంబ సభ్యులతో పాటు తహశీల్దార్ ఈ రాంప్రసాద్, మున్సిపాలిటీ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి మోసారు. అనంతరం రెడ్డిపల్లి స్మశాన వాటికలో అధికార లాంఛనాలతో రామయ్య అంత్యక్రియలు నిర్వహించారు.