HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Unseasonal Rain Lashes Parts Of Hyderabad City

Hyderabad Rains: హైదరాబాద్ అతలాకుతలం.. భారీ వర్షంతో భయానకం!

హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. తెల్లవారుజామునుంచే ఉరుములు ఉరమడంతో సిటీ జనాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

  • Author : Hashtag U Date : 04-05-2022 - 10:55 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rains1
Rains1

హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. తెల్లవారుజామునుంచే ఉరుములు ఉరమడంతో సిటీ జనాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దీనికితోడు మెరుపులు, ఈదురుగాలులతో వాతావరణం ఒక్కసారిగా భీకరంగా తయారైంది. ఆపై వర్షం దంచికొట్టడంతో హైదరాబాదీలంతా ఆందోళన చెందారు. అటు ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్ పేట్, మారేడ్ పల్లి, సికింద్రాబాద్, బేగంపేట్, సరూర్ నగర్, దిల్
సుఖ్ నగర్, నాగోల్, వనస్థలిపురం, పెద్ద అంబర్ పేట్, అబ్దుల్లాపూర్ మెట్, ఈసీఐఎల్, కూకట్ పల్లి, మల్కాజ్ గిరి ఇలా చాలా ప్రాంతాల్లో వర్షం బాదేసింది.

సిటీలో వర్షం నీటితో డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో ఆ నీరంతా రోడ్లపైకి చేరింది. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ఇప్పటికే పలు కాలనీలు నీటిలో దిగ్బంధం అయ్యాయి. వర్షం భారీగా పడడం, ఈదురు గాలులు వీయడంతో విద్యుత్ వైర్లు తెగిపోయాయి. దీంతో పలు ప్రాంతాల్లో కరెంటు సరఫరాను నిలిపేశారు. పలు కూడళ్లలో భారీగా నీరు నిలిచిపోవడంతో వాహనదారుల రాకపోకలకు ఇబ్బందులు తప్పలేదు. మోకాళ్లు లోతు నీటిలో నడవాల్సిన పరిస్థితి ఎదురైంది. మైత్రీవనం నుంచి యూసఫ్ గూడ వెళ్లే దారిలో స్టేట్ హోమ్ దగ్గర చెట్టుకొమ్మలు విరిగిపడడంతో ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది.

ఎల్బీనగర్ ఫ్లై ఓవర్ వద్ద భారీగా వరదనీరు చేరింది. ఆ ప్రాంతంలో ఓ గుంతలో కారు ఇరుక్కుపోయింది. ఓ ఆర్టీసీ బస్సు వరదనీటిలో చిక్కుకుంది. హైదరాబాద్ తో పాటు తెలంగాణలో ఇతర ప్రాంతాల్లోనూ వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే వేసవి తాపంతో అల్లాడిపోయిన ప్రజలకు ఈ వర్షం కాస్త ఉపశమనం కలిగించింది. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. దీనికి ఉపరితల ద్రోణి ప్రభావమే కారణం. రేపు (05-05-2022) కూడా వర్షాలు పడతాయని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం తెలపడంతో ప్రజలు ముందుజాగ్రత్తలు తీసుకుంటే మంచిది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • GHMC
  • heavy rains
  • hyderabad

Related News

Fish In Beer Bottle

మద్యం ప్రియుడికి షాక్..బీర్ బాటిల్‌లో చేప పిల్ల కలకలం

Beer Bottle Fish  హైదరాబాద్‌లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి కొనుగోలు చేసిన బీర్ బాటిల్‌లో ఏకంగా ఓ చేప పిల్ల సజీవంగా ఈదుతూ కనిపించడం కలకలం రేపింది. నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లాపూర్‌లో ఈ సంఘటన వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. మల్లాపూర్‌లోని జేపీ వైన్ షాపులో నిన్న‌ ఓ కస్టమర్ కింగ్‌ఫిషర్ లైట్ బీర్ కొనుగోలు చేశాడు. దానిని తాగేందుకు మూత తీయగా, అందులో చిన్న చేప పిల్ల క

  • Ghmc

    జీహెచ్ఎంసీలో పన్నులు ఎగ్గొట్టిన వారి జాబితా సిద్దం.. త్వరలో వీరి ఆస్తులు సీజ్..!

  • Kuktapally Nallacheruvu

    Hyderabad : మరో రెండు చెరువులకు పునరుజ్జీవం పోసిన హైడ్రా !!

  • Motorists Queue For Petrol

    యుద్ధం ఎఫెక్ట్ : హైదరాబాద్ లో పెట్రోల్ కోసం బారులు తీరిన వాహనదారులు

  • Bachupally Fire Accident

    హైదరాబాద్ బాచుపల్లిలో భారీ అగ్నిప్రమాదం

Latest News

  • Viral : అల్లు శిరీష్ పెళ్లి లో అరుదైన ఘటన..చిరంజీవి కామెడీ కి పడీపడీ నవ్విన పవన్ భార్య అన్నా లెజివోనా

  • అహ్మదాబాద్‌లో అడుగుపెట్టిన సూర్య‌ సేన

  • S Saraswathi Story : ఏంటి..సరస్వతి మూవీ కథ ఆ రచయితదా ? సోషల్ మీడియా లో వార్ !

  • వెంకీ-కళ్యాణ్ రామ్ తో అనిల్ రావిపూడి మల్టీస్టారర్

  • IND vs NZ : ఫైనల్ కోసం పిచ్‌లో కీలక మార్పులు..

Trending News

    • టీ20 ప్రపంచకప్ ఫైనల్.. న్యూజిలాండ్‌పై భార‌త్‌దే పైచేయి?!

    • ఏ కారు కొంటే మంచిది?!

    • ఇరాన్‌కు సాయం చేస్తున్న ర‌ష్యా?!

    • మార్చి 31లోపు ఈ ప‌నులు పూర్తి చేయాల్సిందే!

    • 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్‌ మీడియా నిషేధం: కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd