HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Tgsrtc 7754 Special Buses For Bathukamma And Dussehra

TGSRTC: బ‌తుక‌మ్మ‌, దసరాకు టీజీఎస్ఆర్టీసీ 7754 ప్రత్యేక బస్సులు!

సద్దుల బతుకమ్మ ఈ నెల 30న దసరా అక్టోబర్ 2న ఉన్నందున సెప్టెంబర్ 27 నుంచి ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని TSRTC ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచనుంది.

  • Author : Gopi Date : 18-09-2025 - 4:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
TGSRTC
TGSRTC

TGSRTC: బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ పండుగలకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 7754 ప్రత్యేక బస్సులను నడపడానికి ప్రణాళిక సిద్ధం చేసింది. వీటిలో 377 ప్రత్యేక సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సదుపాయం కల్పించారు. ఈ నెల 20 నుంచి అక్టోబర్ 2 వరకు ఈ ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి.

ప్రయాణ ఏర్పాట్లు, ఛార్జీలు

సద్దుల బతుకమ్మ ఈ నెల 30న దసరా అక్టోబర్ 2న ఉన్నందున సెప్టెంబర్ 27 నుంచి ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని TSRTC ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచనుంది. అంతేకాకుండా తిరుగు ప్రయాణానికి సంబంధించి అక్టోబర్ 5, 6 తేదీల్లో కూడా రద్దీకి అనుగుణంగా బస్సులను ఏర్పాటు చేయనుంది.

దసరా ప్రత్యేక బస్సుల్లో మాత్రమే ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 16 ప్రకారం తిరుగు ప్రయాణంలో ఖాళీగా వచ్చే బస్సులకు అయ్యే డీజిల్ ఖర్చుల మేరకు టికెట్ ధరలను సంస్థ సవరిస్తుంది. ఈ సవరించిన ఛార్జీలు సెప్టెంబర్ 20, 27 నుండి 30 వరకు, అలాగే అక్టోబర్ 1, 5, 6 తేదీల్లో నడిచే స్పెషల్ బస్సులకు మాత్రమే వర్తిస్తాయి. సాధారణ సర్వీసుల ఛార్జీలలో ఎటువంటి మార్పు ఉండదు.

Also Read: OG Ticket : ‘OG’ మూవీ టికెట్ రేట్స్ పెరిగింది..వివాదం మొదలైంది

హైదరాబాద్‌లో ప్రత్యేక బస్సుల సేవలు

హైదరాబాద్‌లోని ప్రధాన బస్టాండ్‌లైన ఎంజీబీఎస్ (MGBS), జేబీఎస్ (JBS), సీబీఎస్ (CBS)తో పాటు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే కేపీహెచ్‌బీ కాలనీ, ఉప్పల్ క్రాస్ రోడ్స్, దిల్ సుఖ్ నగర్, ఎల్బీనగర్, ఆరాంఘర్ వంటి ప్రాంతాల నుంచి కూడా ప్రత్యేక బస్సులను సంస్థ నడపనుంది. ఈ బస్సులు హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి రాష్ట్రం నలుమూలలతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు కూడా నడుస్తాయి.

ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ సందేశం

TSRTC మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనర్ మాట్లాడుతూ.. పండుగలకు ప్రజలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడానికి సంస్థ సిద్ధంగా ఉందని తెలిపారు. గత దసరా కంటే ఈసారి అదనంగా 617 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామన్నారు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో షామియానాలు, కుర్చీలు, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. పోలీసు, రవాణా, మున్సిపల్ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. అనుభవం గల డ్రైవర్లు ఉండటం వల్ల TSRTC బస్సుల్లో సురక్షితమైన ప్రయాణం ఉంటుందని, ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించి ఇబ్బందులు పడొద్దని ప్రజలకు ఆయన సూచించారు.

ముందస్తు రిజర్వేషన్ల కోసం

  • బతుకమ్మ, దసరా ప్రత్యేక సర్వీసుల్లో ముందస్తు రిజర్వేషన్లను సంస్థ అధికారిక వెబ్‌సైట్ tgsrtcbus.inలో చేసుకోవచ్చు.
  • మరిన్ని వివరాల కోసం టీఎస్‌ఆర్టీసీ కాల్‌ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033లను సంప్రదించాలని సూచించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bathukamma
  • dussehra
  • hyderabad
  • telangana
  • telugu news
  • TGSRTC

Related News

Hyderabad Woman Disappears After Dispute Over Eating Curd

పెరుగు తినమని చెప్పినందుకు ఇల్లు వదిలి వెళ్లిపోయిన భార్య

హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీలో రాజేశ్వరి అనే వివాహిత అదృశ్యమైంది. ఆమెను భర్త శివకుమార్ ‘పెరుగు తింటే లావు అవుతావు’ అని అన్నందుకు మనస్తాపం చెంది ఇంట్లోంచి వెళ్లిపోయింది. భర్త సరదాగా అన్న మాటలను రాజేశ్వరి సీరియస్‌గా తీసుకుని ఎవరికీ చెప్పకుండా అదృశ్యమైంది. దీంతో ఆమె కోసం బంధువుల ఇళ్లలో వెతికినా ఫలితం లేకపోవడంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుక

  • Dhoni Srh Match

    2026 IPL SRH – CSK Match : రేపటి మ్యాచ్ లో ధోని ఆడుతున్నాడా..?

  • Twins Same Marks in Intermediate Results 2026

    ఇంటర్ ఫలితాల్లో ఒకే మార్కులు సాధించిన కవలలు

  • Sanjana

    Actress Sajini : హైదరాబాద్‌లో మలయాళ నటిపై దాడి !!

  • LPL Financial opens first GCC outside US in Hyderabad

    హైదరాబాద్‌లో ఎల్‌పీఎల్ ఫైనాన్షియల్ భారీ పెట్టుబడి.

Latest News

  • బీజేపీ మాజీ ఎంపీ మృతి.. పీఎం మోదీ సంతాపం

  • అజింక్యా ర‌హానే ఖాతాలో మ‌రో చెత్త రికార్డు!

  • హోర్ముజ్ జలసంధి నుండి బ‌య‌ట‌ప‌డిన భార‌త నౌక‌!

  • సీజ్‌ఫైర్‌పై నీలినీడలు?

  • టీమిండియా ఖాతాలో మ‌రో ఓట‌మి!

Trending News

    • గల్ఫ్ దేశాల్లో కొనసాగుతున్న ఉత్కంఠ.. హోర్ముజ్ జలసంధికి పొంచి ఉన్న ముప్పు!

    • ఏసీ నడపడానికి ఎంత సోలార్ సామర్థ్యం ఉండాలి?

    • Punarvika: చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్‌ తెప్పించిన లోకేశ్‌

    • అక్షయ తృతీయ 2026.. లక్ష్మీ పూజ కోసం ఇంటిని ఎలా సిద్ధం చేయాలి?

    • నేడు ఢిల్లీతో ఆర్సీబీ ఢీ.. ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా కోహ్లీ?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd