HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Turmeric Board In Nizamabad

Turmeric Board : కాసేపట్లో పసుపు బోర్డు ప్రారంభం

Turmeric Board : సంక్రాంతి పర్వదినాన, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఈ బోర్డును వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు

  • Author : Sudheer Date : 14-01-2025 - 10:50 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Turmeric Board In Nizamabad
Turmeric Board In Nizamabad

తెలంగాణ రైతులకు మరింత ఉత్సాహాన్నిచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం నిజామాబాద్‌(Nizamabad)లో పసుపు బోర్డు (Turmeric Board) ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి పర్వదినాన, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఈ బోర్డును వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. పసుపు రైతులకు ఇది ఎంతోకాలంగా ఎదురు చూపిన చారిత్రాత్మక రోజు. తెలంగాణలో పసుపు పంట ముఖ్యమైనది. కానీ పసుపు పంటకు న్యాయమైన ధర దక్కక, మార్కెటింగ్ సదుపాయాలు లేక రైతులు చాలాకాలంగా ఇబ్బందులు పడుతున్నారు. 15 ఏళ్లుగా రైతులు పసుపు బోర్డు ఏర్పాటు కోసం పోరాటం చేస్తూ వస్తున్నారు. కేంద్రం ఇచ్చిన హామీని నెరవేర్చడం ద్వారా రైతుల కల నెరవేరిందని భావిస్తున్నారు.

Cockfighting : కోడిపందాల్లో ఉద్రిక్తత.. పగిలిన తలలు

పసుపు బోర్డు ఛైర్మన్‌గా పల్లె గంగారెడ్డిని కేంద్రం నియమించింది. ఆయన ఈ రంగానికి చెందిన అనుభవజ్ఞుడు. బోర్డు కార్యకలాపాలు పసుపు రైతుల అభివృద్ధికి దోహదపడేలా ఉండాలని, మార్కెటింగ్, ఎగుమతులకు మరింత ప్రోత్సాహం ఇవ్వాలని ఆశాభావం వ్యక్తం అవుతోంది. పసుపు బోర్డు ఏర్పాటు ద్వారా పసుపు రైతులకు అధిక మద్దతు ధరలు, గ్లోబల్ మార్కెట్‌కు చేరువయ్యే అవకాశం కలుగుతాయి. కేంద్రం ఈ బోర్డును ప్రత్యేకంగా నిధులు, విధానాలతో సమర్ధంగా నడిపేందుకు పునాదులు వేసింది. మార్కెటింగ్ అవకాశాల మెరుగుదలకు ఈ బోర్డు కీలకంగా మారనుంది. పసుపు బోర్డు ఏర్పాటుకు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ ప్రాంత రైతులకు ఇది కొత్త ఆర్థిక దిశను తెస్తుందని, వారి జీవన ప్రమాణాలను పెంపొందించనున్నదని పండితులు అభిప్రాయపడుతున్నారు. రైతుల త్యాగాలు ఫలించి ఈ చారిత్రక నిర్ణయం తీసుకోవడం పట్ల రైతు సంఘాలు సంతోషాన్ని వ్యక్తం చేశాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • nizamabad
  • piyush goyal
  • Turmeric Board

Related News

A techie who gave up the American dream... today, she is a role model for many farmers. So, who is Sanjana Reddy? What is this interesting story?

Sanjana Reddy Inspiring Journey: అమెరికన్ కలను వదులుకున్న టెక్కీ… నేడు ఆమె ఎందరో రైతులకు ఆదర్శం.. ఇంతకీ సంజన రెడ్డి ఎవరు? ఏంటా ఇంట్రెస్టింగ్ స్టోరీ

తెలంగాణకు చెందిన సంజన రెడ్డి, తన గ్రామంలోని రైతులకు సాధికారత కల్పించేందుకు అమెరికాలోని ఐటీ ఉద్యోగాన్ని తిరస్కరించారు. ఆమె తనకున్న పరిజ్ఞానాన్ని పసుపు సాగు, అమ్మకాలను మెరుగుపరచడానికి ఉపయోగించారు. రైతులను నేరుగా వినియోగదారులతో అనుసంధానించే ‘ఇందూరు ఫార్మ్స్’ను రెడ్డి స్థాపించారు. ఈ సంస్థ రైతులకు మెరుగైన రాబడిని, కొనుగోలుదారులకు నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తుంది.

    Latest News

    • CM Chandrababu : సీఎం చంద్ర‌బాబుని క‌లిసిన గాదె సాయికృష్ణ త‌ల్లి

    • Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

    • Janasena: తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించిన పవన్ కల్యాణ్

    • Shani Anugraham: శని పీడ తొలగిపోవాలంటే శనీశ్వరుడికి.. ఈ వస్తువు సమర్పించాల్సిందే!

    • Pista: ఈ సీజన్‌లో పిస్తా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు!

    Trending News

      • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

      • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd