HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Two Drugs Peddlers Arrest In Hyderabad

Drugs : హైదరాబాద్‌లో అంతర్రాష్ట్ర డ్రగ్స్ వ్యాపారులు అరెస్ట్

హైదరాబాద్‌లో డ్ర‌గ్స్ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయ‌లుగా సాగుతుంది. ప్ర‌తి రోజు ఏదో ఓ చోట డ్ర‌గ్స్ దొరుకుతునే ఉంది.

  • Author : Prasad Date : 10-08-2023 - 7:20 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Drugs
Drugs

హైదరాబాద్‌లో డ్ర‌గ్స్ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయ‌లుగా సాగుతుంది. ప్ర‌తి రోజు ఏదో ఓ చోట డ్ర‌గ్స్ దొరుకుతునే ఉంది. పోలీసులు నిఘా పెట్టిన‌ప్ప‌టికి డ్రగ్స్ స‌ర‌ఫ‌రా హైద‌రాబాద్‌కు చేరుతుంది. రాజస్థాన్‌కు చెందిన ఇద్దరు అంతర్రాష్ట్ర డ్ర‌గ్స్ వ్యాపారులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి హెరాయిన్, ఎండీఎంఏ, సహా నిషిద్ధ వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రాపై సమాచారం అందుకున్న పోలీసు బృందాలు చైతన్యపురి పోలీస్‌స్టేషన్‌, ఆదిబట్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో డ్రగ్స్‌ రాకెట్లను ఛేదించారు. ఇద్దరు డ్రగ్స్‌ వ్యాపారులను పట్టుకున్నట్లు రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌ తెలిపారు. పక్కా సమాచారంతో ఆగస్ట్ 8న ఒక నిందితుడిని పోలీసు బృందాలు పట్టుకుని అతని వద్ద నుంచి 70 గ్రాముల హెరాయిన్, 30 గ్రాముల MDMA, ఇత‌ర వ‌స్తువుల‌ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు కమిషనర్ తెలిపారు.

నిందితులు రాజస్థాన్‌లోని ఓ డ్రగ్‌ సరఫరాదారు నుంచి గ్రాము రూ.5,000 నుంచి రూ.6,000 చొప్పున కొనుగోలు చేసి కొరియర్‌ సర్వీసుల ద్వారా హైదరాబాద్‌కు రవాణా చేయడంతోపాటు ప్రైవేట్‌ బస్సుల్లో ప్రయాణిస్తున్నప్పుడు బట్టల్లో దాచి తీసుకువ‌చ్చేవారు. నిషేధిత పదార్థాలను గ్రాము రూ.8,000 నుంచి రూ.10,000 వరకు వినియోగదారులకు విక్రయించారని, నిందితులు ఆ డ‌బ్బుల‌తోనే జీవనం సాగిస్తున్నారని పోలీసులు తెలిపారు. మ‌రో కేసులో.. పోలీసు బృందాలు ఓ ఇంటిపై దాడి చేసి, అతని వద్ద నుండి 2.25 కిలోల డ్ర‌గ్స్‌ని స్వాధీనం చేసుకుని, నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడు ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సుల ద్వారా హైదరాబాద్‌కు తరలించి నగరంలోని ప్రజలకు 10 గ్రాములు రూ.5 వేల నుంచి రూ.6 వేలకు విక్రయిస్తున్నట్లు సమాచారం.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • crime
  • drug peddlers
  • drugs
  • hyderabad
  • telangana

Related News

Telangana Rtc Bus Stand

ప్రయాణికులకు గుడ్ న్యూస్.. తెలంగాణలో కొత్తగా 13 బస్‌స్టేషన్లు, 2 డిపోలు

'మహాలక్ష్మి' పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన తర్వాత ఆర్టీసీ బస్సుల్లో రద్దీ గణనీయంగా పెరగడంతో, దానికి అనుగుణంగా మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని సర్కార్ నిర్ణయించింది. ఇందులో భాగంగా 13 ఆధునిక బస్ స్టేషన్లు మరియు 2 కొత్త బస్ డిపోల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది

  • Cm Revanth Municipal Electi

    మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సీఎం రేవంత్ సిద్ధం, తొలి బహిరంగ సభ అక్కడే !!

  • Budget Telugu States

    Budget 2026 – 27 : తెలుగు రాష్ట్రాలకు శుభవార్త తెలిపిన బడ్జెట్

  • Rare Earth Corridor

    Budget 2026 : గుడ్ న్యూస్ ! హైదరాబాద్ కు 3 హైస్పీడ్ రైళ్లు – నిర్మలా సీతారామన్ ప్రకటన

  • gold and silver rate today

    బంగారం డిమాండ్ ఢమాల్

Latest News

  • బంగారం వెండి ధరలకు రెక్కలు ..రూ.6 వేలు పెరిగిన బంగారం, రూ.14 వేలు పెరిగిన వెండి

  • భర్త – ప్రియుడితో కలిసి రెండో ప్రియుడిని హత్య చేసిన మహిళ..ఈమె మామూలు ఆడది కాదు !!

  • పానీపూరీ కోసం ఎగబడ్డ యూఎస్ఏ ప్లేయర్స్

  • మరణానికి ముందు అతనికి ఫోన్ కాల్.. అజిత్ పవార్ చివరి మాటలు ఇవే !

  • టీ20 వరల్డ్ కప్ పై ? ఎంఎస్ ధోనీ షాకింగ్ కామెంట్స్..

Trending News

    • టీ20 వరల్డ్ కప్‌.. భారత్-పాక్ మ్యాచ్ జ‌ర‌గ‌కుంటే రూ. 4,500 కోట్ల న‌ష్టం?!

    • వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి?

    • పాకిస్థాన్‌పై ఐసీసీ క‌ఠిన చ‌ర్య‌లు?!

    • పీఎఫ్ ఖాతాదారుల‌కు మ‌రో శుభ‌వార్త‌..!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. టీమ్ ఇండియా, ఇండియా A వార్మప్ మ్యాచ్‌ల వివరాలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd