HashtagU Telugu
HashtagU Telugu Telugu HashtagU Telugu
  • English
  • हिंदी
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
News
CloseIcon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # World Cup
  • # Nara Lokesh
  • # Nara Chandrababu Naidu
  • # KCR

  • Telugu News
  • ⁄Telangana
  • ⁄Trs To Protest Against Centre Again Over Paddy Issue On Nov 18

KCR: ధర్నా చౌక్ కి కేసీఆర్, ప్రెస్ మీట్లో కేసీఆర్ మాట్లాడిన పది అంశాలు ఇవే

వరిధాన్యం విషయంలో కేసీఆర్ బీజేపీని విమర్శించారు.

  • By Hashtag U Published Date - 09:07 PM, Tue - 16 November 21
  • daily-hunt
KCR: ధర్నా చౌక్ కి కేసీఆర్, ప్రెస్ మీట్లో కేసీఆర్ మాట్లాడిన పది అంశాలు ఇవే

వరిధాన్యం విషయంలో కేసీఆర్ బీజేపీని విమర్శించారు. రైతులు ఇబ్బందిపడుతున్నా కేంద్రం మొండిగా ఉండడంపై అసహనం వ్యక్తం చేశారు. రైతుల విషయంలో టీఆర్ఎస్ రాజీలేని పోరాటం చేస్తుందని చెప్పారు. తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టిన కేసీఆర్ మాట్లాడిన విషయాలు మీకోసం.

1. ఈనెల 18న ఇందిరా పార్క్ వద్ద టీఆర్ఎస్ ధర్నా చేపట్టనుంది. ఉదయం 11గంటలకు ధర్నా మొదలై మూడు,నాలుగు గంటలపాటు ధర్నాచేసి, తర్వాత గవర్నర్ ను కలిసి వినతి పత్రం ఇస్తాం. ఈ ధర్నాలో మా పార్టీ అన్ని స్థాయిల ప్రజాప్రథినిధులు పాల్గొంటారు. ధర్నా తర్వాత రెండు రోజులు కేంద్రానికి డెడ్ లైన్ పెట్టి, అప్పటికీ కేంద్రం ఒక స్పష్టత ఇవ్వకపోతే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తాం.

2. రాష్ట్ర రైతాంగం పండించిన ధాన్యం కొనుగోలు విషయం లో కేంద్రం ద్వంద వైఖరి అవలంభిస్తుంది. కేంద్రం ఒక్కో రాష్ట్రానికి ఒక్కో నీతిని అవలంబిస్తోంది. పంజాబ్ లో ధాన్యం అంతా కొని ఇక్కడ ఎందుకు కొనరు?

3. వరిధాన్యం విషయంలో స్వయానా నినే ఢిల్లీ వెళ్లి, సంవత్సరం కు ఎంత ధాన్యం కొంటారో చెప్పమని కేంద్రాన్ని అడిగాను. ఐదారు రోజుల్లో చెపుతాం అన్నారు కానీ ఇప్పటికీ ఉలుకు పలుకు లేదు. వర్ష కాలం పంట పై కూడా కేంద్రం క్లారిటీ ఇవ్వడం లేదు. ఇవన్నీ చూసే రైతులకు వేరే పంటలు వెయ్యమని మా మంత్రి చెప్పారు.

4. రాష్ట్ర బీజేపీ నేతలు వరి వెయ్యమని రైతులకు చెప్తోంది. కేంద్రం కొనమని చెప్తోంది అని కేంద్రమంత్రిని అడిగితే, రాష్ట్ర బీజేపీ నేతలు ఏం మాట్లాడుతున్నారో మాకు తెలియదని కేంద్ర మంత్రి తెలిపారు.

5. 6600ల పై చిలుకు కొనుగోలు కేంద్రాలు పెట్టి మేం ధాన్యం కొంటున్నాము. బీజేపీ నేతలు అక్కడికి వెళ్లి డ్రామాలు చేస్తుంటే రైతులు ఆగ్రహం తో బీజేపీ నేతలను అడ్డుకుంటున్నారు.
బీజేపీ నేతలు రైతులపై దాడులు చేస్తున్నారు.

Also Read: ‘రూటు’ మారుస్తున్నగంజాయి మాఫియా…’ఆన్ లైన్’ అడ్డాగా న‌యా దందా

6. రైతుల పై దాడులు క్షమించరాని నేరం. దీని ద్వారా బీజేపీకి పతనమే తప్పా లాభం లేదు. టీఆర్ఎస్ నేతలు రైతుల రూపంలో వచ్చి బీజేపీ నాయకులను అడ్డుకుంటున్నారని ఆరోపించడం హాస్యాస్పదం. టిఆర్ఎస్ కార్యకర్తల్లో రైతులు ఉంటారు కదా. టిఆర్ఎస్ కార్యకర్తలు తప్పకుండా నిలదీస్తారు.

7. రేపు ప్రధానికి లేఖ రాస్తున్నా. బీజేపీ నేతలు రైతులను కన్ఫ్యూజ్ చేసి చిచ్చు రేపే ప్రయత్నం చేస్తున్నారు. రైతుల విషయంలో బీజేపీ ద్వంద ప్రమాణాలను పాటిస్తోంది. బండి సంజయ్ యసంగిలో వరి వెయ్యండి అని చెప్పవా?లేదా? రెండు మూడు రోజుల్లో కేంద్రం సమాదానం చెప్పాలి.

Also Read: చంద్రుడిపై 800కోట్ల మందికి ల‌క్ష ఏళ్ల‌కు స‌రిప‌డా ఆక్సిజ‌న్‌.. కానీ..

