HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Telugu Student Goes Missing In Finland

Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

  • Author : Prasad Date : 19-06-2026 - 5:25 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
MIssing Case
MIssing Case

ఫిన్లాండ్‌లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న హైదరాబాద్‌కు చెందిన ఓ విద్యార్థి 45 రోజులుగా అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. కుమారుడి ఆచూకీ కోసం తీవ్ర ఆందోళనకు గురైన తల్లిదండ్రులు చివరకు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. హయత్‌నగర్‌కు చెందిన గుజ్జ మణిదీప్ రెడ్డి, ఫిన్లాండ్‌లోని లాహ్తిలో ఉన్న LUT యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్నాడు. మే 5న తన కుటుంబ సభ్యులతో చివరిసారిగా మాట్లాడిన తర్వాత అతని నుంచి ఎలాంటి సమాచారం అందలేదు. ఆ రోజు తాను ఒక బేకరీ వద్ద ఉన్నానని, అక్కడి నుంచి తన నివాసానికి వెళ్తున్నానని తల్లికి చెప్పిన మణిదీప్, కొంత డబ్బు కూడా పంపించాలని కోరినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఆ తర్వాత అతని ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో పాటు, సోషల్ మీడియా, ఇతర కమ్యూనికేషన్ మార్గాల ద్వారా కూడా ఎలాంటి స్పందన లేకపోవడంతో కుటుంబం ఆందోళన చెందింది. ఫిన్లాండ్‌లోని అతని స్నేహితులు, రూమ్‌మేట్స్‌ను సంప్రదించినప్పటికీ సరైన సమాచారం లభించలేదని తల్లిదండ్రులు వెల్లడించారు. యూనివర్సిటీ యాజమాన్యం కూడా స్పష్టమైన వివరాలు ఇవ్వలేకపోవడంతో, గుజ్జ మర్ణత, ముత్యం రెడ్డి దంపతులు తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ బి. విజయసేన్ రెడ్డి, కేంద్ర ప్రభుత్వం, విదేశాంగ శాఖ, ఫిన్లాండ్‌లోని భారత రాయబార కార్యాలయం, తెలంగాణ పోలీసులు తదితర అధికారులను వివరణ ఇవ్వాలని ఆదేశించారు.

ఫిన్లాండ్‌లో స్థానిక పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే గాలింపు చర్యల్లో పురోగతి కనిపించకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మణిదీప్‌ను గుర్తించేందుకు డిజిటల్, బ్యాంకింగ్, విద్యా, రవాణా, సీసీటీవీ రికార్డులను పరిశీలించాలని, భారత ప్రభుత్వం దౌత్యపరమైన చర్యలు వేగవంతం చేయాలని వారు కోరుతున్నారు.జూన్ 24న ఈ కేసును తెలంగాణ హైకోర్టు మళ్లీ విచారించనుంది. అప్పటివరకు తమ కుమారుడి క్షేమ సమాచారం కోసం కుటుంబ సభ్యులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • missing case
  • telangana
  • telugu student

Related News

CM Chandrababu

CM Chandrababu : సీఎం చంద్ర‌బాబుని క‌లిసిన గాదె సాయికృష్ణ త‌ల్లి

విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ అదృశ్యం ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. సాయికృష్ణ తల్లి గాదె విజయలక్ష్మి శనివారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసి తన కుమారుడి అదృశ్యం కేసుపై న్యాయమైన విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా విజయలక్ష్మితో మాట్లాడిన ముఖ్యమంత్రి.. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేస

  • Kesineni Nani

    Kesineni Nani : గాదే సాయికృష్ణ మిస్సింగ్ కేసుపై చంద్ర‌బాబుకు లేఖ రాసిన మాజీ ఎంపీ కేశినేని నాని

  • Engineering counselling in Telangana begins today.

    TS EAPCET 2026: తెలంగాణలో నేటి నుంచి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్

  • Alert for gas consumers: June 30 is the final deadline. These requirements must be met—otherwise, the connection will be disconnected.

    LPG Gas Subsidy: గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. జూన్ 30 వరకే డెడ్ లైన్.. ఇవి తప్పక పాటించాల్సిందే.. లేదంటే కనెక్షన్ కట్

  • Pawan Kalyan's tour in Telangana... Janasena chief to fulfill a young child's last wish.

    Pawan Kalyan: తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటన.. చిన్నారి చివరి కోరిక తీర్చనున్న జనసేనాని

Latest News

  • Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

  • Janasena: తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించిన పవన్ కల్యాణ్

  • Shani Anugraham: శని పీడ తొలగిపోవాలంటే శనీశ్వరుడికి.. ఈ వస్తువు సమర్పించాల్సిందే!

  • Pista: ఈ సీజన్‌లో పిస్తా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు!

  • Pregnancy: పీరియడ్స్ టైం లో శృంగారంలో పాల్గొంటే ప్రెగ్నెన్సీ వచ్చినట్లేనా..?

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd