HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Tpcc Chief Revanth Reddy Fires On Cm Kcr

Revanth Reddy : కేసీఆర్ నిధులివ్వ‌కే స‌ర్పంచ్‌ల ఆత్మ‌హ‌త్య‌లు – టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

సీఎం కేసీఆర్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్‌ అధిష్టానం సర్పంచ్‌ల వ్యవస్థను నిర్వీర్యం చేసిందని

  • Author : Prasad Date : 10-01-2023 - 8:44 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Tcongress
Tcongress

సీఎం కేసీఆర్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్‌ అధిష్టానం సర్పంచ్‌ల వ్యవస్థను నిర్వీర్యం చేసిందని ఆయ‌న ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం . గ్రామపంచాయతీలకు రావాల్సిన నిధులు విడుదల చేయకపోవడంతో 60 మంది సర్పంచ్‌లు ఆత్మహత్యకు పాల్పడ్డారని రేవంత్ రెడ్డి తెలిపారు. బీఆర్‌ఎస్‌ను ఓడించి కేసీఆర్‌కు అధికారం దక్కకుండా చేస్తేనే సర్పంచ్‌లకు పూర్వ వైభవం వస్తుందని అన్నారు. టీపీసీసీ ఆధ్వర్యంలో రాజీవ్‌గాంధీ పంచాయత్‌ రాజ్‌ సంఘటన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిరసన సభలో రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. గ్రామంలో సర్పంచ్‌కి ప్రథమ పౌరుడిగా గౌరవం ఉందని, అలాంటి స‌ర్సంచ్‌లకు రాష్ట్ర ప్ర‌భుత్వం నిధులు ఇవ్వ‌క‌పోవ‌డంతో తెలంగాణలో 60 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిపారు. కేసీఆర్‌ నేతృత్వంలోని ప్రభుత్వం రాష్ట్రంలోని పంచాయతీలకు చెందిన రూ.35 వేల కోట్లను దారి మళ్లించిందని ఆరోపించారు.

సర్పంచ్‌ల ఖాతాల్లో జమ చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించిందని ఆరోపించారు. కొందరు స‌ర్పంచ్‌లు వడ్డీలకు డబ్బులు తెచ్చి తమ గ్రామాల అభివృద్ధికి వెచ్చించారని అన్నారు. సర్పంచ్‌లకు రెండు, మూడేళ్లు గడిచినా నిధులు రాకపోవడంతో కొందరు తమ జీవితాలను అంతమొందించుకోగా, మరికొందరు తమ భార్యలకు మంగళసూత్రాలు తాకట్టు పెట్టారని రేవంత్ రెడ్డి అన్నారు. సర్పంచ్‌లకు సంఘీభావంగా పార్టీ చేపట్టిన ధర్నాను అనుమతించవద్దని తెలంగాణ సీఎం పోలీసులకు ఆదేశాలు జారీ చేసి పార్టీని అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేశారన్నారు. హైకోర్టు అనుమతితో ఈరోజు నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, త‌మ‌ ధర్నాకు పలువురు సర్పంచ్‌లు మద్దతు తెలిపారని రేవంత్ అన్నారు. గ్రామపంచాయతీలకు రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని, ఇప్పటి వరకు చనిపోయిన ప్రతి సర్పంచ్ కుటుంబానికి కోటి రూపాయల చొప్పున పరిహారం అందించాలని రేవంత్‌ రెడ్డి డిమాండ్ చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • cm kcr
  • congress
  • PCC Chief revanth reddy
  • telangana
  • tpcc chief revanth
  • trs

Related News

Rajya Sabha Elections

Breaking News రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల

Rajya Sabha Elections : రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. తెలంగాణలోని రెండు స్థానాలు సహా 10 రాష్ట్రాల్లో 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 26వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్, మార్చి 16న ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపింది. తెలంగాణ నుంచి సురేశ్ రెడ్డి, అభిషేక్ సింఘ్వీలతో పాటు 37 మంది పదవీ కాలం ఏప్రిల్ నెలతో ముగియనుంది. మహారాష్ట్రలో 7, ఒడిశా 4, తమిళనాడు 6, పశ్చిమ

  • Engineering Students Telang

    Engineering Students : ప్రైవేటు ఇంజినీరింగ్ స్టూడెంట్స్ కు బిగ్ షాక్..భారీగా పెరిగిన ఫీజులు

  • New Holland Launches 'workm

    తెలంగాణ మార్కెట్లోకి ‘వర్క్‌మాస్టర్ 105’ ట్రాక్టర్‌

  • Jangaon Thorrur Congress

    లక్కీ డ్రాలో తొర్రూరు, జనగామ కాంగ్రెస్ కైవసం..

  • Half Day Schools

    Half-Day Schools: తెలంగాణ లో ఒంటిపూట బడులు ఎప్పటి నుండి అంటే ..!!

Latest News

  • టీ20 వరల్డ్ కప్ 2026.. నెదర్లాండ్స్‌పై భారత్ ఘనవిజయం!

  • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

  • భార‌త్ వ‌ర్సెస్ నెద‌ర్లాండ్స్ మ్యాచ్‌.. క్యాచ్ ఎలా ప‌ట్టాడో చూశారా?!

  • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

  • తిరుమల నెయ్యి టెండర్లపై ‘వైసీపీ’ దుష్ప్రచారం.. వాస్తవాలను వెల్లడించిన టీటీడీ చైర్మన్!

Trending News

    • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

    • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

    • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

    • ఆధార్ కార్డ్‌లో భారీ మార్పులు.. ఏంటంటే?

    • సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన ఇండియా-ఏ.. పాక్‌తో ఫైన‌ల్ మ్యాచ్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd