Revanth Meets Bandla: కాంగ్రెస్ కు ‘బండ్ల గణేశ్’ జై
తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ను బలోపేతం చేయడమే లక్ష్యంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దూసుకుపోతున్నారు.
- By Balu J Published Date - 02:59 PM, Sat - 25 June 22

తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ను బలోపేతం చేయడమే లక్ష్యంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దూసుకుపోతున్నారు. టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేష్‌ను శుక్రవారం ఆయన నివాసంలో కలుసుకుని కాంగ్రెస్ కార్యకలాపాల్లో చురుగ్గా వ్యవహరించాల్సిందిగా ఆహ్వానించారు. మునుపటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు, గణేష్ సెప్టెంబరు 2018లో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఎన్నికల సమయంలో ఆయన సేవలను వినియోగించుకోనందుకు పార్టీతో అంటిముట్టనట్టుగా ఉన్నాడు.
అంతేగాక, బండ్లకి పార్టీ పదవి ఇవ్వలేదు. ఎమ్మెల్యే టికెట్ నిరాకరించింది. అవమానంగా భావించి పార్టీతో తెగతెంపులు చేసుకుని సినిమాల్లో యాక్టివ్‌గా మారారు. రాజకీయాల్లో రెడ్డి నాయకులు ఉన్నతమైనవారని రేవంత్ వ్యాఖ్యానించడంతో బండ్ల తన అసంతృప్తిని ట్వీట్ ద్వారా వ్యక్తం చేశారు. గణేష్ ముక్కుసూటిగా వ్యవహరిస్తాడు. ఆయన వ్యాఖ్యలు మీడియాలో వివాదాస్పదంగా మారాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు నమ్మకమైన అనుచరుడు. దర్శకుడు పూరీ జగన్నాధ్‌పై గణేష్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి.
https://twitter.com/ganeshbandla/status/1540321117872992257