BRS : బిఆర్ఎస్ లో మొదలైన రాజీనామాలు..
- By Sudheer Published Date - 11:33 AM, Mon - 18 December 23

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ (BRS) ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. రెండుసార్లు అధికారం చేపట్టిన బిఆర్ఎస్ కు మూడోసారి మాత్రం ప్రజలు కాంగ్రెస్ (Congress) పార్టీకి పట్టం కట్టారు. దీంతో 119 స్థానాలకు గాను కేవలం 39 స్థానాల్లో విజయం సాధించి ప్రతిపక్ష పార్టీ హోదా దక్కించుకుంది. ఎన్నికల ముందు ఎలాగైతే కాంగ్రెస్ పార్టీలోకి వలసల పర్వం కొనసాగిందో..ఇప్పుడు కూడా అలాగే వలసల పర్వం కొనసాగుతుంది. అప్పుడు ఎమ్మెల్యే లు , మాజీ ఎమ్మెల్యేలు , మంత్రులు ఇలా కీలక నేతలు కాంగ్రెస్ గూటికి చేరితే..ఇప్పుడు కిందిస్థాయి నేతలు , జడ్పీటీసీ , ఎంపీటీసీ తదితరులు కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి (Thangallapalli ZPTC Manjula And Her Husband Resigns To BRS) మండలం జడ్పీటీసీ పూర్మాణి మంజుల, జిల్లా క్రికెట్ అసోసియేసన్ అధ్యక్షుడిగా ఉన్న ఆమె భర్త పూర్మాణి లింగారెడ్డి బీఆర్ఎస్‌కు టాటా చెప్పేశారు. నిన్న ఆ పార్టీకి రాజీనామా చేశారు. మంజుల రెండుసార్లు తంగళ్లపల్లి జడ్పీటీసీగా గెలుపొందారు. రాజీనామా అనంతరం మంజుల దంపతులు మాట్లాడుతూ.. పార్టీలో తమకు సరైన గుర్తింపు లభించడం లేదని, అందుకే రాజీనామా చేసినట్టు తెలిపారు. వీరిద్దరూ త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు సమాచారం.
Read Also : Seethakka: ఆదివాసీ గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తా: మంత్రి సీతక్క