Gruha Jyothi Scheme : అద్దె ఇంట్లో ఉంటున్న వారికీ ‘గృహ జ్యోతి’ పథకం అమలు అవుతుందా..?
- By Sudheer Published Date - 02:44 PM, Tue - 6 February 24

తెలంగాణ లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం..ఎన్నికల హామీలను నెరవేర్చే పనిలో ఉంది. అధికారం చేపట్టిన వెంటనే మహిళలకు ఫ్రీ బస్సు, ఆరోగ్య శ్రీ పెంపు వంటి కీలక హామీలను నెరవేర్చి..ప్రజల్లో నమ్మకాన్ని పెంచుకున్న కాంగ్రెస్..ఇప్పుడు మరో రెండు కీలక పథకాలను అమలు చేసేందుకు సిద్ధమైంది.
తాజాగా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది, ఈ సమావేశంలో మరో రెండు హామీలకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500లకే గ్యాస్ సిలిండర్ హామీల అమలుకు ఆమోదం తెలిపింది. ‘గృహ జ్యోతి’ (Gruha Jyothi Scheme) పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ను అందించబోతుంది. ఈ పథకం పట్ల పలు వార్తలు ప్రచారం అవుతూ ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి.
We’re now on WhatsApp. Click to Join.
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయనున్న ‘గృహ జ్యోతి’ పథకానికి ఇంటి ఓనర్లు మాత్రమే అర్హులని..రెంటుకు ఉంటున్న వారు అనర్హులంటూ వార్తలొస్తున్నాయి. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు అనేది ఎక్కడ ఉన్నది..రాష్ట్రంలో ఎక్కువ శాతం రెంట్ హౌస్ లలో ఉంటున్నామని..ఇప్పుడు మాకు ‘గృహ జ్యోతి’ పథకం వర్తించదంటే ఎలా అని వారు ప్రశ్నిస్తున్నారు. ఈక్రమంలో దీనిపై TSSPDCL స్పందించింది. ఇలాంటి వార్తలను నమ్మొద్దని తేల్చిచెప్పింది. ఈ పథకానికి అద్దెకి ఉండేవారు కూడా అర్హులని అధికారికంగా ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ తో చాలామంది ఊపిరి పీల్చుకుంటున్నారు.
Read Also : Uttarakhand Civil Code : అసెంబ్లీలో యూసీసీ బిల్లుపై చర్చ.. ‘లివిన్’పై సంచలన ప్రతిపాదనలు