HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Telangana
  • >These Are The Highlights Of Kcrs Speech In Warangal Sabha

KCR Speech Highlights: నేను కొడితే మామూలుగా ఉండదు.. వ‌రంగ‌ల్ స‌భ‌లో కేసీఆర్ స్పీచ్ హైలైట్స్ ఇవే!

కేసీఆర్ తన ప్రసంగంలో బీఆర్‌ఎస్ హయాంలో అమలైన రైతు బంధు, రైతు బీమా, ఆసరా పెన్షన్లు, దళిత బంధు వంటి పథకాలను గుర్తు చేశారు.

  • By Gopichand Published Date - 08:20 PM, Sun - 27 April 25
  • daily-hunt
KCR Speech Highlights
KCR Speech Highlights

KCR Speech Highlights: హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభలో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు (KCR Speech Highlights) చేశారు. కన్నతల్లిని, జన్మభూమిని మించిన స్వర్గం లేదని అన్నారు. ఎల్కతుర్తిలో నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ.. స్వరాష్ట్రం కోసం తాను 25 ఏళ్ల క్రితం పోరాటం మొదలు పెట్టానని అన్నారు. అప్పుడు పుట్టిందే గులాబీ పార్టీ అని పేర్కొన్నారు. అయితే మొదట్లో గులాబీ జెండాను ఎంతోమంది అవమానపరిచారని పేర్కొన్నారు.

ఆప‌రేష‌న్ క‌గార్‌పై స్పంద‌న‌

నక్సలైట్ల అణచివేతపై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టులను ఊచకోత కోయడం తగదని కేంద్ర ప్రభుత్వానికి హితవు పలికారు. వారిని మారడానికి అవకాశం ఇవ్వాలని తెలిపారు. మావోలను అంతమొందించడానికి ప్రారంభించిన ‘ఆపరేషన్ కగార్’‌ను వెంటనే నిలిపివేయాలని కోరారు. దీనిపై బీఆర్ఎస్ తరపు నుంచి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తానని పేర్కొన్నారు. దీని కోసం కార్య‌క‌ర్త‌ల ఆమోదం తీసుకున్నారు.

HCU వివాదంపై మొదటిసారి స్పందించిన కేసీఆర్

ఇక‌పోతే దేశ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం సృష్టించిన హెచ్‌సీయూ వివాదంపై కేసీఆర్ ఈ స‌భ వేదిక‌గా స్పందించారు. అత్యవసరం అయితే, ప్రభుత్వం భూములు అమ్ముకోవ‌చ్చ‌ని అన్నారు. ప్రజలకు అవసరం లేని భూములు అమ్మొచ్చని తెలిపారు. అయితే యూనివ‌ర్శిటీల జోలికి పోవ‌ద్ద‌ని కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రించారు. ఇవాళ హెచ్‌సీయూ భూములు అమ్ముతారు.. రేపు ఓయూ భూములు కూడా అమ్ముతారా? అని ఫైర్ అయ్యారు.

Also Read: KCR Comments: నన్ను రాళ్లతో కొట్టి చంపమని చెప్పా.. రజతోత్సవ సభలో కేసీఆర్

అన్యాయాన్ని, అక్రమాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న
బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ పై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్న పోలీసులకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హెచ్చరిక 🔥

రాసి పెట్టుకోండి..
మళ్లీ వచ్చేది బీఆర్ఏస్సే..
ఎవ్వడు ఆపలేడు.. ఎవ్వరి తరం కాదు.#25YearsOfBRS#BRSat25 pic.twitter.com/Zg5AcLKNRB

— BRS Party (@BRSparty) April 27, 2025

నిజమైన రైతుబంధు కేసీఆర్

బీఆర్‌ఎస్ రజతోత్సవ సభలో మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ఉద్వేగభరితమైన ప్రసంగం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన, అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ఆయన తన ప్రసంగంలో ప్రధానంగా దృష్టి సారించారు. కేసీఆర్ తన ప్రభుత్వ హయాంలో తెలంగాణను “దగదగలాడించిన” విధానాన్ని గుర్తు చేశారు. గ‌త పదేండ్లలో రాష్ట్రాన్ని అందరూ ఆశ్చర్యపోయేలా నిర్మించాం అని పేర్కొన్నారు.

ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రజలను మోసం చేస్తున్నారని, హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని ఆరోపించారు. “అన్ని వర్గాలను కాంగ్రెస్ మోసం చేసింది” అని జహీరాబాద్ సమావేశంలో చేసిన వ్యాఖ్యలను పునరుద్ఘాటించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కమిషన్ నివేదికల పేరుతో లీకులు చేస్తూ బీఆర్‌ఎస్‌ను దెబ్బతీసే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు.

చీమల దండులా… బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభా ప్రాంగణం.

బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభా ప్రాంగణం జనసంద్రంగా మారింది. ఇసుకేస్తే రాలనంతగా జనసమూహం తరలివచ్చారు. చీమల దండులా తలపిస్తున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభా ప్రాంగణం.#25YearsofBRS #BRSat25 pic.twitter.com/2e25TAvaaq

— BRS Party (@BRSparty) April 27, 2025

కేసీఆర్ తన ప్రసంగంలో బీఆర్‌ఎస్ హయాంలో అమలైన రైతు బంధు, రైతు బీమా, ఆసరా పెన్షన్లు, దళిత బంధు వంటి పథకాలను గుర్తు చేశారు. “నిజమైన రైతుబంధు కేసీఆర్” అని, రూ.80 వేల కోట్లు రైతులకు అందించిన ఘనత తమదేనని చెప్పారు. ఈ సభలో కేసీఆర్ బీఆర్‌ఎస్ క్యాడర్‌ను ఉత్సాహపరిచారు. తెలంగాణ శక్తిని చూపించి కాంగ్రెస్‌ను ఎదుర్కొనాలని పిలుపునిచ్చారు. “నేను కొడితే మామూలుగా ఉండదు” అని హెచ్చరించారు. ఈ ప్రసంగం రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్‌ఎస్ దూకుడును సూచిస్తూ, ప్రజల్లో ఉత్సాహం నింపేలా ఉందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BRS Silver Jubilee
  • Congress Criticism
  • Farmers' Welfare
  • Former CM
  • kaleshwaram project
  • KCR Speech
  • Political Rally
  • rythu bandhu
  • telangana development
  • Warangal Meeting

Related News

Harish Rao

Harish Rao: లండ‌న్‌లో జ‌రిగిన మీట్ అండ్ గ్రీట్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న హ‌రీష్ రావు!

హరీష్ రావు మాట్లాడుతూ.. 2012-13లో మొదటిసారి లండన్ వచ్చినప్పుడు అనిల్ కుర్మాచలం మొదటి ఎన్నారై సమావేశాన్ని ఏర్పాటు చేశారని గుర్తు చేసుకున్నారు. ఎ

  • That's why I resigned from BRS.. Kadiam Srihari's key comments

    Kadiyam Srihari : అందుకే బీఆర్ఎస్‌కి రాజీనామా చేశా..కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు

  • KCR values ​​the party more than his family.. Mallareddy's response to Kavitha's suspension

    Malla Reddy : కేసీఆర్‌కు కుటుంబం కన్నా పార్టీ మిన్న.. కవిత సస్పెన్షన్‌పై మల్లారెడ్డి స్పందన

  • High Court says no stay on Ghosh Commission report on Kaleshwaram irregularities

    Telangana : కాళేశ్వరం అవకతవకలపై ఘోష్ కమిషన్ నివేదికకు స్టే లేదన్న హైకోర్టు

  • Kavitha

    Kavitha : కవిత సంచలన వ్యాఖ్యలు..నాపై దుష్ప్రచారం, బీసీల కోసం పోరాడినందుకే సస్పెండ్..!

Latest News

  • Gautam Gambhir: టీమిండియాలో జోష్ నింపిన గౌతం గంభీర్‌.. ఏం చేశారంటే?

  • Bullet 350: జీఎస్‌టీ రేట్లలో మార్పులు.. ఈ బైక్‌పై భారీగా త‌గ్గుద‌ల‌!

  • GST Reforms Impact: హోట‌ల్స్ రూమ్స్‌లో ఉండేవారికి గుడ్ న్యూస్‌!

  • PM Modi: మ‌రో దేశ అధ్యక్షుడితో ప్ర‌ధాని మోదీ చ‌ర్చ‌లు.. ఎందుకంటే?

  • Team India Jersey: టీమిండియా న్యూ జెర్సీ చూశారా? స్పాన్సర్‌షిప్ లేకుండానే బ‌రిలోకి!

Trending News

    • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd