HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >These Are The Highlights Of Cm Revanth Peddapallys Speech Satires On Kcr

CM Revanth Highlights: సీఎం రేవంత్ పెద్ద‌ప‌ల్లి స్పీచ్ హైలైట్స్ ఇవే.. కేసీఆర్‌పై సెటైర్లు!

తమ పాలనలో ప్రజలు తమ బాధలను చెప్పుకోగలుగుతున్నారని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. పెద్దపల్లిలో మాట్లాడుతూ.. పదేళ్లలో బీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఏం చేయకపోగా.. తమపై విషప్రచారం చేస్తోందన్నారు.

  • Author : Gopi Date : 04-12-2024 - 8:20 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
CM Revanth Highlights
CM Revanth Highlights

CM Revanth Highlights: పెద్దపల్లి యువ వికాసం సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Highlights) గ్రూప్-4 స్థాయి ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు మంత్రులతో కలిసి నియామకపత్రాలు అందజేశారు. అంతేకాకుండా వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రూప్-4లో ఎంపికైన 8,084 మందికి యువ వికాసం వేదికపై నియామక పత్రాలు అందించడం సంతోషంగా ఉందని తెలిపారు. పెద్దపల్లి రైతుల కోసం కొట్లాడితే ఆనాడు కాంగ్రెస్‌ నాయకులను కేసీఆర్ జైల్లో పెట్టారని సీఎం రేవంత్ గుర్తుచేశారు. ఆనాడు ఏ ప్రాజెక్టుల కోసం కొట్లాడామో.. ఆ ప్రాజెక్టులు పూర్తి చేసుకునే అవకాశం ఈరోజు వచ్చిందన్నారు.

సామాన్యుడిని సీఎంగా చేసింది మీరే: సీఎం రేవంత్‌

సామాన్య కుటుంబం నుంచి వచ్చిన తాను సీఎం అవ్వడానికి కారణం రాష్ట్ర ప్రజలేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి సభలో మాట్లాడుతూ.. కరీంనగర్ గడ్డ మీదే కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ప్రత్యేక తెలంగాణ గురించి మాట ఇచ్చారని తెలిపారు. ఉద్యోగాలు, ప్రాంత అభివృద్ధి కోసమే రాష్ట్రాన్ని తెచ్చుకున్నామని చెప్పారు. రాష్ట్ర సాధనలో విద్యార్థులే ముఖ్య భూమిక పోషించారని పేర్కొన్నారు.

కేసీఆర్‌పై సీఎం రేవంత్ సెటైర్లు

కేసీఆర్ నేతృత్వంలోని గ‌త బీఆర్ఎస్ ప్రభుత్వం మద్దతు ధర ఇవ్వకుండా రైతాంగాన్ని మోసం చేసిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. పెద్దపల్లి సభలో మాట్లాడుతూ.. రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే కేసీఆర్‌కు మాత్రం ఎకరాకు రూ.కోటి పంట పడిందని చెప్పార‌ని విమర్శించారు. ఎకరాకు రూ.కోటి ఆదాయం రావడం ఇప్పటికీ బ్రహ్మపదార్థమేనని సెటైర్లు వేశారు. ఆ కిటుకు ఏంటో ఆయన చెప్పలేదని ఎద్దేవా చేశారు.

బీజేపీకి రేవంత్ సవాల్

తమ పాలనలో ప్రజలు తమ బాధలను చెప్పుకోగలుగుతున్నారని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. పెద్దపల్లిలో మాట్లాడుతూ.. పదేళ్లలో బీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఏం చేయకపోగా.. తమపై విషప్రచారం చేస్తోందన్నారు. తాము ఏడాదిలోనే తర్వాత 55,143 ఉద్యోగాలు ఇచ్చినట్లు తెలిపారు. మోదీ సీఎంగా ఉన్న సమయంలో గుజరాత్‌లో ఇన్ని ఉద్యోగాలు ఏ ఏడాదిలోనైనా ఇచ్చారా అని బీజేపీ నేతలను ప్రశ్నించారు. దీనిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు.

Also Read: Yuva Vikasam Meeting : పెళ్లి అయిన వెంటనే పిల్లలు పుడతారా? : బిఆర్ఎస్ పై సీఎం రేవంత్ సెటైర్

నియామకపత్రాలు ఎందుకు ఇవ్వలేదు: సీఎం

పేదవాడికి ఉద్యోగం, ఉపాధి దొరికితే అతని భవిష్యత్తు తరాలు బాగుపడతాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పెద్దపల్లిలో మాట్లాడుతూ.. అయినా పరీక్షలు జరగకుండా కొందరు దొంగ నిరసనలు చేయించారని ఆరోపించారు. తామే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చామని బీఆర్‌ఎస్ నేతలు అంటున్నారని చెప్పారు. ఎంపీగా ఓడిపోయిన కవిత మూడు నెలల్లోనే ఎమ్మెల్సీ అయ్యారని, అలాంటిది నోటిషికేషన్లు ఇచ్చినవారు పదేళ్లుగా నియామకపత్రాలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.

56 వేల ఉద్యోగాలు ఇచ్చాం: డిప్యూటీ సీఎం భట్టి

ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసమని, గత బీఆర్ఎస్ పాలనలో ఎవరికీ ఉద్యోగాలు రాలేదని విమర్శించారు డిప్యూటీ సీఎం భ‌ట్టి. పెద్దపల్లి సభలో ఆయ‌న‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 11 నెలల్లోనే 56 వేల ఉద్యోగాలు ఇచ్చిందని తెలిపారు. యువతకు ఉపాధి పెంచేందుకు స్కిల్ యూనివర్సిటీ తీసుకొచ్చినట్లు వివరించారు. సింగరేణి కార్మికులకు రూ.1 కోటీ ప్రమాద బీమా చేశామని పేర్కొన్నారు.

రూ.వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి: మంత్రి ఉత్తమ్

సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత రాష్ట్రానికి రూ.వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు పెరిగాయని చెప్పారు. పెద్దపల్లి ప్రజా విజయోత్సవాల్లో మాట్లాడుతూ.. యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. సన్నాలు వేసిన రైతులకు రూ.500 బోనస్ ఇస్తున్నట్లు తెలిపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Revanth Reddy
  • Deputy CM Bhatti
  • Minister Uttam Kumar Reddy
  • Peddapalli
  • telangana
  • telangana news
  • telugu news
  • Yuvasakthi Sabha

Related News

Massive arrangements for the Farmers' Blessing Meeting

Rythu Ashirvada Sabha: రైతు ఆశీర్వాద సభకు భారీ ఏర్పాట్లు

జిల్లా పరిధిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ‘రైతు ఆశీర్వాద సభ’కు జిల్లా యంత్రాంగం అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేసింది. సభకు హాజరయ్యే రైతులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వేదిక నిర్మాణం, తాగునీరు, నీడ వంటి మౌలిక వసతులను అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు. భారీ ఎత్తున జనం తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో, సభా ప్రాంగణం వద్ద మరియు పరిసర ప్రాంతాలలో ఎలాం

  • Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

    ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

  • Telangana government takes a serious view of irregularities in the Dharani portal.

    Dharani: ధరణి పోర్టల్ అక్రమాల పై తెలంగాణ సర్కార్ సీరియస్

  • Good news for Singareni workers: Union Minister Kishan Reddy

    Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • National Status... Palampet Shiva Temple, Mulugu District

    Palampet Shivalaya Temple: జాతీయ హోదా.. ములుగు జిల్లా పాలంపేట శివాలయం

Latest News

  • WhatsApp Business Summit : వ్యాపారం కోసం ‘మెటా బిజినెస్ ఏజెంట్’ ఏఐ టూల్ విడుదల!

  • Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

  • Herbalife India : ఫార్ములా 1 షేక్స్‌లో ‘డేట్స్ కారామెల్’ ఫ్లేవర్ విడుదల!

  • Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. రైల్ టికెట్లను స్క్రీన్ షాట్ తీసి చూపించలేరు!

  • PM Modi: న్యూజిలాండ్‌లో తొలిసారి అడుగుపెట్టిన భారత ప్రధాని

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd