HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Until Republic Day Weather Department Key Alert For Telangana

Weather: రిపబ్లిక్ డే వరకు.. తెలంగాణ‌కు వాతావరణ శాఖ కీలక అలర్ట్!

మధ్యాహ్నం సమయంలో ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల వరకు నమోదు అవుతోంది. హైదరాబాద్‌లో కనిష్టంగా16 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతోంటే.. గరిష్టంగా 32 డిగ్రీలు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ చెప్పింది.

  • Author : Gopi Date : 23-01-2025 - 8:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Weather
Weather

Weather: తెలంగాణలో చలి (Weather) పంజా విసురుతోంది. దీంతో తెల్లవారుజామున భారీగా మంచు పడుతోంది. రాత్రి వేళ.. చలి చంపేస్తోంది. అయితే తెలంగాణ వాసులకు చలి గాలుల నుంచి ఇప్పుడప్పుడే ఉపశమనం ఉండేలా లేదు. అలాంటి వేళ భారత వాతావరణ విభాగం కీలక అప్ డేట్ ఇచ్చింది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. హైదరాబాద్ నగర ప్రజలకు శీతాకాలపు చలి గాలుల నుండి ఇప్పుడప్పుడే ఉపశమనం లభించే అవకాశం లేదు. అంతేకాదు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వాతావ‌ర‌ణ‌ శాఖ ఎల్లో అలర్ట్ సైతం ప్రకటించింది.

ఇక ఉష్ణోగ్రతలు రాత్రిపూట 11 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఆదిలాబాద్, కొమరం భీమ్, మంచిర్యాలు, నిర్మల్, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్, ములుగు, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, ఉమ్మడి వరంగల్ జిల్లా, వికారాబాద్, మేడ్చల్- మల్కాజిగిరి, హైదరాబాద్‌తో సహా తెలంగాణలోని వివిధ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది.

Also Read: Donald Trump: ట్రంప్ నిర్ణయం..యూఎస్‌లో ప్రీమెచ్యూర్ డెలివరీ కోసం పోటీ!

ఇక రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, జనగాం, మహబూబాబాద్, భద్రాద్రి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలకు సైతం ఇదే వాతావరణం వర్తిస్తోందని స్పష్టం చేసింది. అయితే తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ ప్రకారం.. సంగారెడ్డి జిల్లాలో బుధవారం అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత 9.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. మరోవైపు తెలంగాణలో ఉదయం పూట భారీగా చలి వేస్తోంటే.. మధ్యాహ్నం మాత్రం ఎండలు మాత్రం మండిపోతున్నాయి. ఇంకా ఉదాహరణగా చెప్పాలంటే.. ఉదయం పూట ఉష్ణోగ్రతలు10 డిగ్రీల లోపే ఉంటున్నాయి. కానీ మధ్యాహ్నం కాగానే ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతోంది.

మధ్యాహ్నం సమయంలో ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల వరకు నమోదు అవుతోంది. హైదరాబాద్‌లో కనిష్టంగా 16 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతోంటే.. గరిష్టంగా 32 డిగ్రీలు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ చెప్పింది. అయితే ఈ భిన్న వాతావరణం వల్ల ప్రజలు.. సీజనల్ వ్యాధులతోపాటు ఇతర ఇబ్బందులకు గురయ్యే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • telangana
  • Telangana Weather
  • Telugu State
  • Today Weather
  • Weather Alert
  • weather department
  • Weather Update

Related News

Good news for Singareni workers: Union Minister Kishan Reddy

Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

సింగరేణికి మరో రెండు కీలక బొగ్గు బ్లాక్‌లు దక్కనున్నాయి. ఒడిశాలోని నైనీ కోల్‌ బ్లాక్‌తో పాటు తాడిచెర్ల-2 కోల్‌ బ్లాక్‌ను కూడా సింగరేణికి కేటాయిస్తున్నట్లు కేంద్ర బొగ్గు శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి ప్రకటించారు. ఈ నిర్ణయం సంస్థ భవిష్యత్తుకు పెద్ద ఊరటనిస్తుందని చెప్పారు. ఢిల్లీలో మంగళవారం మాట్లాడిన కిషన్‌ రెడ్డి సింగరేణికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోందన్

  • National Status... Palampet Shiva Temple, Mulugu District

    Palampet Shivalaya Temple: జాతీయ హోదా.. ములుగు జిల్లా పాలంపేట శివాలయం

  • Heavy rains in Maharashtra

    Heavy Rains: మహారాష్ట్రలో భారీ వర్షాలు

  • Draft Of 'core Urban Region

    GHMC : పాత జీహెచ్‌ఎంసీ చట్టానికి స్వస్తి .. హైదరాబాద్‌‌లో కొత్త రూల్స్ ..!

  • Ration Cards To Be Issued W

    Ration Card : ఇక పై 48 గంటల్లోనే రేషన్ కార్డు : మంత్రి పొన్నం ప్రభాకర్

Latest News

  • Atluri Prasanna: అమెరికాలో ఘోర ప్రమాదం.. ఎన్టీఆర్‌ జిల్లా యువతి మృతి

  • Stock Market: స్వల్ప నష్టాల్లో ముగిసిన దేశీయ సూచీలు

  • Delhi High Court: ‘ప్రతి పోస్ట్‌ను పర్యవేక్షించలేం’.. తాము ‘సూపర్ సెన్సార్లు’ కాము అని ఢిల్లీ హైకోర్టుకు గూగుల్, మెటా తెలిపాయి

  • Wayanad Landslide: వయనాడ్‌లో భారీ వర్షాలుకు విరుచుకుపడిన కొండచరియలు..

  • ‘అమ్మ’ రాజీనామా కలకలం.. అసలేం జరుగుతోంది

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd