TGSRTC Cargo Services: ఇంటి వద్దకే టీజీఎస్ఆర్టీసీ కార్గో సేవలు.. 30 కేజీలకు ధర ఎంతంటే?
టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ సెంటర్స్ నుంచి హైదరాబాద్ లో ఎక్కడికైనా హోం డెలివరీ చేయవచ్చని చెప్పారు. రాబోయే రోజుల్లో ఇంటి నుంచి ఇంటి వరకు సేవలు అందించేలా లాజిస్టిక్స్ విభాగాన్ని టీజీఎస్ఆర్టీసీ అభివృద్ధి చేస్తోందని తెలిపారు.
- By Gopichand Published Date - 01:08 AM, Sun - 27 October 24

TGSRTC Cargo Services: తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నగరవాసులకు ఇంటి వద్దకే టీజీఎస్ఆర్టీసీ కార్గో సేవలు అందించనుందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. తమ ప్రత్యామ్నాయ ఆదాయాన్ని పెంచుకునేందుకు గాను లాజిస్టిక్స్ (TGSRTC Cargo Services) సేవలను టీజీఎస్ఆర్టీసీ మరింతగా విస్తరిస్తోందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అందులో భాగంగానే రాజధాని హైదరాబాద్ లో వేగవంతమైన సేవలను అందించేందుకు హోం డెలివరీ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆదివారం (ఈ నెల 27) నుంచి హైదరాబాద్ లోని 31 ప్రాంతాల నుంచి హోం డెలివరీ సేవలు అందుబాటులో ఉంటాయని వివరించారు.
టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ సెంటర్స్ నుంచి హైదరాబాద్ లో ఎక్కడికైనా హోం డెలివరీ చేయవచ్చని చెప్పారు. రాబోయే రోజుల్లో ఇంటి నుంచి ఇంటి వరకు సేవలు అందించేలా లాజిస్టిక్స్ విభాగాన్ని టీజీఎస్ఆర్టీసీ అభివృద్ధి చేస్తోందని తెలిపారు. ప్రజలందరూ హోం డెలివరీ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని వినియోగదారులను మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.
Also Read: WTC Final Qualification: వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్.. టీమిండియా ఫైనల్ చేరుకోగలదా?
అక్టోబర్ 27 నుంచి హైదరాబాద్లోని 31 ప్రాంతాలలో హోం డెలివరీ సేవలు అందుబాటులో ఉంటాయని మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారు. టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ కేంద్రాల నుంచి హైదరాబాద్లో ఎక్కడికైనా హోం డెలివరీ చేయనున్నామన్నారు. రాబోయే రోజుల్లో ఇంటి నుంచే ఆర్టీసీ కార్గో సేవలు అందించేలా టీజీఎస్ఆర్టీసీ ప్రణాళిక అభివృద్ది చేయనున్నట్లు మంత్రి తెలిపారు. హైదరాబాద్ నగరవాసులు హోం డెలివరీ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు.
పార్శిళ్ల హోం డెలివరీ చార్జీలివే!
– 0 నుంచి 1 కేజీ పార్శిల్‌కు రూ.50
– 1.01నుంచి 5 కేజీలకు రూ.60
– 5.01 నుంచి 10 కేజీలకు రూ.65
– 10.1 నుంచి 20 కేజీలకు రూ.70
– 20.1 నుంచి 30 కేజీలకు రూ.75
– 30.1 కేజీలు దాటితే.. పైన పేర్కొన్న స్లాబ్‌ల ఆధారంగా ధరలు ఉంటాయి.