HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >The Attack On The Chief Priest Of Jogulamba Temple

Jogulamba Temple Priest: జోగులాంబ ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కుడిపై వేటు? కార‌ణ‌మిదే?

పూజారి ఆనంద్ శర్మ తనపై కుట్ర చేస్తున్నాడని గుర్తించడంతో పాటు.. తన కుటుంబసభ్యుల సమాచారం సైతం ఎవరికో చెరవేస్తున్నాడని స్థానికంగా ఉన్న టూ టౌన్ పోలీస్ స్టేష‌న్‌లో ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు.

  • Author : Gopi Date : 26-02-2025 - 9:59 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Jogulamba Temple Priest
Jogulamba Temple Priest

Jogulamba Temple Priest: జోగులాంబ ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కుడు (Jogulamba Temple Priest) ఆనంద్ శ‌ర్మ‌పై వేటు ప‌డే ఛాన్స్ ఉంది. అలంపూర్ నియోజకవర్గ ద‌ళిత ఎమ్మెల్యే విజ‌యుడు ఇచ్చిన ఫిర్యాదుతో జిల్లా యంత్రాంగం క‌దిలింది. త‌న హ‌క్కుల‌కు భంగం క‌లిగించాడ‌ని అసెంబ్లీ స్పీక‌ర్ ప్ర‌సాద్ కుమార్ కు ఆలంపూర్ ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. సినిమా థియేట‌ర్‌కు భార్య‌, పిల్ల‌ల‌తో క‌లిసి ఎమ్మెల్యే వెళ్ల‌గా.. పూజారి ఆనంద్ శ‌ర్మ తన ముఖానికి మాస్క్ ధరించి వీడియోలు, ఫొటోలు తీశారు. అది గమనించిన ఎమ్మెల్యే ఎవ‌రు మీరు? ఎందుకు ఫొటోలు తీస్తున్నార‌ని ప్ర‌శ్నించారు. త‌న నియోజ‌క‌వ‌ర్గంలోని జోగులాంబ ఆల‌యం ప్ర‌ధాన అర్చ‌కుడు ఆనంద్ శ‌ర్మ తన ఫోటోలు, వీడియోలు తీసిన వ్యక్తి అని గుర్తించిన ఎమ్మెల్యే అలర్ట్ అయ్యారు.

పూజారి ఆనంద్ శర్మ తనపై కుట్ర చేస్తున్నాడని గుర్తించడంతో పాటు.. తన కుటుంబసభ్యుల సమాచారం సైతం ఎవరికో చెరవేస్తున్నాడని స్థానికంగా ఉన్న టూ టౌన్ పోలీస్ స్టేష‌న్‌లో ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ ప్రారంభించారు. కొన్నాళ్ళు ఆనంద్ శ‌ర్మ పరారయ్యాడు. తనపై, తన కుటుంభసభ్యులపై జరిగిన ఈ కుట్రపై ఎమ్మెల్యే విజ‌యుడు అసెంబ్లీ స్పీక‌ర్ ప్ర‌సాద్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. విషయం క్షుణ్ణంగా పరిశీలించిన స్పీకర్ ప్రసాద్ కుమార్ పూజారి ఆనంద్ శర్మపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ద‌ళిత ప్ర‌జాప్ర‌తినిధి ఫ్యామిలితో ఉండ‌గా పూజారి ఆనంద్ శర్మ ఇలా ఎందుకు చేశాడో సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ.. గద్వాల జిల్లా క‌లెక్ట‌ర్‌ను ఆదేశించారు.

Also Read: Mahakumbh: మ‌హా కుంభ‌మేళా.. 45 రోజుల్లో 65 కోట్ల మందికి పైగా భ‌క్తులు!

స్పీకర్ ఆదేశాలతో విచారణ జరుపుతున్న జిల్లా కలెక్టర్ మరో రెండు, మూడు రోజుల్లో నివేదిక స్పీకర్ కార్యాలయానికి అందజేయనున్నట్లు సమాచారం. క‌లెక్టర్ నివేదిక ఆధారంగా స్పీక‌ర్ నిర్ణ‌యం తీసుకోనున్నారు. త‌ప్పు చేసిన‌ట్లు తేలితే ఆనంద్ శ‌ర్మ‌పై చ‌ర్య‌లు తీసుకోమ‌ని స్పీక‌ర్ ఆదేశించే అవ‌కాశం ఉంది. గతంలోనూ ఆలయంలో నిధుల దుర్వినియోగం, అమ్మవారి ఆభరణాల మాయం కేసుల్లో ఆనంద్ శర్మపై ఆరోపణలు ఉన్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • jogulamba
  • Jogulamba Temple
  • Jogulamba Temple Priest
  • priest
  • telangana
  • telugu news

Related News

Actress Shweta Menon resigns as 'AMMA' President.

Shweta Menon: ‘అమ్మ’ అధ్యక్ష పదవికి నటి శ్వేతా మీనన్ రాజీనామా

మలయాళ నటీనటుల సంఘం ‘అమ్మ’ (Association of Malayalam Movie Artists – AMMA) లో ఊహించని రాజకీయ సునామీ చెలరేగింది. అంతర్గత కుమ్ములాటలు, మతపరమైన వేధింపుల ఆరోపణలు, ఆర్థిక వివాదాలు ముదరడంతో.. ‘అమ్మ’ ప్రెసిడెంట్, స్టార్ హీరోయిన్ శ్వేతా మేనన్‌తో పాటు మెజారిటీ కార్యవర్గ సభ్యులంతా మూకుమ్మడిగా తమ పదవులకు రాజీనామా చేశారు. శ్వేతా మేనన్ ఏకంగా అసోసియేషన్ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా వదిలేస్తున్నట్లు ప్రకటించడ

  • ‘Amazon Beautyverse 2026’ event concludes in Mumbai

    Amazon Beautyverse 2026: ముంబైలో ముగిసిన ‘అమెజాన్ బ్యూటీవర్స్ 2026’ ఈవెంట్

  • IMD Alert

    Rains : వారం రోజుల పాటు తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ

  • 'Towing' food app launched in Vijayawada.

    Toing Food Delivery app: విజయవాడలో ‘టోయింగ్’ ఫుడ్ యాప్ ప్రారంభం

  • MIssing Case

    Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

Latest News

  • Nitish Kumar Reddy: నితీశ్ కుమార్ రెడ్డికి గాయం.. ఐర్లాండ్ సిరీస్‌కు దూరం.. ఇంగ్లాండ్‌ టూర్‌కూ అనుమానమే.?

  • Anna Hazare: మహారాష్ట్ర ఆర్టీఐ నిబంధనల సవరణలను రద్దు చేయకపోతే.. జులై 5 నుంచి నిరవధిక నిరాహార దీక్ష: అన్నా హజారే

  • Nara Lokesh – Ram Charan: నారా లోకేష్‌తో పోలికపై రామ్ చరణ్ షాకింగ్ రియాక్షన్.. రిపబ్లిక్ సమిట్‌లో కామెంట్స్ వైరల్

  • Chandrababu : విశాఖ ఫార్మా సిటీ అగ్ని ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు విచారం

  • Revanth Reddy: మెట్రో రైల్ పై రేవంత్ విజయం

Trending News

    • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd