Nitin Gadkari PM Offer: నితిన్ గడ్కరీకి ప్రధానమంత్రి పదవి ఆఫర్
Nitin Gadkari PM Offer: నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. నువ్వు ప్రధాని అయితే మేం మద్దతిస్తాం అని ఓ రాజకీయ నాయకుడు చెప్పినట్లు తెలిపారు. అయితే అతని కోరికను నేను సున్నితంగా తిరస్కరించానని, ప్రధాని కావడమే తన జీవిత లక్ష్యం కాదన్నారు నితిన్ గడ్కరీ
- By Praveen Aluthuru Published Date - 10:00 AM, Sun - 15 September 24

Nitin Gadkari PM Offer: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రధాన మంత్రి పదవిపై షాకింగ్ కామెంట్స్ చేశారు. తాను ప్రధాని పదవి రేసులో ఉంటే ఓ రాజకీయ నాయకుడు తనకు మద్దతు ఇస్తానని చెప్పారట. అయితే తనకు ప్రధాని పదవిపై ఆశ లేదని, దీంతో అతని మద్దతును సున్నితంగా తిరస్కరించానని చెప్పాడు. నాగ్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో గడ్కరీ మాట్లాడుతూ.. తనకు జరిగిన ఓ సంఘటన గుర్తు చేసుకున్నారు.
నాగ్‌పూర్‌లో జర్నలిస్టుల సన్మాన కార్యక్రమానికి హాజరైన నితిన్ గడ్కరీ(Nitin Gadkari)మాట్లాడుతూ.. నువ్వు ప్రధాని అయితే మేం మద్దతిస్తాం అని ఓ రాజకీయ నాయకుడు చెప్పినట్లు తెలిపారు. అయితే అతని కోరికను నేను సున్నితంగా తిరస్కరించానని, ప్రధాని కావడమే తన జీవిత లక్ష్యం కాదన్నారు నితిన్ గడ్కరీ. నేను నా విలువలను గౌరావిస్తానని, అలాగే నా పార్టీకి విధేయుడుగా ఉంటానని చెప్పారు. వాస్తవానికి 2024 మరియు 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో ప్రధాని పదవికి నితిన్ గడ్కరీ పేరు ప్రస్తావనకు వచ్చింది. ఫిబ్రవరిలో సాధారణ ఎన్నికలకు ముందు అనేక సర్వేలలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మరియు ఉత్తరప్రదేశ్ సిఎం యోగి ఆదిత్యనాథ్ తర్వాత గడ్కరీ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ వారసుడిగా పరిగణించబడ్డారు. ఈ సర్వేలో ఆయన మూడో స్థానంలో నిలిచారు.
2019లో ఇలాంటి చర్చలు జరుగుతున్నప్పుడు గడ్కరీ తిరస్కరించారు. 2019లో గడ్కరీ మాట్లాడుతూ భారత ప్రధాని పదవి సమర్థుడైన నరేంద్ర మోడీ(Narendra Modi) చేతుల్లో ఉంది. మనందరం ఆయన వెనుక ఉన్నాము. ఆయన విజన్‌ను సాకారం చేయడంలో నేను మరొక కార్మికుడిని. నేను ప్రధాని అయ్యే ప్రశ్నే లేదు. నేను ప్రధాని రేసులో లేనని స్పష్టం చేశారు.
గడ్కరీ నాగ్‌పూర్ లోక్‌సభ స్థానం నుండి మూడుసార్లు గెలిచారు. బీజేపీలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయనకు ఆర్ఎస్ఎస్ మద్దతు కూడా ఉంది. గత రెండు పర్యాయాలు మోదీ ప్రభుత్వంలో రోడ్డు రవాణా, రహదారుల శాఖలకు కేంద్ర మంత్రిగా పనిచేసిన ఆయన, పదేళ్లకు పైగా ఈ పదవిలో ఉన్నారు. 2009 నుంచి 2013 వరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగారు.
Also Read: President Attacked : కొమొరోస్ దేశాధ్యక్షుడిపై సైనికుడి హత్యాయత్నం.. అసలేం జరిగింది ?