HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Telangana
  • >Two Cases Registered Against Ktr In Nalgonda District

KTR : నల్గొండ జిల్లాలో కేటీఆర్‌పై రెండు కేసులు.. ఎందుకంటే.. ?

ప్రశ్నాపత్రం లీక్ ఘటనపై పలు ఆరోపణలతో బీఆర్ఎస్ సోషల్‌ మీడియా విభాగం పెట్టిన పోస్టులను కేటీఆర్(KTR)  ఫార్వర్డ్‌ చేశారని రజిత శ్రీనివాస్  ఆరోపించారు. 

  • By Pasha Published Date - 11:46 AM, Wed - 26 March 25
  • daily-hunt
Cases On Ktr Nalgonda District Brs Social Media Ssc Paper Leak Issue

KTR : బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌‌పై రెండు కేసులు నమోదయ్యాయి. నల్గొండ జిల్లా నకిరేకల్ మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ చౌగొని రజిత శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసులు నమోదు చేశారు.

ఫిర్యాదులో ఏముంది ? 

మార్చి 21న  నకిరేకల్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఉన్న పదో తరగతి పరీక్షా కేంద్రంలో తెలుగు ప్రశ్నాపత్రం లీకైంది.   ఈ ఘటనపై పలు ఆరోపణలతో బీఆర్ఎస్ సోషల్‌ మీడియా విభాగం పెట్టిన పోస్టులను కేటీఆర్(KTR)  ఫార్వర్డ్‌ చేశారని రజిత శ్రీనివాస్  ఆరోపించారు.  ఆ పోస్టులను ఫార్వర్డ్ చేస్తూ ‘ఎక్స్‌’ వేదికగా తమపై కేటీఆర్ తప్పుడు ఆరోపణలు చేశారని పోలీసులకు కంప్లయింట్ ఇచ్చారు. ఈ వ్యవహారంలో ఏ1గా మన్నే క్రిశాంక్‌, ఏ2గా కేటీఆర్‌, ఏ3గా దిలీప్‌కుమార్‌‌ల పేర్లను నమోదు చేశారు.  ఇదే అంశంపై ఉగ్గడి  శ్రీనివాస్‌ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో కేటీఆర్‌పై  మరో కేసు నమోదైంది.

Also Read :OYO Room : ఓయో రూమ్ కోసం ‘ఆధార్’ ఇస్తున్నారా ? ఇది తెలుసుకోండి

మార్చి 21న ఏం జరిగింది ? 

ఇంతకీ విషయం ఏమిటంటే.. మార్చి 21న  నకిరేకల్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల పదో తరగతి పరీక్షా కేంద్రంలో తెలుగు ఎగ్జామ్ ప్రారంభమైన అరగంట తర్వాత ప్రశ్నపత్రం వాట్సాప్‌లో చక్కర్లు కొట్టింది. చివరకు అది డీఈఓకు చేరింది. వెంటనే ఆయన ఎంఈవో నాగయ్యకు ఫోన్‌ చేయగా, నకిరేకల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో 13 మంది పాత్ర ఉందని, అందులో 11 మందిని అదుపులోకి తీసుకున్నట్టు నల్ల గొండ డీఎస్పీ శివరాంరెడ్డి చెప్పారు. ఈ 11 మంది స్నేహితులని పోలీసులు గుర్తించారు. మార్చి 21న వీరంతా ప్లాన్ ప్రకారమే అంతా చేశారు. ఏ–1 చిట్ల ఆకాశ్, ఏ–3 చిట్ల శివ, ఒక బాలుడు కలిసి నకిరేకల్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల వద్దకు స్కూటీపై చేరుకున్నారు. గేట్‌ వద్ద అప్పటికే పోలీసులు ఉండటంతో లోపలకు వెళ్లడానికి వారికి వీలు కాలేదు. దీంతో ఆ ముగ్గురు వెనుక వైపునకు వెళ్లారు. అక్కడ ఏ–11 రాహుల్‌ వేచి చూస్తున్నాడు. బాలుడు పరీక్ష కేంద్రం ఒకటో అంతస్తులోని రూమ్‌ నంబరు 8 వద్దకు చేరుకున్నా డు.  ఆ గదిలో పరీక్ష రాస్తున్న విద్యార్థినితో మాట్లాడి.. ప్రశ్నపత్రం చూపించమని సైగ చేశాడు. అతడి వెనకాల మరో ఇద్దరు కూడా అక్కడకు చేరుకున్నారు. దీంతో ఆ విద్యార్థిని వెంటనే ప్రశ్నపత్రం చూపించింది. సదరు బాలుడు తన ఫోన్‌లో ఆ ప్రశ్నాపత్రం ఫొటో తీసుకొని కిందికి దిగాడు. దాన్ని వాట్సాప్‌లో మిగతా నిందితులకు పంపాడు. వారంతా ఒకరికి ఒకరు సెండ్ చేసుకున్నారు. ఈ పేపరులో ఉన్న ప్రశ్నలకు ఏ–4 అయిన ప్రైవేట్‌ ఉపాధ్యాయుడు గుడుగుంట్ల శంకర్‌ సమాధానాలు తయారు చేశాడు. వాటిని రవిశంకర్‌ జిరాక్స్‌ షాప్‌లో జిరాక్స్‌ తీశారు. తమ బంధువుల పిల్లలు పదోతరగతిలో ఎక్కువ మార్కులు సాధించాలని కొంతమంది ఆకతాయిలు ఇదంతా చేశారని పోలీసులు వెల్లడించారు.

🚨A Shocking Case of SSC Paper Leak as well as Nexus for Top Rankings –

Congress leaders involved with Private School Management to send the SSC 10th Class Examination First Day Question paper through Whatsapp Groups…

While 15 people have been involved,
only 6 have been… pic.twitter.com/XHBScJBrY7

— Dr.Krishank (@Krishank_BRS) March 24, 2025

Also Read :Rs 78000 Crore Unclaimed: ఖాతాల్లోని రూ.78వేల కోట్లు ఎవరివి ? ఎందుకు తీసుకోవడం లేదు ?


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • BRS Social Media
  • Cases On KTR
  • crime
  • ktr
  • Nalgonda
  • Nalgonda district

Related News

Kavitha Comments Harish

Kavitha Vs Harish : నాపై చేసిన ఆరోపణలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నా..కవిత కు ఇన్ డైరెక్ట్ కౌంటర్ ఇచ్చిన హరీశ్

Kavitha Vs Harish : హరీశ్ రావు స్పందన ప్రాధాన్యత సంతరించుకుంది. కవిత (Kavitha) పేరును నేరుగా ప్రస్తావించకుండానే, ఆయన చేసిన వ్యాఖ్యలు ఆమె ఆరోపణలకు పరోక్షంగా జవాబుగా నిలిచాయి

  • Harish Rao

    Harish Rao: లండ‌న్‌లో జ‌రిగిన మీట్ అండ్ గ్రీట్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న హ‌రీష్ రావు!

  • Paul Kavitha

    Kavitha : కవిత నువ్వు ప్రజాశాంతి పార్టీలోకి రా – KA పాల్

  • Raghunandan Rao

    Raghunandan Rao : రేవంత్-హరీశ్ కుమ్మక్కు.. బీఆర్ఎస్ అవినీతి పునాదుల మీద నిలిచింది

  • KCR values ​​the party more than his family.. Mallareddy's response to Kavitha's suspension

    Malla Reddy : కేసీఆర్‌కు కుటుంబం కన్నా పార్టీ మిన్న.. కవిత సస్పెన్షన్‌పై మల్లారెడ్డి స్పందన

Latest News

  • Green Chillies : ప్రతిరోజూ పచ్చిమిర్చి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?..అస‌లు రోజుకు ఎన్ని తిన‌వ‌చ్చు..?

  • Khairatabad ganesh : గంగమ్మ ఒడికి చేరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి

  • Renault Cars : జీఎస్టీ 2.0 ఎఫెక్ట్.. రెనో కార్లపై భారీ తగ్గింపు

  • South: ఏఐడీఎంకెలో ఉత్కంఠ.. పళణి స్వామి కీలక నిర్ణయాలు

  • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

Trending News

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd