Teenmaar Mallanna Office: తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి.. తుపాకీతో గాల్లోకి కాల్పులు?
క్యూ న్యూస్ కార్యాలయంపై జాగృతి కార్యకర్తలు దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఎమ్మెల్సీ కవితపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యలకు నిరసన తెలిపేందుకు క్యూ న్యూస్ కార్యాలయానికి జాగృతి కార్యకర్తలు వెళ్లినట్లు తెలుస్తోంది.
- By Gopichand Published Date - 01:33 PM, Sun - 13 July 25

Teenmaar Mallanna Office: కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయం (Teenmaar Mallanna Office)పై తాజాగా దాడి జరిగింది. హైదరాబాద్‌లోని మేడిపల్లిలోని ఆఫీస్‌పై దాడి జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఈ దాడి చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సంఘటనలో కార్యాలయంలోని ఫర్నిచర్, కంప్యూటర్లు, అద్దాలు ధ్వంసం చేయబడ్డాయి. దాడిని అడ్డుకునేందుకు మల్లన్న గన్‌మెన్ గాల్లోకి ఐదు రౌండ్లు కాల్పులు జరిపినట్లు సమాచారం. ఈ ఘటనతో ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు విచారణ చేపట్టారు.
తీన్మార్ మల్లన్న గతంలో కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల కారణంగా ఆయన దాడులకు గురయ్యాడు. 2021, 2023లో కూడా అతని కార్యాలయంపై దాడులు జరిగాయి. వీటిని బీఆర్ఎస్ సమర్థకులు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
Also Read: Gold Rate: వచ్చే వారంలో రూ. లక్ష దాటనున్న బంగారం ధర.. రూ. 15,300 పెరిగిన రేట్స్!
బ్రేకింగ్ న్యూస్
క్యూ న్యూస్ కార్యాలయంపై జాగృతి కార్యకర్తలు దాడి
ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
నిరసన తెలిపేందుకు క్యూ న్యూస్ కార్యాలయానికి వెళ్లిన జాగృతి కార్యకర్తలు
నిరసన తెలుపడానికి వచ్చిన వారిపై కాల్పులు జరిపిన తీన్మార్ మల్లన్న గన్… pic.twitter.com/LEI0N8TOhL
— Telugu Scribe (@TeluguScribe) July 13, 2025
నిరసన తెలిపేందుకు వెళ్లి దాడి?
క్యూ న్యూస్ కార్యాలయంపై జాగృతి కార్యకర్తలు దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఎమ్మెల్సీ కవితపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యలకు నిరసన తెలిపేందుకు క్యూ న్యూస్ కార్యాలయానికి జాగృతి కార్యకర్తలు వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే నిరసన తెలుపడానికి వెళ్లిన వారిపై తీన్మార్ మల్లన్న గన్ మెన్లు కాల్పులు జరపడంతో కవిత మద్దతుదారులు ఈ దాడి చేసినట్లు తెలుస్తోంది. వంద మంది జాగృతి నాయకులు తీన్మార్ మల్లన్నపై రాడ్లతో దాడి చేసినట్లు కూడా సమాచారం. ఈ గొడవలో మల్లన్న గన్ మెన్‌కు, జాగృతి నాయకులకు గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై మేడిపల్లి ఏసీపీ, సీఐ, పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.