Mangalagiri : 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాన చేసిన మంత్రి లోకేష్
Mangalagiri : మంగళగిరిలోని ప్రసిద్ధ పానకాల స్వామి ఆలయ అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో వంద పడకల ఆసుపత్రి ఉండాలన్న సీఎం చంద్రబాబు లక్ష్యాన్ని గుర్తు చేశారు
- By Sudheer Published Date - 01:29 PM, Sun - 13 April 25

మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధి (Mangalagiri Constituency Development)కి తన వంతు పాత్ర పోషించేందుకు మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) నడుం బిగించారు. నియోజకవర్గంలోని చిన్న కాకానిలో అత్యాధునిక వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి(100-Bed Government Hospital)కి ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ ఆసుపత్రిని 7.35 ఎకరాల విస్తీర్ణంలో, రూ.52.20 కోట్ల వ్యయంతో దేశంలోని అత్యుత్తమ ప్రమాణాలతో నిర్మించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఏడాదిలోపు నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే టిడ్కో నివాసాల వద్ద దివిస్ సంస్థ సహకారంతో ఏర్పాటు చేసిన తాగునీటి పథకాన్ని ప్రారంభించారు.
Gold Rate: వామ్మో.. ఏకంగా రూ. 7 వేలు పెరిగిన బంగారం, పూర్తి లెక్కలివే!
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..మంగళగిరిలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. 1984లో ఎన్టీఆర్ శంకుస్థాపన చేసిన 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా విస్తరించాలని ప్రజలు కోరగా, తన పాదయాత్రలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నట్లు తెలిపారు. ఈ ఆసుపత్రిలో డీహైడ్రేషన్ సెంటర్ సహా అన్ని ఆధునిక వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంటాయని హామీ ఇచ్చారు. మంగళగిరిలోని ప్రసిద్ధ పానకాల స్వామి ఆలయ అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో వంద పడకల ఆసుపత్రి ఉండాలన్న సీఎం చంద్రబాబు లక్ష్యాన్ని గుర్తు చేశారు.
ఇక ‘మన ఇల్లు – మన లోకేష్’ పేరుతో పేదలకు గృహ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని మొదటి దశగా ఆదివారం ముగించారు. ఈ దశలో మొత్తం 3,000 మందికి పైగా లబ్ధిదారులకు ఇంటి స్థలాలు కేటాయించారు. ఒక్కరోజులో 832 మంది లబ్ధిదారులకు స్వయంగా పట్టాలను అందజేశారు. తన సొంత ఖర్చుతో పసుపు, కుంకుమ, బట్టలు, భోజనాల ఏర్పాట్లు చేయడం ద్వారా ప్రజల మనసు గెలుచుకోవడానికి చేసిన ప్రయత్నాన్ని వివరించారు. మంగళగిరిని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడమే తన ప్రధాన లక్ష్యమని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.