TS RERA: ఏజీఎస్ సంస్థకు రెరా రూ.50 లక్షల జరిమానా
నిబంధనలు ఉల్లంఘించి ప్రకటనలు ఇస్తూ, మార్కెటింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఏజీఎస్ సంస్థకు రియల్ ఎస్టే ట్ రెగ్యులేటరీ అథారిటీ రూ.50 లక్షల జరిమానా విధించింది.
- By Praveen Aluthuru Published Date - 07:50 PM, Sat - 16 September 23
TS RERA: నిబంధనలు ఉల్లంఘించి ప్రకటనలు ఇస్తూ, మార్కెటింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఏజీఎస్ సంస్థకు రియల్ ఎస్టే ట్ రెగ్యులేటరీ అథారిటీ రూ.50 లక్షల జరిమానా విధించింది.
తెలంగాణ స్టేట్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటర్ అథారిటీ కొందరు బిల్డర్లకు షాకిచ్చింది. జయత్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (జయ గ్రూప్), ఎజిఎస్ శ్రీనివాస్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎజిఎస్ గ్రూప్), ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా ఏజీఎస్ పేరుతో రియల్ ఎస్టేట్ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. రెరాలో రిజిస్ట్రేషన్ చేసుకోకుం డా మార్కెటింగ్ నిర్వహిస్తున్నాయని, అమ్మకాలకు ప్రకటనలు విడుదల చేస్తున్నాయని గుర్తించిన రెరా నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు రూ.50 లక్షల జరిమానా విధించింది.