TSRTC Bus Accident: వికారాబాద్ జిల్లాలో పొదల్లోకి దూసుకెళ్లిన ఆర్‌టిసి బస్సు
వికారాబాద్ జిల్లా పరిధిలోని అనంతగిరి కొండల వద్ద శనివారం టిఎస్‌ఆర్‌టిసి బస్సు అదుపుతప్పి పొదల్లోకి దూసుకెళ్లడంతో 10 మంది గాయపడ్డారు.సుమారు 100 మంది ప్రయాణికులతో టిఎస్‌ఆర్‌టిసి
- Author : Praveen Aluthuru
Date : 13-01-2024 - 9:31 IST
Published By : Hashtagu Telugu Desk
TSRTC Bus Accident: వికారాబాద్ జిల్లా పరిధిలోని అనంతగిరి కొండల వద్ద శనివారం టిఎస్‌ఆర్‌టిసి బస్సు అదుపుతప్పి పొదల్లోకి దూసుకెళ్లడంతో 10 మంది గాయపడ్డారు.సుమారు 100 మంది ప్రయాణికులతో టిఎస్‌ఆర్‌టిసి ఎక్స్‌ప్రెస్ బస్సు వికారాబాద్ నుండి తాండూరుకు వెళ్తుండగా అనంతగిరి హిల్స్ రోడ్డులోని హెయిర్‌పిన్ వంక వద్ద డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. బ్రేక్ ఫెయిల్ కావడంతో ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో బస్సు ముందరి భాగం పాక్షికంగా దెబ్బతింది.
ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యల్లో భాగంగా క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వికారాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పొదల్లో చిక్కుకున్న బస్సును.. క్రేన్ సహాయంతో బయటకు తీశారు. డ్రైవర్ అప్రమత్తత వల్లే ప్రమాద తీవ్రత తగ్గినట్టు ప్రయాణికులు చెప్పారు. ఎవ్వరికీ ఎలాంటి ప్రాణహాని జరగకపోవటంతో.. అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Also Read: DK Shivakumar: బెంగళూరు ట్రాఫిక్ ఉల్లంఘనలను పర్యవేక్షించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్