HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Tpcc Chief Revanth Comments On Brs Goverment

Revanth Reddy : రైతు వేదిక‌లు రాజ‌కీయ వేదిక‌లు కానివ్వొద్దు.. రైతుల‌కు రేవంత్ పిలుపు

రుణమాఫీ, కేసీఆర్ రైతు వ్యతిరేక విధానాలపై పోరాడాల‌ని రైతుల‌కు రైవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న

  • Author : Prasad Date : 16-07-2023 - 6:51 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Revanth Reddy
Revanth Reddy Secret Survey On Candidates

రుణమాఫీ, కేసీఆర్ రైతు వ్యతిరేక విధానాలపై పోరాడాల‌ని రైతుల‌కు రైవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న రైతుల‌కు బ‌హిరంగ లేఖ రాశారు. రైతుతో రాజకీయం చేయడానికి బీఆర్ఎస్ బయలు దేరిందని.. రైతు వేదికలను ఇన్నాళ్లు అలంకార ప్రాయంగా బీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఉంచింద‌ని ఆయ‌న లేఖ‌లో ఆరోపించారు. రైతు వేదిక‌ల‌ను ఇప్పుడు రాజకీయ వేదికలుగా మార్చడానికి బరితెగించిందని.. రైతు రుణ మాఫీ కోసం ఇన్నాళ్లు మనం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూశామ‌ని రేవంత్ రెడ్డి ప్ర‌స్తావించారు. అయితే చివరి బడ్జెట్ కూడా ప్రవేశ పెట్టడం అయిపోయిందని.. ఇక రుణమాఫీ చేయబోదన్న విషయం స్పష్టత వచ్చేసిందని తెలిపారు. రాష్ట్రంలో రుణమాఫీకి అర్హులైన రైతుల సంఖ్య అక్షరాలా 31 లక్షలు మంది ఉన్నార‌ని.. రూ.20 వేల కోట్ల మేర రుణాలు మాఫీ చేయాల్సిన ప్రభుత్వం రైతులను నిలువునా మోసం చేసిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ మాటలకు మోసపోయి అప్పుల ఊబిలో చిక్కిన రైతులు దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యలకు ఒడిగడుతున్నారని తెలిపారు.

ధాన్యం సేకరించిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తామని జారీ చేసిన ఆదేశాలు కాగితాలకే పరిమితమయ్యాయన్నారు. జూన్ 15 నాటికి రూ.6,800 కోట్ల మేర బకాయిలు ఉన్నాయని.. రాష్ట్ర వ్యాప్తంగా గత తొమ్మిదేళ్లలో లక్షల ఎకరాల అసైన్డ్ భూములను పేదల నుండి ప్రభుత్వం లాక్కుందని రేవంత్ రెడ్డి లేఖ‌లో ఆరోపించారు. పేద గిరిజన, దళిత బిడ్డలకు భూములు ఇవ్వడానికి మాత్రం ప్రభుత్వానికి చేతులు రాలేదని.. కానీ ఎన్నికలు సమీపిస్తుండటంతో పోడు భూముల పట్టాలపై కేసీఆర్ ప్రభుత్వం హడావుడి మొదలు పెట్టిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 11.50 లక్షల మంది ఆదివాసీలు పోడు పట్టాలకు అర్హులని తేలిందని.. కానీ కేవలం నాలుగు లక్షల మందికి పట్టాలు ఇచ్చినట్టు చేసి చేతులు దులుపుకుందన్నారు. రైతులకు ఎరువులు ఫ్రీగా ఇస్తామని ప్రభుత్వం మోసం చేసింద‌ని.. రైతుకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పి కేవలం 10 గంటలు కూడా ఇవ్వడం లేదన్నారు. ఇందుకు సబ్ స్టేషన్లలో లాగ్ బుక్ లే సాక్ష్యమ‌న్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • cm kcr
  • congress
  • revanth reddy
  • telngana
  • tpcc chief revanth

Related News

Telangana Cabinet

త్వరలో మంత్రివర్గ విస్తరణ.. రేవంత్ సర్కార్ కీల‌క నిర్ణ‌యం!

మంత్రివర్గంలో చోటు దక్కుతుందనే ఆశతో చాలా మంది సీనియర్ ఎమ్మెల్యేలు ఇప్పటి నుండే తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు.

    Latest News

    • Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు శుభవార్త.. రూ.300 తగ్గింపు ఎలాగంటే !!

    • Arava Sreedhar Issue : ఇదేనా పవన్ మీ ప్రశ్నించే గుణం..? – హర్ష వీణ

    • Trisha: విజయ్‌తో ప్రేమ లేకపోతే అర్థమే లేదంటూ త్రిష పోస్ట్

    • YCP : ఆ ఇద్దరి నేతలపై జగన్ కన్ను

    • Hyundai : హ్యుందాయ్ కార్లపై భారీ డిస్కౌంట్స్

    Trending News

      • ఈ దేశంలో డేలైట్ సేవింగ్ టైమ్.. నిద్ర కోసం గంట టైమ్ వెన‌క్కి!

      • హైవేలపై ప్ర‌యాణించేవారికి బిగ్ అల‌ర్ట్.. ఏప్రిల్ 10 నుంచి!

      • ఒకటి కంటే ఎక్కువ సార్లు వివాహం చేసుకున్న హీరోయిన్స్ వీరే!

      • బీహార్ రాజకీయాల్లో పెను మార్పు.. జాతీయ రాజకీయాల వైపు నితీష్ అడుగులు!

      • అమెరికా- ఇరాన్ మధ్య యుద్ధం.. 2,076 మంది మృతి!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd