Padma Awards : పద్మభూషణ్ అందుకున్న తెలుగువారు వీరే..
తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డ్స్ 2025లో ఆయనకు చోటు దక్కింది. దీంతో బాలయ్య పద్మ భూషణుడిగా మారారు.
- By Latha Suma Published Date - 10:00 PM, Sat - 25 January 25

Padma Awards : నటసింహం బాలయ్యకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారం ప్రకటించింది. కళల విభాగంలో నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికయ్యారు. కథానాయకుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు చేసిన సేవకు గాను, అదేవిధంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా ఎంతో మందికి చికిత్స అందిస్తున్నందుకు గాను, ఏపీలోని హిందూపూర్ శాసన సభ్యుడిగా మంచి పనులు చేస్తున్నందుకు గాను ఆయనను పద్మ భూషణ్ పురస్కారంతో సత్కరించినట్టు తెలిసింది. దీంతో తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డ్స్ 2025లో ఆయనకు చోటు దక్కింది. దీంతో బాలయ్య పద్మ భూషణుడిగా మారారు.
ఈ సారి రిపబ్లిక్ డేని పురస్కరించుకుని ప్రకటించిన పద్మ అవార్డులలో బాలయ్య పేరు ఉండటంతో నందమూరి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సోషల్ మీడియాలో బాలయ్యకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, బాలయ్య సినీ, రాజకీయ, సేవా రంగాల్లో చేస్తోన్న సేవలను గుర్తిస్తూ 2025 సంవత్సరానికిగానూ బాలయ్యను ఏపీ ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారానికి నామినేట్ చేసింది. వాస్తవానికి ఆయనకి ఈ అవార్డు ఎప్పుడో రావాల్సి ఉండగా.. చాలా ఆలస్యమైందని నందమూరి అభిమానులు భావిస్తున్నారు.
మరోవైపు ఆసియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఏఐజీ ఆస్పత్రి అధినేత డాక్టర్ దువ్వూరి నాగేశ్వర్ రెడ్డికి పద్మవిభూషణ్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వైద్యరంగంలో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును ప్రకటించారు. దేశంలో రెండో అత్యున్నత పౌరపురస్కారం పద్మ విభూషణ్.
ఇక, తెలుగు రాష్ట్రాలకు చెందిన మంద కృష్ణ మాదిగ, మాడుగుల నాగఫణి శర్మలకు పద్మశ్రీ ప్రకటించారు. మాదిగ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం మందకృష్ణ పోరాడు. మాడుగుల నాగఫణి శర్మ పండితునిగా గుర్తింపు పొందారు. కేఎల్ కృష్ణ, విద్యా, సాహిత్యం విభాగాల్లో పద్మశ్రీ పొందారు. మాడుగుల నాగఫణి శర్మ, కళా రంగం నుంచి.. మంద కృష్ణ మాదిగ, ప్రజా వ్యవహారాలు విభాగంలో.. మిరియాల అప్పారావు, కళారంగంలో.. వి రాఘవేంద్రాచార్య పంచముఖి, సాహిత్యం, విద్య విభాగంలో పద్మశ్రీ అవార్డులు పొందారు. అలాగే, కేజీఎఫ్ నటుడు ఆనంత్‌నాగ్, ప్రముఖ తమిళ హీరో అజిత్‌కుమార్, ప్రముఖ సినీ నటి, నృత్యకళాకారిణి శోభనకు పద్మభూషణ్ అవార్డులను కేంద్రం ప్రకటించింది. కాగా, కేంద్రం ప్రకటించిన పద్మ అవార్డులలో తెలుగు రాష్ట్రాలకు మొత్తం 7 పద్మ అవార్డులు వచ్చాయి. అందులో పద్మ విభూషణ్ 1, పద్మభూషణ్ 1 అలాగే 5 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి.