Urea : యూరియా అడిగినందుకు గిరిజన యువకుడిపై థర్డ్ డిగ్రీ – హరీశ్ రావు
Urea : ప్రజాస్వామ్య పాలనలో ఇలాంటి దౌర్జన్యాలు అసహ్యకరమని ఆయన విమర్శించారు. “థర్డ్ డిగ్రీ ప్రయోగించడమేనా ఇందిరమ్మ రాజ్యం?” అంటూ ప్రశ్నించిన హరీశ్ రావు
- By Sudheer Published Date - 09:00 PM, Wed - 24 September 25

నల్గొండ జిల్లాలో చోటుచేసుకున్న సంఘటన తెలంగాణ రాజకీయ వాతావరణాన్ని కుదిపేసింది. యూరియా(Urea ) కోసం ధర్నా చేసిన గిరిజన యువకుడిపై పోలీసులు అమానుషంగా వ్యవహరించారన్న ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. గిరిజన యువకుడిని కులం పేరుతో దూషిస్తూ పోలీస్‌స్టేషన్‌కు లాక్కెళ్లి, కాళ్లు కట్టి లాఠీలతో కొట్టారని తెలుస్తుంది. ఈ ఘటనతో బాధితుడు నడవలేని స్థితికి చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. రైతులు, గిరిజన సంఘాలు ఈ సంఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి.
ఈ ఘటనపై మాజీ మంత్రి హరీశ్ రావు (Harishrao) తీవ్రంగా మండిపడ్డారు. ప్రజాస్వామ్య పాలనలో ఇలాంటి దౌర్జన్యాలు అసహ్యకరమని ఆయన విమర్శించారు. “థర్డ్ డిగ్రీ ప్రయోగించడమేనా ఇందిరమ్మ రాజ్యం?” అంటూ ప్రశ్నించిన హరీశ్ రావు, ఒక సాధారణ రైతు సమస్య కోసం గొంతెత్తిన యువకుడిని ఇలా అమానుషంగా ప్రవర్తించడం ప్రభుత్వ దౌర్జన్యానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. న్యాయం కోసం పోరాడిన యువకుడి భవిష్యత్తును ప్రభుత్వం నాశనం చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Celebrities: 40 ఏళ్ల వయసులో గర్భం దాల్చిన సెలబ్రిటీలు వీరే!
హరీశ్ రావు స్పష్టంగా డిమాండ్ చేస్తూ, ఆ బాధ్యులైన పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఒకవైపు ప్రజలు ఎరువులు, విత్తనాల కోసం ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు ఆ వేదనను బయటపెట్టిన వారిపై దౌర్జన్యం చేయడం ప్రజాస్వామ్యానికి మచ్చ అని అన్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని బాధిత యువకుడికి న్యాయం చేయకపోతే ఈ సమస్య మరింత ముదురుతుందని హెచ్చరించారు. ఈ సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారి, పోలీసు వ్యవస్థలోని బాధ్యతారాహిత్యాన్ని బహిర్గతం చేసింది.
ప్రజా పాలన పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం సాగిస్తున్న దమనకాండకు నల్గొండ జిల్లాలో జరిగిన ఘటన మరో నిదర్శనం.
యూరియా కావాలంటూ ధర్నాలో పాల్గొనడమే ఈ గిరిజన యువకుడు చేసిన పాపమా?
కులం పేరుతో దూషిస్తూ పోలీసు స్టేషన్ కు లాక్కెళ్లి, కాళ్లు కట్టేసి లాఠీలతో బాదడమేనా.. ప్రజాస్వామ్యం?
యూరియా… pic.twitter.com/VM4VvcK8Pc
— Harish Rao Thanneeru (@BRSHarish) September 24, 2025