TGSRTC: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. నేటి నుంచి టికెట్లపై రాయితీ
TGSRTC: రాజధాని నగరం హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు వెళ్లే ప్రయాణికులు ఎక్కువగా బస్సులను ఆధారపడుతుంటారు.
- By Kavya Krishna Published Date - 01:21 PM, Fri - 25 July 25

TGSRTC: రాజధాని నగరం హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు వెళ్లే ప్రయాణికులు ఎక్కువగా బస్సులను ఆధారపడుతుంటారు. ఈ మార్గంలో ప్రతిరోజూ వందల సంఖ్యలో గరుడ ప్లస్, ఈ గరుడ ప్లస్, రాజధాని ఏసీ, లహరి ఏసీ స్లీపర్, సూపర్ లగ్జరీ, లహరి నాన్ ఏసీ వంటి బస్సులు నడుస్తున్నాయి. పెరుగుతున్న ఇంధన ధరలు, ఇతర నిర్వహణ ఖర్చుల కారణంగా గతంలో టికెట్ ధరలు పెరిగినప్పటికీ, ఇప్పుడు ప్రయాణికులకు తాత్కాలిక ఉపశమనం లభించింది.
బీహెచ్‌ఈఎల్ డిపో మేనేజర్ సుధా ప్రకటన ప్రకారం కొత్తగా అమల్లోకి వస్తున్న బస్సుల బేసిక్ ధరలు ఈ విధంగా ఉన్నాయి:
- గరుడ ప్లస్ – పాత ధర రూ. 635 కాగా, కొత్త ధర రూ. 444 మాత్రమే. అంటే మొత్తం రూ. 191 రాయితీ.
- ఈ గరుడ ప్లస్ – పాత ధర రూ. 592, కొత్త ధర రూ. 438. అంటే రూ. 154 తగ్గింపు.
- రాజధాని ఏసీ – పాత ధర రూ. 533, కొత్త ధర రూ. 448. అంటే రూ. 85 రాయితీ.
- లహరి ఏసీ స్లీపర్ – పాత ధర రూ. 815, కొత్త ధర రూ. 685. అంటే రూ. 130 తగ్గింపు.
- సూపర్ లగ్జరీ – పాత ధర రూ. 440, కొత్త ధర రూ. 352. అంటే రూ. 88 రాయితీ.
- లహరి నాన్ ఏసీ – పాత ధర రూ. 538, కొత్త ధర రూ. 430. అంటే రూ. 108 తగ్గింపు.
ఈ రాయితీతో ప్రయాణికులు తక్కువ ఖర్చుతో సౌకర్యవంతమైన బస్సు సర్వీసులను ఉపయోగించుకోగలరని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ముఖ్యంగా రాబోయే సెలవు దినాలు, పండుగ సీజన్ దృష్ట్యా ఈ రాయితీ ప్రయాణికులకు బాగా ఉపయోగపడుతుందని చెప్పారు.
ఆర్టీసీ ఇప్పటికే డిస్కౌంట్ ప్యాకేజీలు, ముందస్తు బుకింగ్స్‌పై రాయితీలు అందిస్తున్న విషయం తెలిసిందే. ప్రయాణికుల డిమాండ్, పోటీ పరిస్థితులను బట్టి భవిష్యత్తులో మరిన్ని ఆఫర్లు ఇవ్వాలని ఆలోచిస్తున్నామని సంస్థ అధికారులు సంకేతాలు ఇచ్చారు.
Biryani leaves : బిర్యానీ ఆకులు..రుచి మాత్రమే కాదు,ఆరోగ్యానికి రహస్య ఆయుధం..ఎలాగంటే..?!