10th Results : రేపే తెలంగాణ లో టెన్త్ క్లాస్ రిజల్ట్స్..ఫలితాలు ఇలా చెక్ చేసుకోవచ్చు
10th Results : తెలంగాణలో ఇంటర్ ఫలితాల అనంతరం టెన్త్ ఫలితాలపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు
- By Sudheer Published Date - 04:34 PM, Tue - 29 April 25

తెలంగాణలో పదవ తరగతి ఫలితాల (10th Results) విడుదలకు సమయం దగ్గరపడింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో టెన్త్ మరియు ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల కాగా, తెలంగాణలో ఇంటర్ ఫలితాల అనంతరం టెన్త్ ఫలితాలపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే మెమోల్లో మార్పులు, మార్కుల కంప్యూటరైజేషన్ వంటి సాంకేతిక కారణాలతో ఫలితాల విడుదల ఆలస్యం అయింది. ప్రస్తుతం అంత సెట్ అవ్వడం తో రేపు( ఏప్రిల్ 30న) ఫలితాలు విడుదల చేయబోతున్నారు.
Euro Adhesives : యూరో అడెసివ్ ఫ్యామిలీలో చేరిన బాలీవుడ్ స్టార్ పంకజ్ త్రిపాఠి
ఈసారి టెన్త్ పరీక్షలు మార్చి 21 నుండి ఏప్రిల్ 4 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించబడ్డాయి. దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాల విడుదలకు సంబంధించి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ద్వారా ఫలితాలను ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు. విద్యార్థులు తమ ఫలితాలను తెలంగాణ బోర్డు అధికారిక వెబ్‌సైట్ https://bse.telangana.gov.in ద్వారా చూసుకోవచ్చు. అలాగే ఫలితాల విడుదల తర్వాత నెల రోజుల వ్యవధిలో సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.
ఈసారి ఫలితాల మెమోల్లో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఇప్పటివరకు గ్రేడింగ్ ఆధారంగా మెమోలు జారీ చేస్తుండగా, ఇక నుంచి ప్రతి సబ్జెక్టులో సాధించిన మార్కులు కూడా మెమోలో చూపించనున్నారు. 80 మార్కులు ఫైనల్ పరీక్షల కోసం, మిగిలిన 20 మార్కులు ఇంటర్నల్స్ ద్వారా లెక్కించబడతాయి. మెమోలో గ్రేడింగ్‌తో పాటు, ఇంటర్నల్ మరియు ఎక్స్‌టర్నల్ మార్కుల వివరాలు స్పష్టంగా చూపించనున్నారు.