8. యాసంగి పంటకు రైతు బంధు డబ్బులు యధావిధిగా ఇస్తాం. కానీ పంటను కేంద్రం కొంటుందనే నమ్మకం లేదు. మాయమాటలు నమ్మి రైతులు మెకేసపోవద్దు.
18 ధర్నా తరువాత రెండు రోజులు ఎదురుచూసి కొనుగోలు పై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేస్తాం.

9. నల్ల చట్టాలను వ్యతిరేకిస్తున్నాం. బీజేపీని వదిలిపెట్టం. వెంటాడుతాం. వేటాడుతాం. తలా, తోక లేకుండా మాట్లాడేపార్టీ బీజేపీ. బీజేపీది పూటకో మాట, రాష్ట్రానికి ఒక నీతి.

10. తెలంగాణ ఉద్యమాల గడ్డ. డిమాండ్లు సాదించుకునేదాకా కేంద్రంతో కొట్లాడుతూనే ఉంటాం. వరిధాన్యంపై స్పష్టత వచ్చాక, కేంద్రం ఇతర ప్రజావ్యతిరేక విధానాలపై తప్పకుండా మా పోరాటం సాగుతుంది.

All MLA's, MP's, MLC's, ZP Chairpersons, all elected representatives will protest on 18th November in Hyderabad on behalf of Farmers – CM #KCR 👍#Telangana

— Chandrashekar Reddy (@Chandrasheker9) November 16, 2021

Tags  

  • cm kcr
  • dharna
  • kcr
  • paddy issue
  • protest against centre
https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/drreddys.jpg

Related News

BRS vs BJP : కేసీఆర్‌పై మోడీ వ్యాఖ్య‌ల‌కు మంత్రి ప్ర‌శాంత్ రెడ్డి కౌంట‌ర్‌.. “నీ బోడి స‌హాయం మాకు ఎందుకు” అంటూ ఘాటు వ్యాఖ్య‌లు

BRS vs BJP : కేసీఆర్‌పై మోడీ వ్యాఖ్య‌ల‌కు మంత్రి ప్ర‌శాంత్ రెడ్డి కౌంట‌ర్‌.. “నీ బోడి స‌హాయం మాకు ఎందుకు” అంటూ ఘాటు వ్యాఖ్య‌లు

నిజామాబాద్ సభలో సీఎం కేసిఆర్‌ పై ప్రధాని మోడీ నిరాధార ఆరోపణలు చేయడం అత్యంత దుర్మార్గమని మంత్రి వేముల

  • DSC Protest:  డీఎస్సీ అభ్యర్థుల నిరసనలో పాల్గొన్న ఎస్ఐఓ

    DSC Protest: డీఎస్సీ అభ్యర్థుల నిరసనలో పాల్గొన్న ఎస్ఐఓ

  • KCR Wanted NDA: బీజేపీలోకి కేసీఆర్..? మోడీ షాకింగ్ కామెంట్స్

    KCR Wanted NDA: బీజేపీలోకి కేసీఆర్..? మోడీ షాకింగ్ కామెంట్స్

  • KCR Vs 1016 : కామారెడ్డిలో కేసీఆర్‌పై 1016 మంది పోటీ.. లబానా కాయితీ లంబాడీలు రెడీ

    KCR Vs 1016 : కామారెడ్డిలో కేసీఆర్‌పై 1016 మంది పోటీ.. లబానా కాయితీ లంబాడీలు రెడీ

  • PM Modi : నేడు తెలంగాణ‌కు రానున్న‌ ప్ర‌ధాని మోడీ.. ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు శంకుస్థాప‌న చేయ‌నున్న ప్ర‌ధాని

    PM Modi : నేడు తెలంగాణ‌కు రానున్న‌ ప్ర‌ధాని మోడీ.. ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు శంకుస్థాప‌న చేయ‌నున్న ప్ర‌ధాని

Latest News

  • Trudeau: భారత్ తో వివాదం మాకు ఇష్టం లేదు.. కెనడా ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు

  • World Cup 2023: కొత్త బ్యాట్ లు రెడీ… ఇక విధ్వంసమే

  • Asian Games 2023: ఆసియా క్రీడల్లో పరుల్ చౌదరికి బంగారు పతాకం

  • Nara Bhuvaneswari : అమరావతి నిర్మాణం జరిగి తీరుతుంది.. రాజ‌ధాని రైతుల‌తో నారా భువ‌నేశ్వ‌రి

  • 1 Killed : అమెరికాలో స్విమ్మింగ్‌పూల్‌లో ప‌డి హైద‌రాబాద్ వ్య‌క్తి మృతి

Trending

    • Chandrababu CM : ఏపీలో అధికారం టీడీపీదే.! ఆత్మ‌సాక్షి లేటెస్ట్ స‌ర్వే వెల్ల‌డి!!

    • Snake Head Alive : చనిపోయాక కూడా పాము తల సజీవంగానే ఉంటుందా ?

    • Bhuloka To Yamaloka : భూలోకం టు యమలోకం .. ఆత్మల పయనం ఇలా..

    • Court Named Child : ఆ పాపకు కోర్టు పేరు పెట్టింది.. ఎందుకంటే ?

    • Raped Dozens Of Dogs : 42 కుక్కలపై రేప్ చేసిన జంతు శాస్త్రవేత్త.. దోషిగా ఖరారు

Hashtag U

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice

Telugu News

  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat

Trending News

  • World Cup
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • kcr

follow us

  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd
Go to mobile version