HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Traffic Restrictions In Hyderabad

Traffic Restrictions : హైద‌రాబాద్‌లో నేడు ట్రాఫిక్ ఆంక్ష‌లు.. ప్ర‌త్యామ్నాయ మార్గాల్లో వెళ్లాల‌ని పోలీసుల సూచ‌న‌

తెలంగాణ‌లో జాతీయ స‌మైక్య‌త వజ్రోత్సవాలు జ‌ర‌గుతున్నాయి. ఈ నేప‌థ్యంలో న‌గ‌రంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్ష‌లు...

  • Author : Prasad Date : 17-09-2022 - 8:29 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Trafic
Trafic

తెలంగాణ‌లో జాతీయ స‌మైక్య‌త వజ్రోత్సవాలు జ‌ర‌గుతున్నాయి. ఈ నేప‌థ్యంలో న‌గ‌రంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించారు. సికింద్రాబాద్ ప‌రేడ్ గ్రౌండ్‌లో బీజేపీ స‌భతో పాటు.. ఎన్టీఆర్ స్టేడియంలో సీఎం కేసీఆర్ స‌భ‌లు జ‌రుగుతుండ‌టంతో న‌గ‌రంలోని ట్రాఫిక్ పోలీసులు అలెర్ట్ అయ్యారు. ప‌లు ప్రాంతాల్లో ఆంక్ష‌లు విధించారు. సీఎం కేసీఆర్ బహిరంగ సభ జ‌రిగే ప్రాంతం చుట్టూ 3 కి.మీ మేర ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. సెంట్రల్ జోన్ సహా పలు ప్రాంతాల్లోని కూడళ్ల వద్ద ట్రాఫిక్‌ను మళ్లించే ఏర్పాటు చేశామన్నారు పోలీసులు. మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 7 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమ‌ల్లో ఉంటాయ‌ని పోలీసులు తెలిపారు. కవాడిగూడ ఎక్స్‌రోడ్స్‌ నుంచి షెయిలింగ్‌ క్లబ్‌, లోయర్‌ ట్యాంక్‌ బండ్‌కు ట్రాఫిక్‌ అనుమతి లేదు. ఈ వాహనాలను కవాడిగూడ ఎక్స్‌ రోడ్స్‌ నుంచి బైబిల్‌ హౌస్‌ వైపు మళ్లిస్తారు. అశోక్‌నగర్‌ నుంచి ఎన్టీఆర్‌ స్టేడియం వైపు అనుమతి లేదు. ఈ వాహనాలను బాకారం బ్రిడ్జి నుంచి సీజీవో టవర్స్‌ బన్సీలాల్‌పేట్‌ వైపు మళ్లిస్తారు.చ‌ముషీరాబాద్‌ నుంచి ఆర్టీసీ క్రాస్‌ రోడ్డు మీదుగా ఎన్టీఆర్‌ స్టేడియం వైపు ట్రాఫిక్‌కు అనుమతించరు.

ఆర్టీసీ క్రాస్‌రోడ్డు వద్ద నుంచి నారాయణగూడ క్రాస్‌రోడ్డు వైపు మళ్లిస్తారు. ఆజామాబాద్‌ జంక్షన్‌ నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్డు వైపు ట్రాఫిక్‌ అనుమతించరు. ఈ ట్రాఫిక్‌ను వీఎస్‌టీ క్రాస్‌రోడ్స్‌ నుంచి బాగ్‌లింగంపల్లి వైపు మళ్లిస్తారు.సాధురామ్‌ కంటి ఆస్పత్రి నుంచి ఏవీ కాలేజీ మీదుగా ఎన్టీఆర్‌ స్టేడియం వైపు ట్రాఫిక్‌ అనుమతించరు. దోమల్‌గూడ టీ జంక్షన్‌ నుంచి చిక్కడపల్లి మెట్రో స్టేషన్‌, ఆర్టీసీ క్రాస్‌ రోడ్డువైపు మళ్లిస్తారు. లిబర్టీ నుంచి అప్పర్‌ట్యాంక్‌ బండ్‌కు ట్రాఫిక్‌ను అనుమతించరు. లిబర్టీ వద్ద హిమాయత్‌నగర్‌ వైపు.. ఇక్బాల్‌ మినార్‌ నుంచి తెలుగుతల్లి ఫ్లై ఓవర్‌ వైపు ట్రాఫిక్‌ను అనుమతించరు. పాత సచివాలయం గేట్‌ నుంచి అంబేద్కర్‌ విగ్రహం మీదుగా లిబర్టీ వైపు మళ్లిస్తారు. నారాయణగూడ నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్డుకు.. అక్కడి నుంచి ఎన్టీఆర్‌ స్టేడియం వైపు వాహనాలకు అనుమతి లేదు. ఆర్టీసీ క్రాస్‌రోడ్డు నుంచి ఆ వాహనాలను ముషీరాబాద్‌ వైపు మళ్లిస్తారు. రాణిగంజ్‌, ఎంజీరోడ్డు, ఆర్పీరోడ్డు నుంచి అప్పర్‌ ట్యాంక్‌ వైపు ట్రాఫిక్‌కు అనుమతి లేదు. ఈ వాహనాలను కర్బాలా మైదాన్‌ నుంచి బైబిల్‌ హౌస్‌, ముషీరాబాద్‌ వైపు మళ్లిస్తారు. తెలుగు తల్లి ఫ్లై ఓవర్‌, ఇక్బాల్‌ మినార్‌ (రవీంద్రభారతి) నుంచి కట్టమైసమ్మ వైపు అనుమతిలేదు. కట్టమైసమ్మ ఆలయం నుంచి అంబేద్కర్‌ విగ్రహం వెళ్లే రోడ్డు మూసి ఉంటుంది. నెక్లెస్‌ రోడ్డు కూడా రెండు వైపులా మూసి ఉంటుంది. ట్రాఫిక్‌కు అనుమతి ఉండదు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amit shah in hyderabad
  • bjp
  • cm kcr
  • hyderabad
  • traffic restrictions
  • trs

Related News

HYDRAA

HYDRAA : పుప్పలగూడ‌ ముష్కిన్ చెరువులో హైడ్రా భారీ ఆపరేషన్..

పుప్పాల‌గూడ‌లో హైడ్రా భారీ ఆప‌రేష‌న్ చేప‌ట్టింది. చెరువు మధ్యలో నిర్మించిన ఆక్రమణలు, గుడిసెలు, కట్టలను అధికారులు తొలగించి చెరువు సరిహద్దులను రక్షించే చర్యలు ప్రారంభించారు. ముష్కిన్ చెరువు పరిసర ప్రాంతాల్లో సుమారు ₹5,500 కోట్ల విలువైన భూమి ఉంది. చెరువు భూభాగాన్ని ఆక్రమించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే సమాచారం మేరకు హైడ్రా అధికారులు తనిఖీలు నిర్వహించారు. హెచ్‌ఎండిఏ రికా

  • Balka Suman

    BRS : మాజీ ఎమ్మెల్యే  బాల్కా సుమన్ అరెస్ట్.. రెచ్చగొట్టే వ్యాఖ్యలపై కేసు నమోదు

  • AP

    AP : కుప్పంలో పీఎం మిత్రా పార్క్, అమరావతిలో నిఫ్ట్.. కేంద్రానికి ఏపీ ప్రతిపాదనలు

  • World Ivf Day

    IVF : గాంధీ ఆస్పత్రి ఐవీఎఫ్ సెంటర్ ఘనత.. ఉచిత చికిత్సతో 9 ఏళ్ల తర్వాత దంపతులకు..!

  • Arrest

    Advocate Murder Case : హైదరాబాద్ న్యాయవాది హత్య కేసులో ఏడుగురు అరెస్ట్

Latest News

  • Bengaluru : మటన్ పేరుతో బీఫ్ విక్రయం?.. బెంగళూరులో ఇద్దరు రెస్టారెంట్ యజమానుల అరెస్ట్

  • CONGRESS vs BRS : ప‌వ‌ర్ పాలిటిక్స్‌.. ఉచిత విద్యుత్‌పై రేవంత్ స‌వాల్‌కు బీఆర్ఎస్ సైలెంట్‌..?

  • IPL : ఆర్‌సీబీ అభిమానులకు ఉచిత మెట్రో ప్రయాణం.. ప్ర‌చారాన్ని ఖండిచిన బెంగళూరు మెట్రో రైల్ కార్పోరేష‌న్‌

  • Minister Komatireddy : మానవత్వం చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి.. “భ‌విత ” బంగారు భ‌విష్య‌త్ కోసం అండ‌గా

  • TDP NRI : లాస్ ఏంజెల్స్ లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు వేడుకలు

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd