HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >The Condition Of Osmania Hospital Is Alarming In Hyderabad Tamilisai

Tamilisai Vs Harish Rao: ఉస్మానియా ఆస్పత్రిపై తమిళిసై ట్వీట్, హరీశ్ రావు కౌంటర్!

తెలంగాణ గవర్నర్ తమిళిసై అధికార పార్టీ బీఆర్ఎస్ పార్టీ లోపాలపై స్వారీ చేస్తూ సమస్యలను పరిష్కరించాలని నిలదీస్తున్నారు.

  • Author : Hashtag U Date : 28-06-2023 - 3:09 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
governor harish rao
governor harish rao

తెలంగాణ గవర్నర్ తమిళిసై అధికార పార్టీ బీఆర్ఎస్ పార్టీ లోపాలపై స్వారీ చేస్తూ సమస్యలను పరిష్కరించాలని నిలదీస్తున్నారు. వివిధ సమస్యలపై గవర్నర్ హోదాలో స్పందిస్తూ అధికార పార్టీని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే పలు సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన తమిళిసై తాజాగా ఉస్మానియా ఆస్పత్రిలోని సమస్యలు, వైద్య సదుపాయాలు గురించి మాట్లాడారు.

ఉస్మానియా ఆస్పత్రి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలంగాణ గవర్నర్ తమిళిసై అన్నారు. ఎంతో గొప్ప చరిత్ర గల ఉస్మానియా ఆస్పత్రిని వెంటనే పునరుద్దరించాలని కోరారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఓ నెటిజన్ ట్వీట్‌కు రిప్లై ఇచ్చారు. వివరాలు.. ‘‘జస్టిస్ ఫర్ ఓజీహెచ్’’ పేరుతో ఉన్న ట్విట్టర్ అకౌంట్‌లో ఉస్మానియా ఆస్పత్రికి సంబంధించి గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలుపుకోవాలని కోరుతూ పోస్టు చేశారు. ‘‘ఉస్మానియా జనరల్ ఆస్పత్రి పునర్నిర్మాణం గురించి గతంలో చేసిన హామీలను మరోసారి గుర్తించి చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వానికి వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాము’’ అని ఆ పోస్టులో పేర్కొన్నారు. జాయింట్ అసోషియేషన్ ఫర్ న్యూ ఓజీహెచ్ పేరుతో కూడిన లేఖను కూడా షేర్ చేశారు.

ఈ పోస్టులో తెలంగాణ సీఎంవో, గవర్నర్ తమిళిసై, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు అకౌంట్‌‌లను ట్యాగ్ చేశారు. అయితే ఈ పోస్టుపై స్పందించిన గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్.. ఉస్మానియా ఆస్పత్రి పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. శతాబ్దాల నాటి ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా జనరల్ హాస్పిటల్ దుస్థితిని చూసి ఆందోళన చెందుతున్నానని పేర్కొన్నారు. శిక్షణ, వైద్యానికి ఎంతో గర్వకారణమైన ఉస్మానియా ఆస్పత్రి నూతన భవన నిర్మాణాన్ని త్వరగా చేపట్టాలని కోరారు.

వైద్య రంగంలో ఎంతో అభివృద్ధి కనిపిస్తుంటే.. గవర్నర్ ఎందుకు అభినందించరంటూ గవర్నర్ తమిళిసై మంత్రి హరీష్‌రావు ఫైర్ అయ్యారు. ఉస్మానియా ఆస్పత్రిపై గవర్నర్ తమిళిసై చేసిన ట్వీట్ పై స్పందించిన మంత్రి హరీష్ రావు.. అభివృద్ధి కనిపించడం లేదా..? అంటూ ప్రశ్నించారు. ఉస్మానియా ఆస్పత్రి పై గవర్నర్ వ్యాఖ్యలు దురదృష్టకరమని, మెరుగైన ఆరోగ్య తెలంగాణ కోసం ఆరోగ్యశాఖ పని చేస్తోందంటూ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.

Also Read: Asin Reaction: డివోర్స్ రూమర్స్ పై నటి ఆసిన్ రియాక్షన్ ఇదే!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • governor tamilisai
  • harish rao
  • hyderabad
  • Osmania University

Related News

Software employee Ishika Yadav

ప్రేమించి పెళ్లి చేసుకున్న నెల రోజులకే సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య

 Ishika Yadav  హైదరాబాద్‌లో మరో టెకీ ఆత్మహత్యకు పాల్పడింది. 5 ఏళ్లుగా ప్రేమించుకుని ఇటీవలనే పెళ్లి చేసుకోగా, 50 రోజుల్లోనే ఆ యువతి బలవన్మరణానికి పాల్పడటం తీవ్ర విషాదాన్ని నింపింది. ఇద్దరి రాష్ట్రాలు వేరైనా ప్రేమ విషయం ఇళ్లల్లో చెప్పి కుటుంబ సభ్యులను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు. అంతా సాఫీగా సాగిపోతుంది అనుకున్న తరుణంలో ఊహించని విషాదం నెలకొంది. భర్త వేధింపులతోనే ఆమె ఆత్మహ

  • Gas Uttam

    LPG Gas Shortage : తెలంగాణలో ఆటో గ్యాస్ సంక్షోభం.. కేంద్రానికి మంత్రి ఉత్తమ్ లేఖ

  • Pawan Cbn Hyd

    Hyderabad : సైబరాబాద్ అనేది చంద్రబాబు విజన్ కు ప్రతిరూపం – పవన్

  • Asbl Sriramanavami

    Sriramanavami : ఏఎస్‌బిఎల్ ఆధ్వర్యంలో వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం

  • Omkareshwara Temple

    Revanth Reddy: రూ.700 కోట్లతో ఓంకారేశ్వర ఆలయం..శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి..

Latest News

  • ఐపీఎల్‌లో అరుదైన ఘ‌న‌త సాధించిన ర‌హానే!

  • భార‌త మార్కెట్లోకి కొత్త ఎల‌క్ట్రిక్ కారు.. ధ‌ర ఎంతంటే?

  • మీ ఫోన్ స్లో అవుతుందా? అయితే ఈ యాప్స్ తీసేయండి!

  • శాశ్వత ప్రజా రాజధానిగా అమరావతి!

  • వాట్సాప్‌లో మ‌రో స‌రికొత్త ఫీచ‌ర్!

Trending News

    • హైద‌రాబాద్‌తో కోల్‌క‌తా మ్యాచ్‌.. కేకేఆర్‌కు హోం గ్రౌండ్ క‌లిసొస్తుందా?

    • Amaravathi Capital: అమరావతి రాజధాని బిల్లుకు రాజ్యసభ ఆమోదం

    • శ్రేయ‌స్ అయ్య‌ర్‌కు గాయం.. సీఎస్కేతో మ్యాచ్‌కు దూరం?!

    • Condom Shortage: భారీగా పెరగనున్న కండోమ్ ధరలు

    • అల‌ర్ట్‌.. నేటి నుంచి కీల‌క మార్పులు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd