HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Tpcc Cheif Mahesh Goud React On Teenmar Mallanna Controversy

Mahesh Kumar Goud : శాస్త్రీయంగానే కులగణన సర్వే.. పార్టీలో క్రమశిక్షణ తప్పితే సహించం

Mahesh Kumar Goud : పార్టీలో ఎవరైనా క్రమశిక్షణ ఉల్లంఘిస్తే తగిన చర్యలు ఉంటాయని మహేష్ కుమార్ గౌడ్ హెచ్చరించారు. తీన్మార్ మల్లన్నను ఉద్దేశించి మాట్లాడిన ఆయన, కాంగ్రెస్ పార్టీ అజెండాకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం సహించబోమని స్పష్టం చేశారు.

  • Author : Kavya Krishna Date : 05-02-2025 - 4:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mahesh Kumar Goud
Mahesh Kumar Goud

Mahesh Kumar Goud : తెలంగాణ కాంగ్రెస్‌లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది. పార్టీ విధానాలకు విరుద్ధంగా తరచూ వ్యాఖ్యానించడం, ప్రభుత్వ నిర్ణయాలను విమర్శించడం నేతల్లో, కేడర్‌లో తీవ్ర గందరగోళాన్ని సృష్టిస్తోంది. ముఖ్యంగా, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కులగణన సర్వేను తగులబెట్టిన వ్యవహారం పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్లడంతో ఆయనపై క్రమశిక్షణాత్మక చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేపై తీన్మార్ మల్లన్న తీవ్ర విమర్శలు చేశారు. సర్వేను తగులబెట్టడంతోపాటు, దీనిపై అనేక ఆరోపణలు చేయడంతో కాంగ్రెస్ హైకమాండ్ ఆయన తీరుపై సీరియస్ అయింది. దీనిపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.

బుధవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడిన మహేష్ కుమార్ గౌడ్, కులగణన సర్వేను శాస్త్రీయంగా నిర్వహించినట్లు స్పష్టం చేశారు. ఈ సర్వేలో బీసీల జనాభా 56 శాతానికి పైగా ఉన్నట్లు తేలిందన్నారు. అయితే, బీఆర్ఎస్ నేతలు బీసీ సంఘాలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసం కొన్ని బీసీ సంఘాలు మార్గభ్రష్టమవుతున్నాయని, అలాంటి వలలో పడొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

 
Diabetes: మధుమేహం ఉన్నవారు పాలు తాగవచ్చా.. తాగితే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
 

పార్టీలో ఎవరైనా క్రమశిక్షణ ఉల్లంఘిస్తే తగిన చర్యలు ఉంటాయని మహేష్ కుమార్ గౌడ్ హెచ్చరించారు. తీన్మార్ మల్లన్నను ఉద్దేశించి మాట్లాడిన ఆయన, కాంగ్రెస్ పార్టీ అజెండాకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం సహించబోమని స్పష్టం చేశారు. “ఎవరైనా ఎమ్మెల్సీ అయినా, ఎంపీ అయినా, పార్టీకి కట్టుబడి ఉండాలి. క్రమశిక్షణను పాటించకుంటే చర్యలు తప్పవు. క్రమశిక్షణ కమిటీ దానిపై తగిన నిర్ణయం తీసుకుంటుంది” అని ఆయన పేర్కొన్నారు.

అలాగే, గురువారం కాంగ్రెస్ కుటుంబ సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ మీటింగ్‌లో అన్ని అంశాలను చర్చించి పరిష్కారం కనుగొంటామని తెలిపారు. తెలంగాణలో బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న హక్కులను సాధించిందని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రుల చొరవతో బీసీలకు, ఎస్సీలకు న్యాయం జరిగిందన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలో మొదటిసారి బీసీ కులగణన చేపట్టిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని, ఇది చారిత్రక విజయమని కొనియాడారు. బిహార్ లాంటి రాష్ట్రాల్లో కులగణన చేపట్టినా, అది కార్యరూపం దాల్చలేదని గుర్తుచేశారు.

ప్రతిపక్ష పార్టీలు కులగణనపై విమర్శలు చేయడం మానుకుని, ప్రభుత్వానికి సలహాలు, సూచనలు అందించాలంటూ హితవు పలికారు. “కులగణన ఒక చారిత్రక అవసరం. దీన్ని విమర్శించడం కన్నా, దీని ప్రయోజనాలను అర్థం చేసుకోవడం మంచిది” అని వ్యాఖ్యానించారు. తెలంగాణ కాంగ్రెస్‌లో తీన్మార్ మల్లన్న వ్యవహారం పెద్ద దుమారం రేపుతోంది. పార్టీ విధానాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్న కారణంగా ఆయనపై క్రమశిక్షణాత్మక చర్యలు తప్పవని సంకేతాలు కనిపిస్తున్నాయి. గురువారం జరిగే కాంగ్రెస్ కుటుంబ సమావేశం అనంతరం ఈ వ్యవహారంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Rohit Sharma: ఛాంపియ‌న్స్ ట్రోఫీ త‌ర్వాత రోహిత్ రిటైర్ అవుతాడా? కోహ్లీపై బీసీసీఐ నిర్ణ‌యం ఏంటీ!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BC Reservation
  • caste census
  • congress party
  • Mahesh Kumar Goud
  • Political Controversy
  • revanth reddy
  • Teenmar Mallanna
  • telangana congress
  • telangana politics
  • tpcc

Related News

Green signal for Musi rejuvenation; government approves ₹7,000 crore project.

Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ నగరాల సరసన నిలిపేందుకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టులో కీలక ముందడుగు పడింది. ఈ మెగా ప్రాజెక్టు పరిధిలోని ప్రాధాన్యతా ప్రాంతాల అభివృద్ధి కోసం రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ రూ.7,345.12 కోట్ల భారీ బడ్జెట్‌కు పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ త

  • Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

    ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

  • Even though KTR got entangled in his own challenge, Revanth Reddy gained the upper hand over BRS!

    Cm Revanth Reddy: తన సవాలులో తానే చిక్కుకున్న KTR.. BRS పై పైచేయి సాధించిన రేవంత్ రెడ్డి!

  • Mallareddy says goodbye to BRS

    Malla Reddy: బీఆర్ఎస్‌కు మల్లారెడ్డి గుడ్ బై

  • 20 Years of Revanth Reddy's Political Journey

    Revanth Reddy: రేవంత్‌రెడ్డి రాజకీయ ప్రస్థానానికి 20 ఏళ్లు

Latest News

  • WhatsApp Business Summit : వ్యాపారం కోసం ‘మెటా బిజినెస్ ఏజెంట్’ ఏఐ టూల్ విడుదల!

  • Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

  • Herbalife India : ఫార్ములా 1 షేక్స్‌లో ‘డేట్స్ కారామెల్’ ఫ్లేవర్ విడుదల!

  • Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. రైల్ టికెట్లను స్క్రీన్ షాట్ తీసి చూపించలేరు!

  • PM Modi: న్యూజిలాండ్‌లో తొలిసారి అడుగుపెట్టిన భారత ప్రధాని

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd