Telangana: తెలంగాణలో పెట్టుబడులు పెట్టే సంస్థల జాబితా ఇదే!
హైదరాబాద్ లో ఇన్పోసిస్ క్యాంపస్ విస్తరణ. పోచారంలో ఐటీ క్యాంపస్ లో కొత్త సెంటర్. రూ. 750 కోట్ల పెట్టుబడులు, 17,000 ఉద్యోగాలు.
- By Gopichand Published Date - 03:07 PM, Thu - 23 January 25

Telangana: దావోస్‌లో పెట్టుబడుల సమీకరణలో తెలంగాణ (Telangana) సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో ఇప్పటికే రూ.1.32 లక్షల కోట్ల పెట్టుబడులను తెలంగాణ సాధించింది. ఈ పెట్టుబడులతో పాటు రాష్ట్రంలో దాదాపు 46 వేల మంది యువతకు ఉద్యోగాలు లభించనున్నాయి. అయితే ఈరోజు మరికొన్ని ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది. దీంతో లక్షన్నర కోట్లు పెట్టుబడులు దాటనున్నాయి. అలాగే ఉద్యోగాల సంఖ్య కూడా 50 వేలు దాటే అవకాశం ఉంది.
తెలంగాణలో పెట్టుబడులు పెట్టే సంస్థల జాబితా
1. సన్ పెట్రో కెమికల్స్: భారీ పంప్డ్ స్టోరేజీ జల విద్యుత్తు, సోలార్ విద్యుత్తు ప్రాజెక్టుల ఏర్పాటు. నాగర్ కర్నూలు, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో ప్లాంట్లు. 3400 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ హైడ్రో విద్యుత్తు. 5440 మెగావాట్ల సోలార్ విద్యుత్తు ప్లాంట్ల ఏర్పాటు. రూ. 45,500 కోట్ల పెట్టుబడులతో పాటు 7,000 ఉద్యోగాలు.
2. అమెజాన్ వెబ్ సర్వీసెస్: ఏఐ, క్లౌడ్ సర్వీసెస్ డేటా సెంటర్లలో భారీ పెట్టుబడులు. రూ. 60,000 కోట్లు.
3. కంట్రోల్ ఎస్: తెలంగాణలో అత్యాధునిక AI డేటాసెంటర్ క్లస్టర్. 400 మెగా వాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్. రూ. 10,000 కోట్ల పెట్టుబడులతోపాటు 3,600 మందికి ఉపాధి.
Also Read: Top 10 Non Veg States : నాన్ వెజ్ వినియోగంలో తెలుగు స్టేట్స్ ఎక్కడ ? టాప్- 10 రాష్ట్రాలివే
4. జేఎస్ డబ్ల్యూ సంస్థ: రాష్ట్రంలో మానవ రహిత ఏరియల్ సిస్టమ్స్ తయారీ యూనిట్ – రక్షణ రంగంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు తెలంగాణ అభివృద్ధిలో ఈ ప్రాజెక్టు క్రియాశీలంగా మారనుంది. రూ.800 కోట్ల పెట్టుబడులతో పాటు 200 ఉద్యోగాలు.
5. స్కైరూట్ ఏరో స్పేస్: తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ ప్రైవేట్ రాకెట్ తయారీ, ఇంటిగ్రేషన్, టెస్టింగ్ యూనిట్ ఏర్పాటు. రూ.500 కోట్ల పెట్టుబడులు
6. మేఘా ఇంజనీరింగ్: మూడు కీలక ఒప్పందాలు. రాష్ట్రంలో 2160 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ఇంధన ఉత్పత్తి ప్రాజెక్ట్. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్ ప్రాజెక్టు. అనంతగిరిలో వరల్డ్ క్లాస్ లగ్జరీ వెల్నెస్ రిసార్ట్. రూ.15000 కోట్ల పెట్టుబడులు, 5250 మందికి ఉపాధి.
7. హెచ్సీఎల్ టెక్ సెంటర్: హైటెక్ సిటీలో3.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హెచ్సీఎల్ కొత్త క్యాంపస్. 5000 మందికి ఉపాధి.
8. విప్రో: హైదరాబాద్ లో విప్రో కంపెనీ విస్తరణ. గోపనపల్లి క్యాంపస్ లో కొత్త ఐటీ సెంటర్. 5,000 మందికి ఉద్యోగాలు.
9. ఇన్ఫోసిస్: హైదరాబాద్ లో ఇన్పోసిస్ క్యాంపస్ విస్తరణ. పోచారంలో ఐటీ క్యాంపస్ లో కొత్త సెంటర్. రూ. 750 కోట్ల పెట్టుబడులు, 17,000 ఉద్యోగాలు.
10. యూనిలివర్ కంపెనీ: కామారెడ్డి జిల్లాలో పామాయిల్ ఫ్యాక్టరీ, రిఫైనింగ్ యూనిట్. రాష్ట్రంలో బాటిల్ క్యాప్‌లను ఉత్పత్తి చేసే కొత్త తయారీ యూనిట్ ఏర్పాటు. దాదాపు 1000 ఉద్యోగాలు.