School Holidays : హాలిడేస్ క్యూ.. విద్యార్థులకు వచ్చేవారం వరుస సెలవులు
ఆ సెలవుల్లో సరదాగా గడిపేందుకు చాలామంది ఇప్పటి నుంచే ప్లానింగ్స్ చేసుకుంటున్నారు. హాలిడేస్ టైంలో కొన్ని పండుగలు కూడా వస్తుండటంతో కోలాహలం నెలకొంది.
- By Pasha Published Date - 08:16 AM, Thu - 8 August 24

School Holidays : తెలుగు రాష్ట్రాల్లో వచ్చేవారం వరుస సెలవులు ఉన్నాయి. ఈ హాలిడేస్ అవకాశం ఎంతోమంది విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులకు లభించనుంది. ఆ సెలవుల్లో సరదాగా గడిపేందుకు చాలామంది ఇప్పటి నుంచే ప్లానింగ్స్ చేసుకుంటున్నారు. హాలిడేస్(School Holidays) టైంలో కొన్ని పండుగలు కూడా వస్తుండటంతో కోలాహలం నెలకొంది.
We’re now on WhatsApp. Click to Join
- ఆగస్టు 15న (గురువారం) స్వాతంత్య్ర దినోత్సవ సెలవు ఉంది.
- ఆగస్టు 16న (శుక్రవారం) శ్రావణమాసం తొలి శుక్రవారం కావడంతో ఆ రోజున వరలక్ష్మీ వ్రతం పాటిస్తారు.
- ఆగస్టు 18న సండే సెలవు.
- ఆగస్టు 19న(సోమవారం) రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా స్కూళ్లు, కాలేజీలు, ఉద్యోగులకు సెలవు.
- సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేసే వారికి శనివారం రోజూ ఎలాగు వీకెండ్ హాలిడేస్ ఉండనే ఉంటాయి.
- పైన మనం చెప్పుకున్న ప్రకారం.. ఆగస్టు 15, 16, 18, 19 తేదీల్లో సెలవులు ఉన్నాయి. ఆగస్టు 17న ఒక్క శనివారం రోజే వర్కింగ్ డే ఉంది.
- ఇక ఆగస్టు 10న రెండో శనివారం కావడంతో పాఠశాలలకు, కొందరు ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు ఉంటుంది.
- ఆగస్టు 24న నాలుగో శనివారం కావడంతో ఆ రోజున బ్యాంకు ఉద్యోగులకు సెలవు వస్తుంది.
- ఆగస్టు 9న అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా తెలంగాణలో సెలవు ప్రకటించే అవకాశం ఉంది.
- ఆగస్టు 26న శ్రీ కృష్ణ జన్మాష్టమి సెలవు ఉంది.
- పైవన్నీకలుపుకుంటే ఆగస్టు నెలలో స్కూల్స్, కాలేజీలకు 10 రోజుల దాకా సెలవులు వస్తాయి.
Also Read :RTC : ఆర్టీసీలో త్వరలో ఆ బస్సులు.. ఎవరైనా టికెట్ కొనాల్సిందే
తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాదిలో..
ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి అక్టోబరు 4 నుంచి 13 వరకు దసరా సెలవులు ఉంటాయి. క్రిస్టియన్ మైనార్టీ విద్యాసంస్థలకు దసరా సెలవులు అక్టోబరు 11 నుంచి 13 వరకు ఉంటాయి. అక్టోబరు 31న దీపావళి పండుగ ఉంది. డిసెంబరు 25న క్రిస్మస్ ఉంది. అయితే క్రిస్టియన్ మైనార్టీ విద్యాసంస్థలకు క్రిస్మస్ సెలవులు డిసెంబరు 20 నుంచి 29 వరకు ఉంటాయి. సంక్రాంతి సెలవులు 2025 జనవరి 10 నుంచి 19 వరకు ఉంటాయి. ఇక తెలంగాణలో దసరా సెలవులు అక్టోబర్ 2 నుంచి 14 వరకు ఉంటాయి. సంక్రాంతి సెలవులు 2025 జనవరి 13 నుంచి 17 వరకు ఉంటాయి. అక్టోబరు 31న దీపావళి సెలవు ఉంది. ఇక డిసెంబర్ 23 నుంచి 27 వరకు తెలంగాణలో క్రిస్మస్ సెలవులు ఉంటాయి.