HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >The Chicken Curry That Took The Life Of The Father

Chicken Curry: తండ్రి ప్రాణం తీసిన నాటుకోడి కూర

  • Author : Vamsi Chowdary Korata Date : 11-06-2026 - 4:57 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
The chicken curry that took the life of the father
The chicken curry that took the life of the father

కొన్ని చిన్న చిన్న విషయాలు ఇళ్లల్లో పెద్ద పెద్ద గొడవలకు దారి తీస్తుంటాయి. ఇలాంటి గొడవలు చివరికి హత్యలు, ఆత్మహత్యల వరకు వెళ్లిన సంఘటనలను మనం చూస్తూనే ఉన్నాం. భార్యాభర్తలు, తల్లీకుమార్తెలు, తండ్రి కొడుకుల మధ్య చిన్నగా మొదలైన మాటలు కాస్తా.. చివరికి ఎవరో ఒకరి ప్రాణాలు తీసే వరకు వెళ్లిన ఘటనలు ఉన్నాయి. తాజాగా ఓ ఇంట్లో నాటుకోడి కూర వండాలనే విషయంలో జరిగిన ఘర్షణ చివరికి తండ్రిని కుమారుడు చంపే వరకు వెళ్లింది. తండ్రి కోడి కూర వండాలని తల్లికి చెప్పగా.. ఆమె రేపు వండుదామని చెప్పడంతో గొడవ జరగగా.. వారి కుమారుడు తండ్రిని కొట్టి చంపడం తీవ్ర కలకలం రేపుతోంది.

జనగామ జిల్లా తరిగొప్పుల మండలం అక్కరాజుపల్లి గ్రామంలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జంగిలి రమేష్ (42) అనే వ్యక్తి.. మంగళవారం రోజున రాత్రి 10 గంటల సమయంలో నాటు కోడి కూర వండాలని తన భార్య అనూషకు చెప్పాడు. తాను నాటు కోడిని తీసుకునివచ్చి కోస్తానని.. కూర వండాలని అడిగాడు. అయితే అదే రోజు అనూష చేపలు తీసుకువచ్చి కూర వండింది. దీంతో ఇవాళ చేపలు వండాను కాబట్టి.. నాటుకోడిని తర్వాతి రోజు ఉదయం వండుతానని చెప్పింది. కానీ అందుకు రమేష్ వినలేదు. అయినా అతడికి సర్ది చెప్పేందుకు అనూష విశ్వ ప్రయత్నాలు చేసింది.

అయితే తాను చెప్పిన మాట భార్య వినలేదని రమేష్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. దీంతో తన భార్య అనూషను రమేష్ ఇష్టం వచ్చినట్లు బూతులు తిట్టాడు. అది చూసిన వారి కుమారుడు గణేష్ వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. తల్లిని ఎందుకు తిడుతున్నావంటూ తండ్రిని నిలదీశాడు. దీంతో రమేష్ మరింత ఆగ్రహానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే గణేష్‌ను కూడా రమేష్ తిట్టడం ప్రారంభించాడు. ఆపేందుకు ప్రయత్నించగా.. రమేష్ మరింత రెచ్చిపోవడంతో వారికి ఏం చేయాలో అర్థం కాలేదు.

ఈ క్రమంలోనే తన తండ్రి తిట్టే మాటలకు తీవ్ర ఆగ్రహానికి గురైన గణేష్.. పక్కనే ఉన్న రోకలి బండను తీసుకుని తండ్రి తలపై బలంగా కొట్టాడు. దీంతో అతడు అక్కడికక్కడే రక్తపు మడుగులో పడిపోయాడు. ఈ నేపథ్యంలోనే తీవ్రంగా గాయపడిన రమేష్‌ను స్థానికులు జనగామ ఆస్పత్రికి తరలించారు. అయితే అతడిని పరిశీలించిన డాక్టర్లు.. రమేష్‌ను వరంగల్ ఎంజీఎంకు తీసుకెళ్లాలని సూచించారు. ఈ క్రమంలోనే రమేష్‌ను వరంగల్ ఎంజీఎంకు తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం రోజున మృతి చెందాడు. రమేష్ సోదరుడు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chicken curry
  • crime news
  • Jangaon
  • Murder case
  • Son Killed Father
  • Tarigoppula
  • telangana

Related News

Amit Shah makes key remarks on alliances in Telangana.

Amit Shah: తెలంగాణలో పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో బీజేపీ పార్టీ పొత్తులకు సంబంధించి కేంద్రమంత్రి అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఏ ప్రాంతీయ పార్టీతోనూ పొత్తు ఉండదని తేల్చి చెప్పారు. ఒంటరిగానే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ హైకమాండ్ దృష్టి పెట్టినట్లు స్పష్టం చేశారు. ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో పొత్తులు పెట్టుకోవడం వల్ల బ

  • Heavy Rain Forecast for Telangana

    తెలంగాణను తాకిన నైరుతి రుతుపవనాలు

Latest News

  • Mavilan : రైతులకు గుడ్ న్యూస్.. కోర్టెవా ‘మావిలాన్’ ఆవిష్కరణ

  • BITS Pilani : ‘వికసిత్ భారత్’ దిశగా AM/NS ఇండియా – బిట్స్ పిలానీ

  • Amazon : అమెజాన్ ‘స్మార్ట్ ఛాయిస్’..ఎలక్ట్రానిక్స్ షాపింగ్‌లో సరికొత్త విప్లవం

  • Goddesses Lakshmi: ఇలాంటి వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది..!!

  • Chicken Curry: తండ్రి ప్రాణం తీసిన నాటుకోడి కూర

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd