Hitchhiking : రెచ్చిపోతున్న కిలేడీలు.. లిఫ్ట్ ఇస్తే అంతే సంగతి !!
హైదరాబాద్ నగరం పరిధిలోని ప్రధాన బస్‌స్టేషన్లు, రైల్వే, మెట్రోస్టేషన్లను కిలేడీలు(Hitchhiking) తమ అడ్డాగా చేసుకుంటున్నారు.
- By Pasha Published Date - 09:56 AM, Fri - 16 May 25

Hitchhiking : ‘హిచ్ హైకింగ్’ అంటే రోడ్డు పక్కన నిలబడి ఇతరుల వాహనాల్లో లిఫ్ట్ అడిగి వెళ్లడం. మన హైదరాబాద్ మహానగరంలో రోజూ చాలామంది హిచ్ హైకర్లు కనిపిస్తుంటారు. వారిలో పురుషులతో పాటు మహిళలు కూడా ఉంటారు. ఈ మధ్య కాలంలో సిటీ పరిధిలో కొందరు మహిళా హిచ్ హైకర్లు ద్విచక్ర వాహనదారులను లిఫ్ట్ అడిగి నానా యాగీ చేశారట. దీని గురించి ఇంట్లో, పోలీసు స్టేషనులో చెప్పుకుంటే పరువు పోతుందని చాలామంది బాధితులు సైలెంటుగా ఉండిపోతున్నారట. అలా సైలెన్సుగా ఉండాల్సిన అవసరం లేదని, బాధితులు తమకు సమాచారమిస్తే వారి వివరాలను సీక్రెట్‌గా ఉంచుతామని హైదరాబాద్ సిటీ పోలీసులు చెబుతున్నారు. దీనిపై ఓ లుక్..
Also Read :Musi Riverfront : ‘మూసీ రివర్ ఫ్రంట్’కు అప్పుల బాటలో అడ్డంకులు.. కేంద్రం కొర్రీలు
అసలేం జరుగుతోంది ?
- హైదరాబాద్ నగరం పరిధిలోని ప్రధాన బస్‌స్టేషన్లు, రైల్వే, మెట్రోస్టేషన్లను కిలేడీలు(Hitchhiking) తమ అడ్డాగా చేసుకుంటున్నారు. ఏదో దూర ప్రాంతం నుంచి అక్కడికి వచ్చినట్టుగా.. పెద్ద బ్యాగు పట్టుకొని నిలబడుతున్నారు.
- ఆ ఏరియా నుంచి బైక్‌పై వెళ్లే వారిని లిఫ్ట్ అడుగుతున్నారు.
- వారు లిఫ్ట్ ఇచ్చాక.. బైక్‌పై కూర్చొని మాట్లాడటం మొదలుపెడుతున్నారు.
- ద్విచక్ర వాహనదారుడిని మాటల్లో పెట్టి.. వివరాలన్నీ రాబడుతున్నారు. ఈక్రమంలో ప్యాంటు జేబుల నుంచి పర్సులు, సెల్‌ఫోన్లు కొట్టేస్తున్నారు.
- దీన్ని ఒకవేళ ద్విచక్ర వాహనదారుడు గుర్తించి గట్టిగా ప్రశ్నిస్తే.. తనను చేయి పట్టుకొని వేధిస్తున్నాడంటూ అరుస్తున్నారు. ఇందుకు బెదిరిపోయి కొందరు ద్విచక్ర వాహనదారులు సైలెంటుగా వెళ్లిపోతున్నారు.
- నగరంలోని మలక్‌పేట్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, జేబీఎస్, బోయినపల్లి ఏరియాల్లో ఈ తరహా ఘటనలు జరిగినట్లు తెలిసింది.ఈ తరహా మోసాలకు పాల్పడ్డ కిలేడీలను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అయితే అలాంటి వాళ్లు రిలీజ్ కాగానే తమ పనిని మొదలుపెడుతున్నట్లు సమాచారం.
- ఈజీ మనీని సంపాదించడం కోసమే కిలేడీలు ఇలాంటి వ్యవహారాలకు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో పోలీసులు గుర్తించారు.
- ఈ తరహా కేసుల విచారణలో హైదరాబాద్ నగరంలోని బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్ల వద్దనున్న సీసీ కెమెరాల ఫుటేజీ కీలకంగా మారుతోంది.