Priyanka Gandhi : ఇవాళ తెలంగాణకు ప్రియాంక.. వచ్చేవారం సోనియాగాంధీ రాక
Priyanka Gandhi : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో జోరును మరింత పెంచింది.
- By Pasha Published Date - 08:51 AM, Sun - 19 November 23

Priyanka Gandhi : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో జోరును మరింత పెంచింది. ఈక్రమంలోనే ఇవాళ హస్తం పార్టీ అగ్ర నాయకురాలు ప్రియాంకాగాంధీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఖానాపూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో జరిగే ఎన్నికల ప్రచార సభల్లో ఆమె ప్రసంగిస్తారు. ఈరోజు ఉదయం 9.40 గంటలకు స్పెషల్ ఫ్లైట్ లో ప్రియాంకాగాంధీ ఢిల్లీ నుంచి బయలుదేరి నాందేడ్‌కు చేరుకుంటారు. నాందేడ్ నుంచి హెలికాప్టర్ ద్వారా మధ్నాహ్నం 12 గంటలకు ఖానాపూర్‌కు వస్తారు. మధ్నాహ్నం 1 గంటల వరకు ఖానాపూర్ సభ ముగుస్తుంది. ఆ తర్వాత అక్కడి నుంచి ఆసిఫాబాద్ లో జరిగే సభ కోసం ప్రియాంక బయలుదేరి వెళ్తారు.
We’re now on WhatsApp. Click to Join.
మధ్యాహ్నం 1.30 గంటల నుంచి 2.30 గంటల వరకు ఆసిఫాబాద్‌లో జరిగే సభలో ప్రియాంకాగాంధీ పాల్గొంటారు. సభ ముగిసిన తర్వాత మళ్లీ నాందేడ్ మీదుగా ఢిల్లీకి ప్రియాంక వెళ్లిపోతారు. వచ్చే వారం సోనియాగాంధీ కూడా తెలంగాణలో ప్రచారానికి రానున్నారు. తెలంగాణలో నవంబర్ 28న సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగియనుండగా, నవంబర్ 30న ఓటింగ్ జరుగుతుంది.ఇటీవల కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేశారు.అందులో పలు జనాకర్షక హామీలను ఇచ్చారు.