Inter Results : ఇద్దరు ఇంటర్ అమ్మాయిలు సూసైడ్
ఇంటర్ లో ఫెయిల్ అయ్యినందుకు బాధపడుతూ తనువు చాలించారు
- Author : Sudheer
Date : 24-04-2024 - 4:13 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ ఇంటర్ ఫలితాలు (Inter Results) వచ్చి ఎన్నో గంటలు కాలేదు..అప్పుడే ఇద్దరు ఇంటర్ అమ్మాయిలు ఆత్మహత్య (Suicide) చేసుకున్నారు. ఇంటర్ లో ఫెయిల్ అయ్యినందుకు బాధపడుతూ తనువు చాలించారు. మెదక్ జిల్లా శేరిపల్లిలో ఇంటర్ సెకండియర్ చదువుతున్న పంబాల రమ్య ..పాస్ కాలేదనే మనస్తాపానికి గురైన ఆమె.. గ్రామ శివారులో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. అలాగే మంచిర్యాల జిల్లాలోనూ ఫస్ట్ ఇయర్ ఫెయిల్ కావడంతో తేజస్విని అనే విద్యార్థిని ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.
ఈ రెండు విషాద చాటాలతో ఆయా కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఇప్పుడే కాదు ప్రతి సారి పదో తరగతి ఫలితాలు వచ్చిన..ఇంటర్ ఫలితాలు వచ్చిన చాలామంది విద్యార్థులు ఫెయిల్ అయ్యామనే బాధతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈసారి కాకపోతే సప్లై లో ఎగ్జామ్స్ రాసుకొని పాస్ కావొచ్చు అంతే కానీ ఇలా తొందరపడి ఆత్మహత్య చేసుకుంటే ఏమివస్తుంది..ఇంతకాలం ఎంతో ప్రేమగా చూసుకున్న వారి తల్లిదండ్రులను శోకసంద్రంలో పడేయడం తప్ప మరోటికాదు. ఇలాంటి చేయకూడదని ఎంత చెప్పిన సరే కొంతమంది ఇలాగే చేస్తూ వస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక ఇంటర్ రిజల్ట్స్ విషయానికి వస్తే..
ఈరోజు ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫలితాలను అధికారులు విడుదల చేసారు. ఇంటర్ ఫస్టియర్‌లో 60.01 శాతం, సెకండియర్‌లో 64.19 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అలాగే ఎప్పటిలాగే ఈసారి కూడా బాలికలి పైచేయి సాధించారు. ఇంటర్ ఫస్టియర్‌లో బాలికలు 68.35 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలురు 51.50 శాతం, సెకండియర్‌లో బాలికలు 72.53 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలురు 56.10 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ ఫలితాల్లో ఫెయిలైన వారికి మే 24 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఫస్టియర్‌కు ఉదయం 9 నుంచి మ. 12 గంటల వరకు సెకండియర్ విద్యార్థులకు మ. 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహించనున్నారు. అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన పరీక్ష ఫీజును ఏప్రిల్ 25 నుంచి మే 2వ తేదీ వరకు ఆయా కాలేజీల్లో స్వీకరించనున్నారు.
Read Also : CM Jagan : పులివెందులలో రేపు సీఎం జగన్ నామినేషన్..