Huzurabad : ఆ రెండు పార్టీలు డబ్బులు పంచుతున్నయ్.. ఎన్నిక రద్దుకు కాంగ్రెస్ డిమాండ్!
హుజురాబాద్... దేశంలోని రిచెస్ట్ ఎన్నికగా భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే హుజురాబాద్ ఉప ఎన్నికలను పరిశీలిస్తే రాజకీయ నాయకులు చెప్పిన మాటలు చెప్పిన మాటలే నిజమేనని స్పష్టమవుతోంది.
- By Balu J Published Date - 05:16 PM, Thu - 28 October 21

హుజురాబాద్… దేశంలోని రిచెస్ట్ ఎన్నికగా భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే హుజురాబాద్ ఉప ఎన్నికలను పరిశీలిస్తే రాజకీయ నాయకులు చెప్పిన మాటలు నిజమేనని స్పష్టమవుతోంది. అలా ఎన్నికల ప్రచారం ముగిసిందో లేదో.. ఇలా ప్రలోభాల పర్వానికి తెర లేపారు. ప్రధాన పార్టీలు ఇంటింటికి తిరుగుతూ డబ్బులు పంపిణీ చేస్తుండటంతో చర్చనీయాంశంగా మారింది. అయితే నాయకులు పంచుతున్నా డబ్బులు తమకు అందలేదని రెండు గ్రామాలు ప్రజలు ఏకంగా రోడ్డు ఎక్కడం, ధర్నాలకు దిగడంతో హుజురాబాద్ లో రచ్చ రచ్చ జరిగింది. ఈ నేపథ్యంలో హుజురాబాద్ ఉప ఎన్నికను వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.
How Democracy at sale in #Huzurabad ? @JPNadda sending crores which they earn from Corrupt Sangi Sarkar and @ECISVEEP just watches the money distribution. ECI must show some courage they must countermand the election will they ? #MoneyDistribution pic.twitter.com/CRX0NpAqIz
— Manickam Tagore .B🇮🇳✋மாணிக்கம் தாகூர்.ப (@manickamtagore) October 28, 2021
టీఆర్‌ఎస్, బీజేపీ రెండూ ‘ఓట్లు కొనుక్కోవడానికి’ డబ్బు పంచడంలో బిజీగా ఉన్నాయని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఒక్కో ఓటరుకు రూ.6,000 నుంచి రూ.10,000 వరకు పంపిణీ చేసినట్లు, తమ వద్ద ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. డబ్బు, మద్యం పంపిణీ ద్వారా టీఆర్‌ఎస్, బీజేపీ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని భారీగా ఉల్లంఘిస్తున్నాయని పేర్కొంటూ అక్టోబర్ 30న జరగనున్న హుజూరాబాద్ ఉప ఎన్నికను రద్దు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. న్యూఢిల్లీలో ఉన్న ఏఐసీసీ నేతలు దాసోజు శ్రవణ్, సీహెచ్ వంశీచంద్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేతలు కుసుమ కుమార్, హర్కర వేణుగోపాలరావు సాయంత్రంలోగా ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్రకు అధికారికంగా వినతిపత్రం సమర్పించనున్నారు.
టీఆర్‌ఎస్, బీజేపీ రెండూ ‘ఓట్లు కొనుక్కోవడానికి’ డబ్బు పంచడంలో బిజీగా ఉన్నాయని నేతలు ఆరోపించారు. “3 గంటల్లో, కొన్ని చోట్ల 1.5 లక్షల మంది ఓటర్లకు రూ.90 కోట్లు పంపిణీ చేశారు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. హుజూరాబాద్ ఉపఎన్నిక గతంలో ఎన్నడూ లేనివిధంగా రాజకీయ పార్టీలు తమ ఎత్తులను పెంచే భారీ ఎన్నికల జూదంగా మారిందని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు, ఏఐసీసీ సభ్యుడు జి.నిరంజన్ నగరంలో అభిప్రాయపడ్డారు. “ఓటర్లను అన్ని విధాలుగా ఆకర్షిస్తున్నారు. చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ శశాంక్ గోయెల్ కఠినమైన వైఖరిని తీసుకోకముందే, పని ఇప్పటికే పూర్తి కావడం దురదృష్టకరం. అసెంబ్లీ నియోజకవర్గంలో 3,000 మంది పోలీసులను, 1800 మంది సెంట్రల్ ఏజెన్సీల సిబ్బందిని ఎన్నికలకు పోస్టింగ్‌కు పంపడం వల్ల ప్రయోజనం ఏమిటని ఆయన ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించారు.
Related News

CM Vishnu Deo: ఛత్తీస్‌గఢ్ కొత్త ముఖ్యమంత్రిగా విష్ణు దేవో
ఛత్తీస్‌గఢ్‌లో మెజారిటీ దాటి 54 నియోజకవర్గాల్లో విజయం సాధించి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. మొదట ముఖ్యమంత్రి ఎంపికలో ప్రతిష్టంభన నెలకొంది. అయితే జరిగిన బీజేపీ ఎమ్మెల్యేల సమావేశంలో గిరిజనులకు చెందిన మాజీ కేంద్ర మంత్రి విష్ణు దేవ్ సాయి