HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Traffic Restrictions In Saddula Bathukamma Hyderabad Tomorrow

Traffic Restrictions: రేపు సద్దుల బతుకమ్మ, హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు!

ఈ నెల 22వ తేదీన ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ ట్రాఫిక్ సుధీర్‌బాబు ఆదేశాలు జారీ చేశారు.

  • Author : Balu J Date : 21-10-2023 - 11:41 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Technical Glitches
Traffic

సద్దుల బతుకమ్మ వేడుకల సందర్భంగా ట్యాంక్‌బండ్, లుంబినీ పార్క్ పరిసరాల్లో ఈ నెల 22వ తేదీన ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ ట్రాఫిక్ సుధీర్‌బాబు ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అమలులో ఉండనున్నాయి. ట్రాఫిక్ ఆంక్షల కారణంగా వాహనాలను మళ్లిస్తామని పేర్కొన్నారు. వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయమార్గంలో వెళ్లాలని కోరారు.

సిటీలో ట్రాఫిక్ ఆంక్షలున్న ప్రాంతాలు ఇవే

ఇతర జిల్లాల నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులను జేబీఎస్‌ స్వీకార్‌-ఉపకార్‌ వద్ద మళ్లిస్తారు. సిటీ బస్సులను కర్బాలా మైదాన్‌ వద్ద మళ్లిస్తారు.
బతుకమ్మ వేడుకలకు వచ్చే వారికి స్నో వరల్డ్‌, ఎన్టీఆర్‌ స్టేడియం, ఎన్టీఆర్‌ గార్డెన్‌ పక్కనే ఉన్న మీ కోసం పార్కింగ్‌ ప్రాంతాలలో పార్కింగ్‌ స్థలాలను కేటాయించారు.

తెలుగుతల్లి ఫ్లై ఓవ‌ర్, కర్బాలా మైదాన్‌ వైపు నుంచి వచ్చే వాహనాలకు ట్యాంక్‌బండ్ మీదుగా మధ్యాహ్నాం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అనుమతి లేదు.

సికింద్రాబాద్‌ నుంచి ట్యాంక్‌బండ్ పైకి వచ్చే వాహనాలను కర్బాలా మైదాన్‌ వద్ద బైబిల్‌ హౌస్‌ మీదుగా తెలుగు తల్లి ఫ్లై ఓవ‌ర్ వైపు మళ్లిస్తారు.
ఎక్బాల్‌మినార్‌ నుంచి వచ్చే వాహనాలను, తెలుగు తల్లి ఫ్లై ఓవ‌ర్ వైపు మళ్లిస్తారు.

పంజాగుట్ట, రాజ్‌భవన్‌ రోడ్డులో నుంచి ఖైరతాబాద్ ఫ్లై ఓవ‌ర్‌ మీదుగా వచ్చే వాహనాలను నెక్లెస్‌ రోటరీ ఇందిరాగాంధీ విగ్రహాం వద్ద ఐమాక్స్‌ రూట్‌లోకి మళ్లిస్తారు.

నల్లగుట్ట నుంచి బుద్దభవన్‌ వైపు అనుమతి లేదు. నల్లగుట్ట క్రాస్‌రోడ్డు వద్ద రాణిగంజ్‌, నెక్లెస్‌ రోడ్డు వైపు ఈ వాహనాలను మళ్లిస్తారు.
హిమాయత్‌నగర్‌, బషీర్‌బాగ్‌, అంబేద్కర్‌ విగ్రహాం వైపు నుంచి ట్యాంక్‌బండ్‌పైకి అనుమతి లేదు. ఈ వాహనాలు ఇక్బాల్‌ మినార్‌ వైపు వెళ్లి యూ టర్న్‌ తీసుకొని తెలుగు తల్లి జంక్షన్‌, తెలుగు తల్లి ఫ్లై ఓవ‌ర్‌పై నుంచి వెళ్లాలి.

సికింద్రాబాద్‌ వచ్చే వాహనాలను అప్పర్ ట్యాంక్‌బండ్ పైకి అనుమతించ‌రు. ఆ వాహనాలను డీబీఆర్‌ మిల్స్‌ వద్ద కట్టమైసమ్మ ఆలయం, తెలుగు తల్లి ఫ్లై ఓవ‌ర్‌ వైపు మళ్లిస్తారు.

ముషీరాబాద్‌ నుంచి ట్యాంక్‌బండ్‌ వైపు వచ్చే వాహనాలను కవాడిగూడ క్రాస్‌రోడ్డు వద్ద మళ్లిస్తారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hyderabad
  • hyderabad police
  • Saddula Bathukamma
  • traffic restrictions

Related News

Shivapratap Shukla Appointed As Telangana New Governor

నేడు హైదరాబాద్‌కు కొత్తగవర్నర్ రాక.. స్వాగతం పలకనున్న సీఎం రేవంత్ రెడ్డి

Telangana New Governor  తెలంగాణ రాజకీయ యవనికపై కొత్త మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్ర నూతన గవర్నర్‌ శివప్రతాప్ శుక్లా నేడు భాగ్యనగరంలో అడుగుపెట్టనున్నారు. గతంలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా పనిచేసిన ఆయన, ఇప్పుడు తెలంగాణలో బాధ్యతలు చేపట్టబోతున్నారు. కాసేపట్లో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్న శుక్లాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు ఘనంగా స్వాగతం

  • Fish In Beer Bottle

    మద్యం ప్రియుడికి షాక్..బీర్ బాటిల్‌లో చేప పిల్ల కలకలం

  • Ghmc

    జీహెచ్ఎంసీలో పన్నులు ఎగ్గొట్టిన వారి జాబితా సిద్దం.. త్వరలో వీరి ఆస్తులు సీజ్..!

  • Kuktapally Nallacheruvu

    Hyderabad : మరో రెండు చెరువులకు పునరుజ్జీవం పోసిన హైడ్రా !!

  • Motorists Queue For Petrol

    యుద్ధం ఎఫెక్ట్ : హైదరాబాద్ లో పెట్రోల్ కోసం బారులు తీరిన వాహనదారులు

Latest News

  • Wife Kills Husband : ప్రియుడి కోసం భర్తను కడతేర్చిన భార్య.. గుండెపోటు డ్రామా వెనుక భయంకరమైన నిజం

  • ఏపీలో తొలి దశలో 135 ఈవీ ఛార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు

  • టీమిండియాపై నోట్ల వర్షం.. బీసీసీఐ బంపర్ ఆఫర్

  • Liquor Price : మందుబాబులకు డబుల్ కిక్..భారీగా తగ్గనున్న మద్యం ధరలు

  • శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం.. భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

Trending News

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

    • హనుమాన్ జన్మోత్సవం.. పూజా ముహూర్తం, పరిహారాలివే!

    • క‌న్నీళ్లు ఆపుకుని ఫైన‌ల్ మ్యాచ్ ఆడిన ఇషాన్ కిష‌న్‌!

    • Prabhakar Prasad: అమెరికా లో చాయ్ అమ్ముతూ ఇండియన్ ఎంత సంపాదిస్తున్నాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !!

    • టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో స‌రికొత్త రికార్డు క్రియేట్ చేసిన భార‌త్‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd